TS POLITICS KOMATIREDDY RAJAGOPAL REDDY WILL JOIN THE STRONG PARTY THAT WILL DEFEAT TRS AND WILL REMAIN IN CONGRESS TILL THEN SNR
Telangana : అప్పటి వరకే కాంగ్రెస్‌లో ఉంటా .. పార్టీ మారడంపై రాజగోపాల్‌రెడ్డి సంచలన కామెంట్
(ప్రతీకాత్మకచిత్రం)
Telangana: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పింది ఎలా ఉందంటే నేను నీళ్లలోనే ఉన్నాను కాని కాళ్లకు తడి అంటలేదు అన్నట్లుగా ఉంది. పార్టీ మారుతున్నారని జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఆయన ఇప్పట్లో లేదు..మారితే టీఆర్ఎస్ను ఓడించే పార్టీలో చేరతానంటూ ప్రచారం నిజమే అన్నట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు.
తెలంగాణ కాంగ్రెస్(Telangana congress)లో కోమటరెడ్డి బ్రదర్స్ రాజకీయ అడుగులు ఎటు పడుతున్నాయనే సస్పెన్స్ పార్టీ శ్రేణుల్లోనే కాదు వాళ్ల అభిమానులు, అనుచరులకు అయోమయాన్ని కలిగిస్తున్నాయి. భువనగిరి ఎంపీ(Bhuvanagiri MP)కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Venkat Reddy)విషయంలో కాస్త క్లారిటీ వచ్చినప్పటికి మునుగోడు(Munugodu) ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Rajagopal Reddy)విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. దానిపైనే ఆదివారం(Sunday) ఆయన తన సొంత నియోజకవర్గంలో స్పష్టత ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ సస్పెన్స్ క్రియేట్ చేశారు. తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవమని ఖండించిన రాజగోపాల్‌రెడ్డి ప్రస్తుతానికి మాత్రం పార్టీ మారడం లేదన్నారు. అంటే రాబోయే ఎన్నికల్లోగా పార్టీ మారడం ఖాయమని ఆయన చెప్పకనే చెప్పినట్లుగా కనిపిస్తోంది.
పార్టీ మార్పు తప్పదంట ..
ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పిన రాజగోపాల్‌రెడ్డి... అవసరాన్ని బట్టి ..టీఆర్ఎస్ను ఓడించే బలమైన పార్టీలో చేరుతానంటూ చెప్పుకొచ్చారు. అంతే కాదు ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే నియోకవర్గంలోని ప్రతి కార్యకర్త, నాయకుడికి చెప్పి వాళ్లను ఒప్పించే వేరే పార్టీలో చేరతానంటూ మనసులో మాటను తేటతెల్లం చేశారు. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే ప్రధాని మోదీ సభతో తెలంగాణ బీజేపీలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. అందుకే ఆయన టీఆర్ఎస్ను ఓడించే పార్టీలో చేరుతానంటూ ఇన్‌డైరెక్ట్‌గా మెసేజ్ ఇచ్చారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతే కాదు అవసవరాన్ని బట్టి తాను మునుగోడు అసెంబ్లీ నుంచి లేదంటే భువనగిరి ఎంపీ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతానంటూ చెప్పుకొచ్చారు.
టైమ్ చూసి దెబ్బకొట్టాలని ..
మొదట్నుంటి కోమటిరెడ్డి బ్రదర్స్‌కి టీఆర్ఎస్ పార్టీ అంటేనే పొసగదు. దీనికి తోడు మంత్రి జగదీష్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య జిల్లాలో ఉన్న వైరం, ఆధిపత్యపోరు అధికార పార్టీపై శతృత్వాన్ని మరింతగా పెంచింది. దాంతో ఎలాగైనా టీఆర్ఎస్ని ఓడించాలని... కోమటిరెడ్డి బ్రదర్స్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. అయితే కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్‌కి తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో..కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలో చేరుతున్నారనే వార్త విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈనేపధ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ పదవి కట్టబెట్టి సంతృప్తి పరిచింది. దాంతో ఆయన కూడా పార్టీ మారే విషయాన్ని పక్కనపెట్టి కాంగ్రెస్‌లోనే తన మార్కు పెత్తనం చెలాయించాలని ట్రై చేస్తున్నారు.
సత్తా ఉన్న పార్టీలోకే వెళతా..
వెంకట్‌రెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు, సభలకు, కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సొంత నియోజకవర్గంలో తన అనుచరులు, అభిమానులతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటూ తన ఫ్యూచర్ పాలిటిక్స్‌పై సరైన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సక్సెస్ కావడం, బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తుండటంతో ఆయన రాజకీయ అడుగులు కమలదళం వైపే పడుతున్నాయని రాజగోపాల్‌రెడ్డి వర్గీయుల నుంచే వినిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.