హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ts congress | Munugodu :మునుగోడు ప్రచారానికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దూరం .. సరైన కారణంతో సైడ్ అవుతున్న ఎంపీ

Ts congress | Munugodu :మునుగోడు ప్రచారానికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దూరం .. సరైన కారణంతో సైడ్ అవుతున్న ఎంపీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ts congress | Munugodu: మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ, స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంటక్‌రెడ్డి ప్రచారానికి దూరంగా ఉండనున్నారు.అక్టోబర్ 15వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే ఫలితాలు వెలువడిన తర్వాత ఇండియాకు తిరిగి వస్తారని సమాచారం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మునుగోడు(Munugode)ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ, స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంటక్‌రెడ్డి(Komati Reddy Venkat Reddy) మునుగోడు ఎన్నికల  ప్రచారానికి దూరంగా ఉండనున్నట్లుగా తేల్చారు. తన సోదరుడు బీజేపీ (BJP)అభ్యర్ధిగా బరిలోకి దిగుతానని ప్రకటించిన మరుక్షణం నుంచి మునుగోడు బైపోల్‌ విషయంలో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సరిగ్గా నామినేషన్లు చివరి గడువు తర్వాత రోజు అంటే అక్టోబర్(October)15వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల(Abroad)కు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నికల ప్రచారానికి వస్తారని ఇప్పటి వరకు కాస్తో, కూస్తో ఆశలు పెట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతల ఆశలపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విదేశీపర్యటన నీళ్లు చల్లినట్లైంది. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy)మాత్రం ఈనెల 14వ తేది వరకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ప్రకటించిన తర్వాత ఈ వార్త వెలువడటం విశేషం.

Viral video: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో తెలంగాణ యువకులు .. వాళ్ల కారణంగా తిండి లేక అవస్థలు

టికాంగ్రెస్ నేతలకు ఝలక్ ..

మొదట్నుంచి తెలంగాణ కాంగ్రెస్‌లో తన మాట నెగ్గించుకునేందుకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో సరిసమానంగా అధిష్టానానికి ప్రత్యేకమైన ఫిర్యాదులు, సంప్రదింపులు చేస్తూ వచ్చారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. మునుగోడు అభ్యర్ధి ఎంపిక విషయంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌ ఎంపిక చేసిన పేరును కాకుండా పార్టీ నేతలకు నచ్చిన అభ్యర్ధి పేరునే ఏఐసీసీ ద్వారా ప్రకటించేలా చేశారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి పేరును ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇంత జరిగినప్పటికి ...కాంగ్రెస్‌ పార్టీ తరపున, పార్టీ అభ్యర్ధి గెలుపుకోసం నిలబడతారని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భావించారు. కాని ఊహించని విధంగా విదేశీ పర్యటన పెట్టుకొని చాకచక్యంగా మునుగోడు ఉపఎన్నిక ప్రక్రియ ముగిసే వరకు దూరంగా ఉండేలా చక్కగా ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సోదరుడు రాజగోపాల్‌రెడ్డి గెలుపునకు దోహదపడే విధంగా కోమటిరెడ్డి విదేశీ టూర్‌ పెట్టుకున్నారనే టాక్‌ కూడా రాజకీయ వర్గాల్లో నెలకొంది.

విదేశీ టూర్‌తో ప్రచారానికి చెక్..

అక్టోబర్‌ 15న విదేశీ టూర్ ఫిక్స్ చేసుకున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ..తిరిగి మునుగోడు ఉపఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఇండియాకు తిరిగి వస్తారని తెలుస్తోంది. ఆదివారం నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ మునుగోడు ప్రచారానికి సిద్ధమైంది. ఈ ప్రచారంలో కాంగ్రెస్ నేతలంతా పాల్గొంటారని స్వయంగా రేవంత్‌రెడ్డే ప్రకటించారు. కాని చివరి క్షణంలో కోమటిరెడ్డి ఫారిన్ టూర్ ప్రకటన హస్తం నేతలకు షాక్ ఇచ్చినట్లైంది. కోమటిరెడ్డి ప్రచారానికి దూరంగా ఉంటారనే వార్తపై తెలంగాణ కాంగ్రెస్ నేతల స్పందన ఏవిధంగా ఉంటుందో చూడాలి.

First published:

Tags: Komatireddy venkat reddy, Munugode Bypoll, Telangana Politics

ఉత్తమ కథలు