హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRS vs BJP : తిరిగి టీఆర్ఎస్‌లోకి ఈటల రాజేందర్? -కేటీఆర్ స్పందన -కేసీఆర్ మరో రికార్డు!

TRS vs BJP : తిరిగి టీఆర్ఎస్‌లోకి ఈటల రాజేందర్? -కేటీఆర్ స్పందన -కేసీఆర్ మరో రికార్డు!

కేటీఆర్, ఈటల, కేసీఆర్ (పాత ఫొటోలు)

కేటీఆర్, ఈటల, కేసీఆర్ (పాత ఫొటోలు)

సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురై, బీజేపీలో చేరి హుజూరాబాద్ లో ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్ తిరిగి టీఆర్ఎస్ లోకి చేరుతారనే ఊహాగానాలపైనా కేటీఆర్ స్పందించారు. సీఎం కేసీఆర్ సాధించబోయే రికార్డుపైనా జోస్యం చెప్పారు.

దేశంలోని అన్ని వ్యవస్థల్లాగే ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ (BJP) గుప్పిట పెట్టుకుందని, ప్రధాని మోదీ(PM Modi)కి దమ్ముంటే తెలంగాణ (Telangana)లో ముదస్తు ఎన్నికలకు ఆదేశించాలని, మాకైమేముగా మాత్రం ముందస్తుకు పోబోమని టీఆర్ఎస్ (TRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. సర్వేలు చెబుతున్నంత సీన్ తెలంగాణలో బీజేపీకి లేదని, అయితే కాంగ్రెస్ స్థానాన్ని ఎవరో ఒకరు భర్తీ చేస్తారనీ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ (CM KCR) ఆగ్రహానికి గురై, బీజేపీలో చేరి హుజూరాబాద్ లో ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్ (Eatala Rajender)తిరిగి టీఆర్ఎస్ లోకి చేరుతారనే ఊహాగానాలపైనా కేటీఆర్ స్పందించారు. దక్షిణాదిలో సీఎం కేసీఆర్ సాధించబోయే సంచలన రికార్డుపైనా జోస్యం చెప్పారు. వివరాలివే..

పార్టీ మారనున్న ఈటల? : తెలంగాణలో అప్రకటిత ముందస్తు ఎన్నికల హడావుడి కొనసాగుతోన్న క్రమంలో ప్రత్యర్థులపై అనూహ్యప్రచారాలకు అన్ని పార్టీలు ఊతమిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ను ఢీకొట్టి హుజూరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ కు సంబంధించి గడిచిన కొద్ది గంటలుగా అనేక లీకులు వస్తున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మణికం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు ఈటలతో రహస్యంగా భేటీ అయ్యారని, ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద తెల్లవారుజామున మణికం కారు కనిపించిందని, ఈటలతో మాట్లాడటానికి వారు వెళ్లొచ్చినట్లు ప్రచారం జరిగింది. అంతలోనే ఈటలపై టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ సైతం అనూహ్య వ్యాఖ్యలు చేశారు..

CM KCR| CNOS Survey : అసంతృప్తి ఉన్నా కేసీఆర్‌కు తగ్గని ప్రజాదరణ.. జాతీయ సర్వేలో 11వ ర్యాంక్


టీఆర్ఎస్‌లోకి ఈటల రీఎంట్రీ?: బీజేపీలో చేరి, హుజూరాబాద్ లో ఘన విజయం సాధించి 10 నెలలు కావొస్తున్నా అంతర్గత కుమ్ములాటల కారణంగా ఈటల రాజేందర్ కు పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కడంలేదనే వార్తలు ఇన్నాళ్లూ చక్కర్లు కొట్టాయి. ఇటీవలి జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత ఈటలకు ప్రాధాన్యం పెంచుతూ, చేరికల కమిటీకి ఆయనను కన్వీనర్ గా నియమించిది బీజేపీ హైకమాండ్. అయితే చేరిక కమిటీ పెద్దనే వేరే పార్టీలోకి చేరుతారంటూ రెండుమూడు రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతున్నది. ఈటల పార్టీ మార్పు అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘ఈటల రాజేందర్‌కు బీజేపీలో ప్రాధాన్యత లేదు. ఆయన తిరిగివస్తే టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటారన్న చర్చ ఊహాజనితమే’ అని కేటీఆర్ అన్నారు. శుక్రవారం మీడియాతో చిట్ చాట్ లో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

CM Jagan | CNOS Survey : జనాదరణలో జగన్ ఢమాల్.. జాతీయ సర్వేలో 20 స్థానంలో ఏపీ సీఎం


వరదల్లో ఉంటే తనిఖీ బృందాలా? : మీడియాతో చిట్ చాట్ లో టీఆర్ఎస్ కేటీఆర్.. బీజేపీ, కేంద్రం, ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తూ, దశాబ్దాల తర్వాత రికార్డు స్థాయి వరదలు పోటెత్తిన వేళ కేంద్రం చౌకబారుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రం ఓవైపు వరదలతో అతలాకుతలం అవుతుంటే.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులను తనిఖీ చేసేందుకు బృందాల్ని పంపుతుందా? రైతులకు ధాన్యం ఫ్లాట్‌ఫాములను కట్టడం కూడా తప్పంటే ఎలా? అని ప్రశ్నించారు. శత్రు దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించినట్లు తెలంగాణపై విధిస్తున్నారని, రెండేళ్ల కిందటి అప్పులను కూడా లెక్కల్లోకి తీసుకుని భవిష్యత్తు అప్పులకు పరిమితులంటున్నారని మోదీ సర్కారుపై ఆగ్రహించారు.

India Population : అత్యధిక జనాభా గల దేశంగా భారత్.. కొద్ది రోజుల్లోనే చైనాను దాటేస్తున్నాం..


దక్షిణాదిలో తొలి సీఎం కేసీఆర్ : తెలంగాణ అంతటా విస్తరించి, బలంగా ఉన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ ఒక్కటేనని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కనీసం 90 సీట్లు వస్తాయని, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు. దక్షిణాదిలోనే హ్యాట్రిక్‌ సీఎంగా కేసీఆర్‌ రికార్డు సృష్టిస్తారని చెప్పారు. కరుణానిధి, జయలలిత, ఆఖరికి ఎన్టీఆర్‌, తర్వాత చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి.. ఎవరూ వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రులుగా ఎన్నికవలేదని, దక్షిణాదిన ఆ ఘనత ను కేసీఆర్‌ సాధిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Eatala rajender, KTR, Minister ktr, Telangana, Trs

ఉత్తమ కథలు