హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR| YS Jagan: వైఎస్ జగన్ బాటలో కేసీఆర్.. ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేలా కొత్త ప్లాన్..

KCR| YS Jagan: వైఎస్ జగన్ బాటలో కేసీఆర్.. ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేలా కొత్త ప్లాన్..

వైఎస్ జగన్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR| YS Jagan: తెలంగాణలో గెలిచేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో.. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై కూడా తెలంగాణ టీఆర్ఎస్ కేసీఆర్ ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుని నివేదికలు తెప్పించుకుంటున్నారు.

ఇంకా చదవండి ...

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ చేశారు. టీఆర్ఎస్‌ను భారత్ రాజ్యసమితిగా మార్చాలని ఆయన భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అదే సమయంలో తెలంగాణలో బీజేపీ (BJP) నుంచి ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఏం చేయాలనే దానిపై కూడా కేసీఆర్(CM KCR) తీవ్రంగానే కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో(Telangana) గెలిచేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో.. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై కూడా తెలంగాణ టీఆర్ఎస్ కేసీఆర్ ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుని నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో పని చేయని ఎమ్మెల్యేలను మారుస్తారనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

  ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడంతో పాటు టీఆర్ఎస్ బలహీనపడుతున్నట్టుగా భావిస్తున్న నియోజకవర్గాల్లో మళ్లీ పార్టీ పట్టు పెరిగేలా ఏం చేయాలనే దానిపై కూడా కేసీఆర్ సరికొత్త వ్యూహాలు సిద్ధం చేశారని తెలుస్తోంది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని.. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉన్నప్పటికీ ఎమ్మెల్యేల పనితీరుపై మంచి అభిప్రాయం లేదని అంతర్గత నివేదికల్లో వెల్లడైంది. దీంతో ఆయా నియోజకర్గాలకు కొత్తగా ఇంఛార్జ్‌లను నియమించాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.

  వాళ్లు కొన్ని నెలల పాటు ప్రజల్లో తిరిగి వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. దీనిపై రోజూవారీగా పార్టీ అధినాయకత్వానికి నివేదికలు పంపిస్తారు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ఈ ఇంఛార్జ్‌లు పని చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఇంఛార్జ్‌ వ్యక్తులను స్థానిక లేదా జిల్లా నాయకులను కాకుండా ఒక నియోజకవర్గానికి దానికి సంబంధం లేని వేరే జిల్లాకు చెందిన నాయకుడిని ఇంఛార్జ్‌గా నియమించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.

  Telangana politics: అప్పుడు ప్రగతిభవన్​.. ఇపుడు రాజ్​భవన్​​.. తెలంగాణలో సమస్యల పరిష్కార వేదిక మారిందా?

  KCR| Telangana: కేసీఆర్‌కు ముందు సరికొత్త సవాల్.. కాంగ్రెస్, బీజేపీ వెయిటింగ్..

  ఈ నాయకులు కూడా సాధారణ నేతలు కూడా ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ స్థాయిలో ఉన్న నేతలను నియమించాలని గులాబీ బాస్ భావిస్తున్నారని.. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అయితే కేసీఆర్ తీసుకోబోయే ఈ నిర్ణయం.. ఒకరకంగా ఏపీ సీఎం జగన్(YS Jagan) అమలు చేస్తున్న గడపగడపకు వైసీపీ కార్యక్రమం లాంటిదే అనే చర్చ కూడా సాగుతోంది. స్థానికంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సీఎం జగన్ ఏపీలో ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రకంగా అమలు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారేమో అనే చర్చ సాగుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, CM KCR, Telangana

  ఉత్తమ కథలు