హోమ్ /వార్తలు /తెలంగాణ /

Khammam: అంతుచిక్కని పొంగులేటి వ్యూహం.. వ్యూహాత్మకంగానే జాప్యం.. మార్చి వరకు ఇంతేనా ?

Khammam: అంతుచిక్కని పొంగులేటి వ్యూహం.. వ్యూహాత్మకంగానే జాప్యం.. మార్చి వరకు ఇంతేనా ?

పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఫైల్ ఫోటో)

పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఫైల్ ఫోటో)

Khammam Politics: పొంగులేటికి ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్‌టీపీల నుంచి ఆహ్వానాలున్నాయి. ఆ పార్టీల ముఖ్యనేతలు స్వయంగా పొంగులేటితో మాట్లాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఏ పార్టీలో చేరతారనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ప్రభుత్వ హామీలపై మాటల తీవ్రత పెంచిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy).. పార్టీ మార్పుపై మాత్రం తొందరపడడం లేదు. కొత్త సంవత్సరం రోజున పార్టీకి వ్యతిరేకంగా మొదటిసారి గొంతెత్తిన పొంగులేటి.. ఆ తర్వాత క్రమంగా మాటల దాడి పెంచుతున్నారు. అయితే పార్టీని వీడి ఇతర పార్టీలో చేరే విషయంలో మాత్రం ఆయన వ్యూహాత్మకంగానే ఆలస్యం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. మార్చి నెలాఖరు వరకు సాగదీయాలన్న ప్లాన్‌లో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. దీని వెనుక పెద్ద ప్లాన్ ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత వచ్చే వరకు వేచిచూడాలని పొంగులేటి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఆత్మీయ సమావేశాలతో ప్రజల్లోకి వెళుతున్న పొంగులేటి.. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని పినపాక(Pinapaka), ఇల్లందు, మధిర(Madhira) నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. పొంగులేటికి ప్రస్తుతం కాంగ్రెస్ , బీజేపీ , వైఎస్ఆర్‌టీపీల నుంచి ఆహ్వానాలున్నాయి. ఆ పార్టీల ముఖ్యనేతలు స్వయంగా పొంగులేటితో మాట్లాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన మాత్రం ఈ విషయంలో ఏమీ తేల్చడం లేదు.

మరోవైపు ఏ పార్టీలోకి వెళ్లాలనే దానిపై పొంగులేటి నిర్ణయం తీసుకున్నారని.. అందుకు తగ్గట్టుగానే తన అనుచరులు, కార్యకర్తలను కన్విన్స్ చేయడం కోసమే ఇంకా తుది నిర్ణయం ప్రకటించడం లేదని చెబుతున్నారని పలువురు చెబుతున్నారు. మరోవైపు ప్రధాన పార్టీల నుంచి తనతో పాటు తన అనుచరులకు కూడా టికెట్లు, ఇతర హామీలు వస్తేనే పొంగులేటి ముందడుగు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని మిగతా ఏడు నియో జకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు పూర్తయిన తరువాత.. మార్చిలో పొంగులేటి రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం ఉండొచ్చని కొందరు చెబుతున్నారు.

Revanth Reddy: మారిన రేవంత్ పాదయాత్ర వేదిక.. కొత్త వేదిక ఇదే..!

BIG BREAKING: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం..ఈడీ ఛార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం, వైసీపీ ఎంపీ పేర్లు

మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పొరుగున ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాలపై కూడా పొంగులేటి ఫోకస్ పెట్టారని అంటున్నారు. వీలును బట్టి ఆయన అక్కడ కూడా ఆత్మీయ సమావేశాలు పెట్టొచ్చనే టాక్ వినిపిస్తోంది. తన ప్రభావం ఎన్ని స్థానాల్లో ఉంటే.. తాను చేరబోయే స్థానాల్లో తనకు అంతగా ప్రాధాన్యత దక్కుతుందనే ఆలోచనలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారని పలువురు విశ్లేషిస్తున్నారు.

First published:

Tags: Ponguleti srinivas reddy, Telangana

ఉత్తమ కథలు