ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, లేకపోయినా కోమటిరెడ్డి బ్రదర్స్ తమ హవా కొనసాగించేవారు. తాము గెలవడంతో పాటు తమ అనుచరులకు ప్రాధాన్యత దక్కించుకోవడానికి ప్రయత్నించేవాళ్లు. అలా కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరులుగా ఉన్న అనేక మందికి కాంగ్రెస్(Congress) పార్టీలో పదవులు వచ్చాయి. తమ అనుచరులకు ఎన్నికల్లో టికెట్లు ఇప్పించుకుని గెలిపించుకోవడం, ఆ తరువాత కూడా వారికి ఇబ్బంది లేకుండా చూసుకోవడం కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రత్యేకత. అందుకే ఉమ్మడి నల్లగొండ(Nalgonda) జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ (Komatireddy Brothers) హవా కొనసాగుతూ వచ్చింది. అయితే మునుగోడు ఉప ఎన్నికల తరువాత వారి ప్రభావం భారీగా తగ్గిపోయే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. ఆయన కూడా త్వరలోనే బీజేపీలోకి వెళతారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకత్వం పార్టీ పరంగా ఆయనపై చర్యలు తీసుకుంటే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం త్వరలోనే కమలం గూటికి చేరుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీలోకి వెళ్లి.. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ఆ పార్టీలో ఉన్నప్పటికీ అక్కడ వారికి హవా కొనసాగుతుందనే నమ్మకం లేదని కొందరు లెక్కలు వేసుకుంటున్నారు.
ఇందుకు అసలు కారణం మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడమే అని పలువురు చెబుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో విజయ సాధిస్తే.. అప్పుడు పరిస్థితి వేరుగా ఉండేదని అంటున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోవడంతో పరిస్థితి భిన్నంగా మారిందని అంటున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడూ బీజేపీకి గూటికి చేరినా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వాళ్లు ఆశించిన విధంగా.. వారి అనుచరులకు టికెట్లు ఇప్పించుకునే పరిస్థితి ఉండకపోవచ్చనే వాదన ఉంది.
Nizamabad: ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా MBBS ఫ్రీ సీట్ కొట్టింది..ఇదెలా సాధ్యమైందో తెలుసా?
Big News: సీనియర్ IAS అధికారి శ్రీలక్ష్మికి బిగ్ రిలీఫ్..ఓఎంసీ కేసులో అభియోగాలు కొట్టివేసిన హైకోర్టు
కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితి బీజేపీలో ఉండదని.. అక్కడ పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చెప్పుకోదగ్గ స్థాయిలో అనుచరగణం, అభిమానులు ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్.. తమ మాటను బీజేపీ నాయకత్వం పట్టించుకోకపోతే ఆశించిన విధంగా పని చేస్తారా ? అన్నది కూడా అనుమానమే. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తమ హవా చూపించిన కోమటిరెడ్డి బ్రదర్స్.. భవిష్యత్తులోనూ అదే జోరు చూపిస్తారా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.