Home /News /telangana /

TS POLITICS KHAMMAM EX MP PONGULETI SRINIVAS REDDY ESTIMATES MISSED OVER RAJYA SABHA SEAT NEW TALK IN TRS OF TELANGANA AK

TRS| Ponguleti: పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో అలా జరిగిందా ?.. టీఆర్ఎస్‌లో ఆసక్తికర చర్చ

పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఫైల్ ఫోటో)

పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఫైల్ ఫోటో)

Ponguleti Srinivasa Reddy: ఒకవేళ పార్టీ తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేస్తే.. అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన అలా చేశారని కొందరు చర్చించుకుంటున్నారు.

    టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు వెళ్లబోయే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ కొద్దిరోజుల ముందే ఖరారు చేశారు. పారిశ్రామికవేత్త బండి పార్థసారథిరెడ్డి, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్రలను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది టీఆర్ఎస్. ఈ విషయంలో ఇతర పార్టీల నుంచి విమర్శలు వచ్చినా.. టీఆర్ఎస్ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. మరోవైపు గులాబీ పార్టీ తరపున రాజ్యసభ సీటు(Rajya Sabha) ఆశించిన ఆ పార్టీ నేతలు కొందరు.. టీఆర్ఎస్(TRS) అధినేత నిర్ణయంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారని తెలుస్తోంది. ఇలాంటి వారి జాబితాలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారని సమాచారం. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల రేసులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) కూడా ఉన్నారని కొన్ని నెలల నుంచి ప్రచారం జరుగుతోంది.

    పలు సందర్భాల్లో పొంగులేటి శ్రీనివాసరెడి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి ఈ విషయం గురించి మాట్లాడారనే చర్చ కూడా సాగింది. రాజకీయంగా బలంగా ఉండటం, ఆర్థికంగానూ బలమైన నాయకుడు కావడంతో పొంగులేటిని రాజ్యసభకు పంపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలామంది భావించారు. కానీ అలా జరగలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారే అయినా బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్రకు ఛాన్స్ ఇచ్చిన టీఆర్ఎస్ నాయకత్వం.. పొంగులేటిని మాత్రం పక్కనపెట్టింది.

    అయితే టీఆర్ఎస్ నాయకత్వం రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలుపెట్టిందనే సమాచారం రావడంతో.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా వదిలి హైదరాబాద్‌లోనే మూడు రోజుల పాటు ఉండిపోయారట. సాధారణంగా సన్నిహితులు పిలిచే శుభకార్యాలకు తప్పకుండా హాజరయ్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఆ మూడు రోజులు మాత్రం అన్నింటికి దూరంగా ఉండిపోయారని టాక్.

    T Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ రూల్స్ పట్టించుకోవడం లేదా ?..మళ్లీ అలాగే జరుగుతోందా ?

    Telangana| KCR: కేసీఆర్ వ్యూహం.. బీజేపీని టార్గెట్ చేస్తే.. కాంగ్రెస్‌ కూడా ఇరుక్కుపోతుందా ?

    ఒకవేళ పార్టీ తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేస్తే.. అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన అలా చేశారని కొందరు చర్చించుకుంటున్నారు. మూడు రోజులు హైదరాబాద్‌లోనే మకాం వేసినప్పటికీ.. రాజ్యసభ విషయంలో ఆయనకు అవకాశం రాలేదని సమాచారం. మొత్తానికి రాజ్యసభ సీటు కచ్చితంగా వస్తుందని లెక్కలు వేసుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొలిటికల్ ఫ్యూచర్‌పై ఏ రకంగా ముందడుగు వేస్తారో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Ponguleti srinivas reddy, Telangana

    తదుపరి వార్తలు