హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR| KTR: టీఆర్ఎస్ ప్లాన్ మారిందా ? రంగంలోకి కేటీఆర్.. ఎమ్మెల్యేలందరికీ చివరి నిమిషం వరకు టెన్షన్ ?

KCR| KTR: టీఆర్ఎస్ ప్లాన్ మారిందా ? రంగంలోకి కేటీఆర్.. ఎమ్మెల్యేలందరికీ చివరి నిమిషం వరకు టెన్షన్ ?

కేటీఆర్, కేసీఆర్ (ఫైల్ పోటో)

కేటీఆర్, కేసీఆర్ (ఫైల్ పోటో)

KTR| TRS: ఉన్నట్టుండి స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగి జూపల్లి ఇంటికి వెళ్లి చర్చలు జరపడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

  రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. పరిస్థితులు మారడాన్ని బట్టి నేతలు కూడా తమ ప్రాధాన్యతలు మార్చుతుంటారు. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఇదే జరుగుతోందనే చర్చ జరుగుతోంది. ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాజీమంత్రి జూపల్లి కృష్ణారావును (Jupallay Krishna Rao)ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. కొంతకాలంగా పార్టీ మారాలనే ఉద్దేశ్యంతో ఉన్న జూపల్లి కృష్ణారావును తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కేటీఆర్(KTR) కోరినట్టు వార్తలు వచ్చాయి. నిజానికి రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా జూపల్లిని టీఆర్ఎస్ నాయకత్వం లైట్ తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్(Kollapur) మున్సిపల్ పరిధిలో 10 మంది తన అనుచరులను పోటీలో నిలిపి గెలిపించుకున్నా.. టీఆర్ఎస్(TRS) నాయకత్వం మాత్రం ఆయనను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో టీఆర్ఎస్‌లో జూపల్లి కృష్ణారావు పనైపోయిందనే చర్చ జరిగింది.

  అయితే ఉన్నట్టుండి స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగి జూపల్లి ఇంటికి వెళ్లి చర్చలు జరపడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే వచ్చే ఎన్నికల్లో గతంలో మాదిరిగా ఎక్కువగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఛాన్స్ ఇవ్వకుండా.. గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని టీఆర్ఎస్ యోచిస్తోంది. ఈ క్రమంలో కొంతకాలం నుంచి సర్వేలు చేయిస్తోంది. ఆ సర్వేల్లో ఎవరికి మొగ్గు ఉంటే.. వారికే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.

  ఈ నేపథ్యంలోనే కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావుకు నివేదికలు అనుకూలంగా ఉన్నాయని.. అందుకే మరోసారి టీఆర్ఎస్ నాయకత్వం ఆయన వైపు మొగ్గుచూపుతోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి వచ్చే ఎన్నికల్లో ఎలాగోలా మళ్లీ కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలవాలని జూపల్లి గట్టి పట్టుదలగా ఉన్నారు. ఇందుకోసం ఆయన క్షేత్రస్థాయిలోనే ఉంటున్నారు. నియోజకవర్గంపై తనుకున్న పట్టును మరింతగా పెంచుకుని రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటిక నుంచే వ్యూహాలు రచిస్తున్నారు.

  Central Funds: బెంగాల్‌కు కేంద్రం నిధులు బంద్.. మనదాకా వస్తే కేసీఆర్, జగన్ ఏం చేస్తారో..?

  CM KCR | Centre : రూ.40వేల కోట్ల తెలంగాణ భూములు అమ్ముకోనున్న కేంద్రం: KTR ఘాటు లేఖ

  జూపల్లి కృష్ణారావు ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయని.. ఈ విషయం టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న సర్వేల్లో కూడా తేలిందని కొందరు చర్చించుకుంటున్నారు. ఒకవేళ జూపల్లి కృష్ణారావు బీజేపీ వైపు చూస్తే తమకు ఇబ్బందులు వస్తాయని భావించిన టీఆర్ఎస్ నాయకత్వం.. ఆయన అటు వైపు చూడకుండా ఉండేందుకు ముందుగానే రంగంలోకి దిగి ప్రయత్నాలు చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, KTR, Telangana

  ఉత్తమ కథలు