తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ కొత్త ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే నేడు తెలంగాణకు వచ్చారు. ఈ క్రమంలో గాంధీభవన్ లో కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయ్యారు. అయితే సీనియర్ నేత వి.హనుమంత రావు (Hanumantharao), వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ (Mahesh Goud) మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. దీనితో గాంధీభవన్ నుండి అలిగి వి.హనుమంతరావు బయటకు వచ్చారు. పీసీసీ మీటింగ్ పెట్టలేదంట అంటూ విహెచ్ మీడియాతో చెప్పారు. దీనితో కాంగ్రెస్ లో కొత్త కమిటీల చిచ్చు ఇంకా చల్లారినట్టు కనిపించడం లేదు. అయితే కోమటిరెడ్డి గాంధీభవన్ కు రావడం, రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం ఆసక్తిగా మారింది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat reddy) గాంధీభవన్ మెట్లు ఎక్కారు. గతంలో గాంధిభవన్ మెట్లు ఎక్కేదే లేదన్న ఆయన కాస్త మెత్తబడినట్లు తెలుస్తుంది. జనవరి 26 నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. కాగా మాణిక్ రావు ఠాక్రే (Manik Rao Thakre) ఆదేశాలతోనే గాంధీభవన్ కు వచ్చినట్లు ఆయన తెలిపారు. నేను స్టార్ కాంపెయినర్ ను అందుకే ఇక్కడికి వచ్చా. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి ఎలా తీసుకురావాలో ఆలోచిస్తున్నాం.
30 ఏళ్ల నుంచి గాంధీభవన్ కు వస్తున్నాను. కొత్త ఇంచార్జి ఆహ్వానించారు కాబట్టి వచ్చాను. హాత్ సే హాత్ జోడో యాత్రపై చర్చించడానికి రమ్మన్నారు. ఈ యాత్రలో పాల్గొంటాం. కాంగ్రెస్ ను ఎలా అధికారంలోకి తీసుకురావాలనేది చూస్తామన్నారు. చాలా రోజుల తరువాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో కోమటిరెడ్డి (Komatireddy Venkat reddy) భేటీ అయ్యారు. దీనితో వీరిద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్టు తెలుస్తుంది. మరోవైపు గాంధీభవన్ లో పలు కమిటీలతో మాణిక్ రావు (Manik Rao Thakre) ఠాక్రే భేటీ కానున్నట్లు తెలుస్తుంది.
గత కొంతకాలంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat reddy) కాంగ్రెస్ పార్టీలో, రేవంత్ రెడ్డితో ఎడమొహం పెడమొహంగా వుంటున్నారు. అయితే సడన్ గా ఆయన గాంధీభవన్ కు రావడం రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో భేటీ అవ్వడం చూస్తుంటే త్వరలోనే కోమటిరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. కాగా 3 రోజుల పాటు కాంగ్రెస్ కొత్త ఇంఛార్జి తెలంగాణలో పర్యటించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Komatireddy venkat reddy, Mp revanthreddy, Telangana, TS Congress