హోమ్ /వార్తలు /తెలంగాణ /

Flexi controversy: ఫ్లెక్సీలో ఫోటో లేదని అధికారులపై ఫైర్ .. ఖమ్మం టీఆర్ఎస్‌లో మరోసారి బయటపడ్డ వర్గపోరు

Flexi controversy: ఫ్లెక్సీలో ఫోటో లేదని అధికారులపై ఫైర్ .. ఖమ్మం టీఆర్ఎస్‌లో మరోసారి బయటపడ్డ వర్గపోరు

KHAMMAM TRS LEADERS

KHAMMAM TRS LEADERS

Flexi controversy: ఖమ్మం జిల్లాలో ప్రోటోకాల్‌ పేరుతో అధికార పార్టీలోని నేతలు వర్గపోరు బయటపెట్టుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చేసిన ఎంపీలు, ఎమ్మెల్సీ ఫోటోలు లేకుండా కేవలం మంత్రి, ఎమ్మెల్యే ఫోటో మాత్రమే పెట్టడమే ఇందుకు కారణమైంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India

  (G.SrinivasReddy,News18,Khammam)

  ఖమ్మం జిల్లా అధికార పార్టీ నాయకుల మధ్య ఉన్న వర్గపోరు మరోసారి బయటపడింది. ఖమ్మం(Khammam)జిల్లాలో పెద్దదైన పాలేరు(Paleru) జలాశయంలో చేప పిల్లలను వదిలే కార్యక్రమం జరిగింది. దీనికి మత్స్యశాఖ అధికారులు ప్రొటోకాల్‌(Protocol)ప్రకారం అందరికీ ఆహ్వానం పంపారు. ఈకార్యక్రమానికి హాజరైన ఎంపీలు నామా నాగేశ్వరరావు(Nama Nageswara Rao),పద్దిరాజు రవిచంద్ర(Paddiraju Ravichandra)తో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడైన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌(Madhusudan)అధికారులపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమానికి వస్తుంటే ప్రోటోకాల్ ప్రకారం ఫ్లెక్సీ(Flexi)ల్లో తమ ఫోటో(Photos)లు ఎందుకు పెట్టలేదని అధికారులపై మండిపడ్డారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే అక్కడి నుంచి వెళ్లిపోవడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

  KTR|Viral news : ఇండిగో ఫ్లైట్‌లో తెలుగు ప్రయాణికురాలికి అవమానం .. మంత్రి కేటీఆర్ రియాక్షన్ ఏంటో తెలుసా..?

  ఖమ్మం కారు గుర్తు నేతల్లో వర్గపోరు..

  ఖమ్మం జిల్లాలో పెద్దదైన పాలేరు జలాశయంలో చేప పిల్లలను వదిలే కార్యక్రమం ఆదివారం జరిగింది. దీనికోసం మత్స్యశాఖ అధికారులు ప్రొటోకాల్‌ ప్రకారం అందరికీ ఆహ్వానం పంపారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో పాటుగా జిల్లా పార్టీ అధ్యక్షుడైన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ వచ్చారు. పాలేరు రిజర్వాయర్‌ దగ్గర వాహనం దిగడంతోనే అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ఎంపీలు, జిల్లా అధ్యక్షులుగా ఉన్న తాము వస్తే తమ ఫోటోలు లేకుండా కేవలం మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ఫోటోలు మాత్రమే ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయారు.

  ఫ్లెక్సీలో ఫోటో లేదని కోపం..

  కార్యక్రమానికి వచ్చిన వాళ్ల ఫోటోలు లేవు...రాని మంత్రి, ఎమ్మెల్యే ఫోటోలు మాత్రమే పెట్టమని ఎవరు చెప్పారంటూ అధికారులపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్. 'మీరు ఆఫీసర్స్‌ ఆఫీసర్స్‌లాగా ఉండండి.. పనికిమాలిన పనులు చేయొద్దు..గవర్నమెంట్‌ అధికారులు ఎవరికీ ఊడిగం చెయ్యడానికి ఉండొద్దు.. మిగతా వాళ్లకు ఎందుకు కట్టలేదు ఫ్లెక్సీలు.. ఓన్లీ ఎమ్మెల్యే, మంత్రికే ఎందుకు కట్టారు ఫ్లెక్సీలు..? చెప్పిందా మీకు గవర్నమెంటు.. చెప్పు.. మీ కమిషనర్‌తో మాట్లాడనా.. చెయ్యండి ఎట్టచేస్తరో ప్రాగ్రాం.. అంటూ ఆగ్రహంగా కారెక్కి వెళ్లిపోయారు.

  ఎవరి దారి వాళ్లదే ..

  అధికార పార్టీలో కీలక పదవిలో ఉన్న నాయకుడు .. ప్రోటోకాల్‌ పాటించరా అంటూ ప్రశ్నించాల్సింది పోయి ..మంత్రి, ఎమ్మెల్యే ఫోటోలు ఎందుకు పెట్టారు..? మావి ఎందుకు ఏర్పాటు చేయలేదు..? అంటూ అధికారులపై నోరు పారేసుకోవడం, అలగి వెళ్లిపోవడంతో పార్టీ శ్రేణులు ఆశ్చర్యపోయారు. ఇది జరిగిన కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి మాత్రం ఈ అంశానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వకుండానే.. అక్కడకు హాజరైన నాయకులు, అధికారులతో కలసి రిజర్వాయర్‌లో చేపపిల్లల్ని వదిలి వెళ్లిపోయారు.

  Mystery: హాస్టల్‌లో బాలిక కిడ్నాప్‌కు యత్నం .. నరబలి కోసం అంతకు తెగించారా..!

  రోజంతా దూరంగానే..

  ప్రొటోకాల్‌ ఎఫెక్ట్‌తోనో  మరే కారణంతోనో ఇద్దరు ఎంపీలు నామా నాగేశ్వరావు, వద్దిరాజు రవిచంద్ర సహా పార్టీ జిల్లా బాధ్యుడైన ఎమ్మెల్సీ తాతా మదుసూదన్‌ లు రోజంతా ఖమ్మంలోనే ఉన్నప్పటికీ.. తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాలు సహా భద్రాద్రి బ్యాంకు సిల్వర్‌జూబ్లీ సహా ఇంకా పలు ప్రొగ్రంలలో విడివిడిగానే పాల్గొన్నారు. మంత్రి అజయ్‌కుమార్‌కు జరిగిన పౌర సన్మానం లోనూ ఈ నేతలు కనిపించలేదు. దీంతో పార్టీలో విబేధాలు నేతల మధ్య వేదిక పంచుకోలేని స్థాయికి చేరాయా..? అన్న సందేహం కార్యకర్తల్లో వ్యక్తం అయింది. అయితే పాలేరు ప్రోటోకాల్‌ ఉల్లంఘన వ్యవహరం విషయమై తెలుసుకున్న ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అధికారులను మందలించినట్టు తెలిసింది. ఇలాంటివి రిపీట్‌ కాకుండా చూడాలని సూచించడం కొసమెరుపు.

  ఫ్లెక్సీలో ఫోటో లేదని కోపం..

  కార్యక్రమానికి వచ్చిన వాళ్ల ఫోటోలు లేవు...రాని మంత్రి, ఎమ్మెల్యే ఫోటోలు మాత్రమే పెట్టమని ఎవరు చెప్పారంటూ అధికారులపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్. 'మీరు ఆఫీసర్స్‌ ఆఫీసర్స్‌లాగా ఉండండి.. పనికిమాలిన పనులు చేయొద్దు..గవర్నమెంట్‌ అధికారులు ఎవరికీ ఊడిగం చెయ్యడానికి ఉండొద్దు.. మిగతా వాళ్లకు ఎందుకు కట్టలేదు ఫ్లెక్సీలు.. ఓన్లీ ఎమ్మెల్యే, మంత్రికే ఎందుకు కట్టారు ఫ్లెక్సీలు..? చెప్పిందా మీకు గవర్నమెంటు.. చెప్పు.. మీ కమిషనర్‌తో మాట్లాడనా.. చెయ్యండి ఎట్టచేస్తరో ప్రాగ్రాం.. అంటూ ఆగ్రహంగా కారెక్కి వెళ్లిపోయారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Khammam, Telangana Politics, TRS leaders

  ఉత్తమ కథలు