TS POLITICS KTR COUNTERS THE COMMENTS OF BJP LEADERS WHO ARE MAKING HYDERABAD A BHAGYANAGARAM SNR
BJP | TRS : మేం వస్తే భాగ్యనగరంగా మార్చేస్తాం .. ముందు అక్కడ మార్చి చూపించండి .."హైదరాబాద్ టైటిల్ ఫైట్ "
(ప్రతీకాత్మకచిత్రం)
BJP | TRS: తెలంగాణలో ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఢంకా భజాయించి చెబుతున్న కమలనాథులు ..అధికారంలోకి రాగానే హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చేస్తామన్నారు. అయితే చారిత్రక పట్టణంగా ఉన్న హైదరాబాద్ పేరు మార్పు అంశంపై ఇతర పార్టీలు స్పందించనప్పటికి టీఆర్ఎస్ మాత్రమే కలుగచేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమమవుతోంది.
హైదరాబాద్ (Hyderabad)పేరు మార్చడం జరుగుతుందా ..కమలనాథుల ఆలోచన నిర్ణయం వెనుక ఆంతర్యమేమిటి ..హైదరాబాద్‌ను బీజేపీ (BJP)భాగ్యనగరంగా మార్చేస్తామంటే రాష్ట్ర అధికార పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ (TRS)మాత్రమే ఎందుకంతలా రియాక్ట్ అవుతోంది? బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత తెలంగాణలో ఈ అంశాలపైనే విస్తృతమైన చర్చ జరుగుతోంది. రెండ్రోజుల బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలనే ప్రతిపాదనపై చర్చించారు ఆపార్టీ అగ్రశ్రేణి నాయకులు.
మళ్లీ అదే టాపిక్‌పై చర్చ..
సమావేశాల ముగింపు సందర్భంగా విజయ సంకల్పసభ వేదికగా ప్రధాని మోదీ నోటి వెంట భాగ్యనగరం అనే మాట రావడంతో బీజేపీ శ్రేణులు మరింత గట్టిగా నమ్ముతున్నారు. అంతే కాదు బీజేపీ నేత దినేష్‌శర్మ సైతం భాగ్యలక్ష్మి అమ్మవారు నెలవైన ఈ గడ్డను పూర్వకాలం నుంచి భాగ్యనగరమనే పిలిచేవారని గుర్తు చేశారు. త్వరలో భాగ్యనగరం మారబోతోందని, అభివృద్ధి చెందబోతోందని చెప్పడం విశేషంగా చూడాలి.
భాగ్యనగరంగా మారేనా..
హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని బీజేపీ నేతలు ఇప్పుడు చెబుతున్న మాట కాదు. 2020జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ అప్పుడే చెప్పారు. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైజాబాద్‌ను అయోధ్యగా, అలహాబాద్‌ని ప్రయాగరాజ్‌గా మార్చామన్నారు. అలాగే హైదరాబాద్ కూడా భాగ్యనగరంగా మార్చితే తప్పేంటన్నారు. ఈసారి జాతీయకార్యవర్గ సమావేశాలకు వచ్చిన ఆయన చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. యూపీ సీఎం యోగీనే కాదు జార్ఖాండ్ మాజీ సీఎం రఘబర్‌దాస్ కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ భాగ్యనగరంగా మారుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
కేటీఆర్ కౌంటర్ ట్వీట్..
విశ్వనగరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ని భాగ్యనగరంగా మార్చుతామని కమలనాథులు చెప్పడాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఖండిస్తూ కౌంటర్ ఇచ్చారు.అహ్మదాబాద్ పేరుని అదానీబాద్‌గా ఎందుకు మార్చరంటూ ట్వీట్ చేశారు. ముందు ఆ పని చేయమని రఘబర్ దాస్ ట్వీట్‌ని ట్యాగ్ చేశారు కేటీఆర్.
Why don’t you change Ahmedabad’s name to Adanibad first?
అసలు కారణం ఇదేనా..
బీజేపీ నేతల స్టేట్మెంట్పై మరే ఇతర పార్టీలు స్పందించకపోవడం చూస్తుంటే హిందుత్వ సమాజాన్ని బీజేపీ గౌరవిస్తోందని నమ్ముతున్నాయి కాబట్టే అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మజ్లీస్‌తో స్నేహబంధాన్ని కొనసాగిస్తోంది. వారి కలయికను ఉద్దేశించే విజయ సంకల్ప్ సభ వేదికపై అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో టీఆర్ఎస్ ఉన్నప్పటికి స్టీరింగ్ మాత్రం మజ్లీస్ పార్టీ చేతిలో ఉందంటూ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అంటే మజ్లీస్ చేతిలో ఉన్న స్టీరింగ్ తీసుకోవడమేనని బీజేపీ శ్రేణులు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.