తెలంగాణ కాంగ్రెస్ (Congress)సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkatreddy)రాష్ట్ర నాయకత్వంపై డైరెక్ట్ అటాక్ చేశారు. తాను లోలోపల రగిలిపోతున్న అంశాలన్నింటిపైన ఒక్కసారిగా కుండబద్దలు కొట్టారు. వరంగల్(Warangal)లో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన రైతు సంఘర్షణ సభనే ఇందుకు వేదికగా చేసుకున్నారు. సభకు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన పార్టీ అధినాయకుడు రాహుల్‌గాంధీ(Rahul Gandhi)సమక్షంలోనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ప్రవర్తిస్తున్న తీరును, పార్టీ సీనియర్లుగా చెప్పుకుని వేదికపై వైట్ డ్రెస్‌లో కూర్చున్న వాళ్ల వల్ల కాంగ్రెస్ అధికారంలోకి రాదనే క్లారిటీని రాహుల్‌గాంధీకి చేరవేశారు. సీనియర్లుగా ఉన్న నేతలు చెప్పిన వాళ్లకు టిక్కెట్లు ఇస్తే ఏ ఒక్కరు గెలవరని డైరెక్టర్‌గా రాహుల్‌గాంధీకే చెప్పారు. అంతే కాదు రైతు సమస్యలపై పోరాడుతూ ప్రజల్లో తిరిగే వాళ్లకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తామన్న రాహుల్‌గాంధీ మాటను పట్టుకొని ఇంకొక విజ్ఞప్తి చేశారు భువనగిరి(Bhuvanagiri) ఎంపీ. మొదట్నుంచి పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు సభకు పాస్‌లు కూడా ఇవ్వకపోవడం వల్లే చాలా మంది సభకు రాలేకపోయారని తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Komatireddy Rajagopalreddy) సభకు హాజరుకాకపోవడాన్ని తెలివిగా సమర్ధించుకున్నారు. అలాగే గత ఎన్నికల్లో జరిగినట్లుగా కాకుండా..రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తామని మాటిచ్చారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఈసారి ఆరు నెలల ముందే అభ్యర్ధుల్ని ఎంపిక చేయాలని కోరారు. అది కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం సిఫార్సు చేసిన వాళ్లను కాకుండా..ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తున్న వాళ్లకు టిక్కెట్ ఇవ్వాలని కోమటిరెడ్డి సభా వేదిక నుంచే రాహుల్‌గాంధీని కోరారు.
అధ్యక్ష ఇదే నా మనవి..
కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికి ఒకరు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. మరొకరు పార్టీలో ఉంటూనే రాష్ట్ర నాయకత్వ తీరును సందు దొరికినప్పుడల్లా వ్యతిరేకిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మెత్తబడినట్లుగా కనిపిస్తూనే..మెల్లిగా పట్టు సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఈక్రమంలోనే ఎంపీగా గెలిచిన తర్వాత తన వాయిస్‌ని కాస్త పెంచుతూ వచ్చారు. పార్టీ పీసీసీ పదవి కట్టబెట్టకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయనకు స్టార్ క్యాంపెయినర్‌గా బాధ్యతలు అప్పగించింది హైకమాండ్. ఆ పదవితో కాస్త చల్లబడ్డ కోమటిరెడ్డి ఎక్కడో తనలో బయటకు కనిపించకుండా లోలోపల ఎగసిపడుతున్న బడబాగ్నీని వరంగల్ సభ వేదికగా ఈ విధంగా చల్లార్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కుండ బద్దలు కొట్టేశారు..
ఇప్పటికే తనపై చలాయిస్తున్న ఆధిపత్య ధోరణి, పార్టీ కార్యక్రమాల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, హైకమాండ్ స్టార్ క్యాంపెయినర్‌గా పదవి ఇచ్చినప్పటికి రాష్ట్ర నాయకత్వం పట్టించుకోకపోవడం ...ఇలాంటి పరిణామాలు పదే పదే జరుగుతున్నప్పటికి తనలోని అసంతృప్తి, అసహనం, ఆగ్రహాన్ని అణచివేసుకుంటూ వచ్చారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. కాని వరంగల్ సభలో మాత్రం రాహుల్‌గాంధీనే స్వయంగా పార్టీ కోసం పని చేస్తేనే టిక్కెట్ ఇస్తాం..పార్టీ మారాలనుకునే వాళ్లు ఎంత పెద్దవాళ్లైనా వాళ్లకు టికెట్ ఇవ్వమని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పడంతో ఓవైపు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై తన అసంతృప్తిని వెళ్లగక్కుతూనే..అందరం కలిసి పని చేస్తామని..కలిసి పని చేస్తే టీఆర్ఎస్ని ఓడించవచ్చని చివర్లో అనడం కొసమెరుపుగా చూడవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.