Home /News /telangana /

TS POLITICS KONDA VISHWESHWAR REDDY WHO APPEARED IN THE VIJAYASANKALP SABHA TWEETED THAT HE WAS JOINING THE BJP SNR

కాషాయదళంలోకి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి .. పార్టీ మారుతున్నట్లు మాజీ ఎంపీ ట్వీట్

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Telangana: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు. ఈవిషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.ఇందులో భాగంగానే పరేడ్‌గ్రౌండ్‌లో జరుగుతున్న విజయ్ సంకల్ప్ సభ వేదికపై కొద్దిసేపటి క్రితమే ప్రత్యక్షమయ్యారు. ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డా, సమక్షంలో విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు.

ఇంకా చదవండి ...
ముందు నుంచి చెప్పుకుంటున్నట్లుగానే తెలంగాణ బీజేపీ(BJP)లో చేరికలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగానే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Konda Vishweshwar Reddy) భారతీయ జనతాపార్టీలో చేరుతున్నట్లుగా ఆయనే స్వయంగా ట్విట్టర్Twitter వేదికగా ప్రకటించారు. తన ట్విట్టర్ ఖాతాలో ప్రధాని మోదీ(Modi), కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah),బీజేపీ చీఫ్‌ నడ్డా(Nadda)తో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy), తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌(Bandi Sanjay)ఫోటోలతో కూడిన ఓ గ్రూప్‌ ఫోటోని ఆయన తన ట్విట్‌తో ట్యాగ్ చేశారు. తన చేరికపై అధికారిక ప్రకటన చేశారు. ఆదివారం సాయంత్రం పరేడ్‌ గ్రౌండ్స్‌(Parade Grounds)లో జరుగుతున్న బహిరంగసభ వేదికపై బీజేపీలో చేరుతున్నానని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలియజేశారు.

బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే ప్రధాని తెలంగాణ పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన తన చేరికను కన్ఫామ్ చేశారు. అందులో భాగంగానే సాయంత్రం ప్రారంభమైన విజయ సంకల్ప్ సభ వేదికపై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రత్యక్షమయ్యారు. తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్‌ తరుణ్‌చుగ్‌తో పాటు చేయి చేయి కలిపి ఆయన సభా వేదికపై కనిపించారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో చేయి కలిపి పైకి ఎత్తి చేరినట్లుగా తరుణ్‌చుగ్‌ సంకేతం ఇచ్చారు.

స్వయంగా ప్రకటన..
టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల్లో కొనసాగిన విశ్వేశ్వర్‌రెడ్డి గత కొద్ది రోజులుగా రెండు పార్టీలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన తిరిగి కాంగ్రెస్‌లోకి వెళతారని ప్రచారం జరిగింది. కాదు ప్రత్యేక పార్టీ పెడతారనే పుకార్లు బయటకొచ్చాయి. లేదు బిజీపీలో చేరబోతున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ తరహా ప్రచారం ముమ్మరంగా జరిగిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్‌పై క్లారిటీ వచ్చింది. క్లియర్‌ కట్‌గా ఆయనే స్టేట్‌మెంట్ ఇచ్చినట్లుగా ట్వీట్టర్‌ వేదికగా బీజేపీ తీర్ధం పుచ్చుకోబోతున్నట్లుగా వెల్లడించారు.

ఇది చదవండి: బీజేపీ సమావేశాల్లో తెలంగాణపై స్టేట్‌మెంట్.. అందులో ఏముంది? పూర్తి వివరాలు


Published by:Siva Nanduri
First published:

Tags: Telangana Politics

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు