హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu Bypoll: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాకిచ్చిన ఈసీ..నేటి సాయంత్రం 4 గంటల వరకు గడువు

Munugodu Bypoll: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాకిచ్చిన ఈసీ..నేటి సాయంత్రం 4 గంటల వరకు గడువు

రాజగోపాల్ రెడ్డి

రాజగోపాల్ రెడ్డి

మునుగోడు బైపోల్ (Munugodu By Poll) దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం రంజుగా మారింది. ప్రధాన పార్టీల ప్రచారంతో మునుగోడు (Munugodu) దద్దరిల్లుతుంది. ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ (Bjp), కాంగ్రెస్ (Congress), టీఆర్ఎస్ (Trs) గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మునుగోడు బైపోల్ (Munugodu By Poll) దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం రంజుగా మారింది. ప్రధాన పార్టీల ప్రచారంతో మునుగోడు (Munugodu) దద్దరిల్లుతుంది. ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ (Bjp), కాంగ్రెస్ (Congress), టీఆర్ఎస్ (Trs) గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యమైంది. కాగా మునుగోడు బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి  (Komati Reddy Rajagopal Reddy) బరిలో నిలిచారు. రాజీనామా చేసిన దగ్గర నుండి రాజగోపాల్ రెడ్డికి  (Komati Reddy Rajagopal Reddy) వరుస షాకులు తగులుతున్నాయి. కాంట్రాక్టు కోసమే రాజగోపాల్  (Komati Reddy Rajagopal Reddy) పార్టీ మారారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నారు. అలాగే మునుగోడులో ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి  (Komati Reddy Rajagopal Reddy) ప్రజా బలం ఉన్న నాయకుడిగా పేరుంది. కానీ తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఓటర్ల నాడి ఎలా ఉందో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది.

Chiranjeevi: చిరంజీవిని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన మంత్రి మల్లారెడ్డి .. మెగాస్టార్ రియాక్షన్ ఏమిటంటే ..

ఇదిలా ఉంటే మునుగోడు బైపోల్ కు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) కి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  (Komati Reddy Rajagopal Reddy) కుటుంబానికి చెందిన కంపెనీ నుండి మునుగోడులోని పలువురికి రూ.5.2 కోట్లు బదిలీ చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం  (Election Commission) వివరణ ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) కి నోటీసులు ఇచ్చింది. నగదు బదిలీ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని నోటీసులు పేర్కొంది. అక్టోబర్ 14, 18, 29 తేదీల్లో ఈ నగదు బదిలీ జరిగిందని తెలుస్తుంది. దీనిపై టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నగదుతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఈసీ (Election Commission) స్పందిస్తూ అక్టోబర్ 31 సాయంత్రం 4 గంటల లోపు సమాధానం ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది.

టీఆర్ఎస్ నుంచి ఫిర్యాదు స్వీకరించిన ఈసీ రాజగోపాల్ రెడ్డికి  (Komati Reddy Rajagopal Reddy) నోటీసులు ఇచ్చింది. వారు ఆరోపించిన విధంగా ఈ బదిలీని మీరు లేదా మీ ఆదేశాల మేరకు కుటుంబ యాజమాన్యంలోని కంపెనీ ద్వారా జరిగితే 23 వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయబడిన ఈ ఫండ్ ఓటరు ప్రేరణ కోసం ఉపయోగించకుండా చూసుకోవడం మీ బాధ్యత. ఇది అవినీతి పద్ధతి అని ఈసీ నోటీసుల్లో పేర్కొంది. మరి ఈసీ నోటీసులపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  (Komati Reddy Rajagopal Reddy) ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

First published:

Tags: Bjp, Election Commission of India, Komatireddy rajagopal reddy, Munugodu By Election

ఉత్తమ కథలు