హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR National Party Launch: తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్.. మరికాసేపట్లో జాతీయ పార్టీ పేరు ప్రకటన.. అందరిలోనూ ఉత్కంఠ

KCR National Party Launch: తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్.. మరికాసేపట్లో జాతీయ పార్టీ పేరు ప్రకటన.. అందరిలోనూ ఉత్కంఠ

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR National Party: టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి.. దాన్ని జాతీయ పార్టీగా మార్చాలని నిర్ణయించిన పార్టీ అధినేత కేసీఆర్.. ఇందుకోసం పార్టీకి సంబంధించిన సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ అధికార కార్యాలయమైన తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి.. దాన్ని జాతీయ పార్టీగా మార్చాలని నిర్ణయించిన పార్టీ అధినేత కేసీఆర్(KCR).. ఇందుకోసం పార్టీకి సంబంధించిన సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్‌ను(TRS) బీఆర్ఎస్‌గా(BRS) మార్చే తీర్మానాన్ని ఈ సమావేశంలో ఆమోదించనున్నారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో పాటు కర్ణాటకకు చెందిన జేడీఎస్ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమాళవన్‌ సైతం హాజరయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ కొత్త పార్టీకి సంబంధించిన జెండా, అజెండాను ఆవిష్కరిస్తారా ? లేక కేవలం పార్టీ పేరు మార్పుకు మాత్రమే పరిమితమవుతారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

  అయితే ఈ సమావేశంలోనే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడానికి గల కారణాలను వివరిస్తారని తెలుస్తోంది. కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లోకి వెళతానని ప్రకటనలు చేస్తున్న కేసీఆర్ .. ఆ అవసరం ఎందుకు వచ్చిందనే అంశాలను కూడా వివరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ రోజు ఏం మాట్లాడతారు ? ఏ పార్టీలను టార్గెట్ చేస్తారు ? కేవలం బీజేపీ , కాంగ్రెస్ పార్టీలను మాత్రమే టార్గెట్ చేస్తారా ? అన్నది తెలియాల్సి ఉంది. దేశంలోని పలు ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేయడంపై కేసీఆర్ ఈ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

  2001లో టీఆర్ఎస్‌లో ఏర్పాటు చేసిన కేసీఆర్.. 2014లో తెలంగాణ ఏర్పాటు తరువాత పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం కేంద్రంలో ఎన్డీయే, యూపీఏకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేశారు.

  YS Sharmila: ఢిల్లీకి వైఎస్ షర్మిల.. కేంద్ర పెద్దలను కలిసే ఛాన్స్.. కేసీఆర్ సర్కార్‌పై ఫిర్యాదు ?

  Ts Politics: సీఎం కేసీఆర్ కొత్త స్ట్రాటజీ..పైలట్ ప్రాజెక్ట్ గా మునుగోడు ఎంపిక..స్కిం మార్పు కలిసొచ్చేనా?

  కానీ కూటములతో తాము అనుకున్న మార్పు సాధ్యం కాదని అనుకున్న కేసీఆర్.. చివరికి సొంతంగా జాతీయస్థాయిలో ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే తన సారథ్యంలోని టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి.. జాతీయస్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం దసరా రోజు ముహూర్తం ఖరారు చేశారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Telangana

  ఉత్తమ కథలు