Home /News /telangana /

TS POLITICS KOMATIREDDY VENKAT REDDY LATEST COMMENTS RAISE NEW DOUBTS ON HIS SUPPORT TO CONGRESS IN MUNUGODU BY ELECTIONS AK

Komatireddy Brothers: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌కు షాక్ ఇస్తారా ?.. తమ్ముడికే జై కొడతారా ?

కోమటిరెడ్డి బ్రదర్స్

కోమటిరెడ్డి బ్రదర్స్

Komatireddy Brothers: ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భుననగిరి ఎంపీ. ఆయన ఎంపీ నియోజకవర్గం పరిధిలోకే మునుగోడు వస్తుంది. కాబట్టి అక్కడ కాంగ్రెస్‌ కోసం ప్రచారం చేస్తారా ? తమ్ముడితో రాజకీయంగా యుద్ధం చేస్తారా ? అన్న సందేహాలు మొదటి నుంచి వ్యక్తమవుతున్నాయి.

ఇంకా చదవండి ...
    రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేం. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేయడంతో.. ఇతర పార్టీల్లోని నేతలు ఎఫ్పుడు ఆ పార్టీలోకి వెళతారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయన సోదరుడు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy venkat Reddy) మీద పడింది. అయితే ఆయన తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని గతంలోనే క్లారిటీ ఇచ్చారు.

    కానీ తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన తీరును బట్టి.. ఆయన కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారేమో అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. రేవంత్ రెడ్డి తీరును తప్పుబడుతూనే కోమటిరెడ్డి బ్రదర్స్ నిజాయితీతో కూడిన రాజకీయాలు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరో జాతీయ పార్టీలో చేరానని అన్నారు. రాజగోపాల్ రెడ్డి నిర్ణయంపై తాను కామెంట్ చేయనని అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన చెప్పలేకపోయారు. ఈ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పాలంటే మీడియాకు చెప్పారు.



    ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భుననగిరి ఎంపీ. ఆయన ఎంపీ నియోజకవర్గం పరిధిలోకే మునుగోడు వస్తుంది. కాబట్టి అక్కడ కాంగ్రెస్‌ కోసం ప్రచారం చేస్తారా ? తమ్ముడితో రాజకీయంగా యుద్ధం చేస్తారా ? అన్న సందేహాలు మొదటి నుంచి వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే.. మునుగోడు ఉప ఎన్నిక అంశంలో ఆయన దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందుకు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌ను కూడా ఆయన వినియోగించుకునే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

    Komatireddy Venkat Reddy: రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్.. కాంగ్రెస్‌లో మొదలైన పంచాయతీ

    Telangana: టీఆర్ఎస్‌కు మరో షాక్ తగలనుందా ?.. ఆ మాజీమంత్రి మాటలకు అర్థమేంటి ?

    నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు రాజకీయంగా మంచి పట్టు ఉంది. ఈ ఇద్దరూ రాజకీయంగా విడిపోతే కాంగ్రెస్ పరిస్థితి.. వారి అనుచరుల పరిస్థితి ఏంటనే దానిపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇద్దరూ రాజకీయంగా తలపడితే తాము ఎవరి పక్కన ఉండాలనే విషయంపై కూడా వారి అనుచరులు తేల్చుకోలేకపోతున్నారని సమాచారం. మొత్తానికి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడులో ప్రచారం చేస్తారా ? ఒకవేళ చేసినా తమ్ముడిని టార్గెట్ చేస్తారా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Komatireddy rajagopal reddy, Komatireddy venkat reddy, Telangana

    తదుపరి వార్తలు