హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kolhapur: కొల్లాపూర్​లో ఉద్రిక్తత.. TRS ఎమ్మెల్యే అరెస్టు.. తాడోపేడో తేల్చుకుందాం రా అన్న మాజీ మంత్రి

Kolhapur: కొల్లాపూర్​లో ఉద్రిక్తత.. TRS ఎమ్మెల్యే అరెస్టు.. తాడోపేడో తేల్చుకుందాం రా అన్న మాజీ మంత్రి

జూపల్లి, హర్షవర్దన్​ (ఫైల్​)

జూపల్లి, హర్షవర్దన్​ (ఫైల్​)

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో అధికార పార్టీ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.

మహబూబ్‌ నగర్‌ (Mahbubnagar) జిల్లాలో అధికార పార్టీ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Former Minister Jupally Krishna Rao), ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి (MLA Beeram Harshavardhan Reddy) మధ్య విభేదాలు గుప్పుమన్నాయి. దీంతో ఇద్దరు నేతలు సవాళ్లు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్‌లోని (Kolhapur) ఎమ్మెల్యే హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఇంటి ద‌గ్గ‌ర ఉద్రిక్త‌త నెల‌కొంది. జూపల్లి ఇంటికి హర్షవర్ధన్‌ ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేయడంతో హై టెన్షన్‌ నెలకొంది. దీంతో అధికార TRS పార్టీ ఎమ్మెల్యే హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ (MLA HarshaVardhan ) సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల వాహ‌నాన్ని ఎమ్మెల్యే అనుచ‌రులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనుచరులు పోలీసుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ ధ‌ర్నాకు దిగారు. ఎమ్మెల్యేను వ‌దిలిపెట్టాల‌ని డిమాండ్ చేశారు. పోలీస్ వాహనం వెంటే భారీగా కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివెళ్లారు.

నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీయడానికే..

మరోవైపు  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Former minister Jupally KrishnaRao) .. "నేను.. నీవు కోరినట్లు మా ఇంట్లోనే ఉన్నాను.. ఎవరు అవినీతికి పాల్పడ్డారో తేల్చుకుందాం రా" అంటూఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి  సవాల్ విసిరారు. బహిరంగ చర్చ కోసం ఇరువురు నేతలు సన్నద్ధమైన నేపథ్యంలో ఆదివారం మాజీ మంత్రి జూపల్లి తన ఇంటివద్ద మీడియాతో మాట్లాడారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు ప్రజావ్యతిరేక విధానాలకు, అవినీతికి పాల్పడలేదని, నాపై ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేయడం నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీయడానికి చేసిన కుట్ర అని జూపల్లి వ్యాఖ్యానించారు.

"మేము చర్చకు రమ్మని అడిగిన వెంటనే స్పందించకుండా ఆలస్యంగా.. అంబేడ్కర్​ చౌరస్తా వద్ద చర్చ వద్దు.. మీ ఇంటికే వస్తా అని ఎమ్మెల్యే అన్నాడు. సరే అని మేము స్వాగతించాం. తగిన ఆధారాలతో నాపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని _మాజీ మంత్రి మీడియాకు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం వరకు ఎదురు చూస్తాను అని జూపల్లి పేర్కొన్నారు. లేదంటే ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై అన్ని ఆధారాలతో మీడియాకు తెలియజేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు..

గత కొంత కాలంగా కొల్లాపూర్ (kolhapur) నియోజకవర్గంలో జూపల్లి, హర్షవర్ధన్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. కేసీఆర్ (CM KCR)తొలి ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు జూపల్లి కృష్ణారావు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో జూపల్లి ఓడిపోయారు. తర్వాత బీరం టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి జూపల్లి, బీరం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అభివృద్ధి విషయంలో సవాళ్లు విసురుకున్నారు. ఇటీవల కాలంలో ఇది మరింతగా ముదిరింది. జూపల్లి, బీరం వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.

First published:

Tags: Mahbubnagar, Nagarkurnool, Police arrest, Telangana Politics, Trs, TRS leaders

ఉత్తమ కథలు