హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR | Munugodu : నల్గొండ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ భేటీ .. మునుగోడు అభ్యర్ధి ఎవరంటే..?

KCR | Munugodu : నల్గొండ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ భేటీ .. మునుగోడు అభ్యర్ధి ఎవరంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

KCR | Munugodu: తెలంగాణ సీఎం, గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ నల్గొండ జిల్లా నేతలతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీష్‌రెడ్డి , మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో ఏ విషయంపై చర్చిస్తున్నారో తెలుసా.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మునుగోడు(Munugodu)ఉఎన్నికల్లో గెలుపుపైనే అధికార టీఆర్ఎస్‌(TRS) పార్టీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే బీజేపీ(BJP), కాంగ్రెస్‌(Congress) పార్టీలు తమ అభ్యర్ధి పేర్లను ప్రకటించాయి. ఇక మిగిలింది టీఆర్ఎస్‌ పార్టీయే కావడంతో తెలంగాణ సీఎం, గులాబీ పార్టీ అధినేత కేసీఆర్(kcr)నల్గొండ(Nalgonda)జిల్లా నేతలతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కేసీఆర్ భేటీ అయ్యారు. మునుగోడులో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీని ఓడించగల సమర్ధవంతమైన నాయకుడి ఎంపిక చేసే విషయంలో సలహాలు, అభిప్రాయాల్ని నల్లగొండ జిల్లా టీఆర్ఎస్‌ నాయకులను అడిగి తెలుసుకుంటున్నారు కేసీఆర్. బీజేపీ, కాంగ్రెస్‌ తరహాలోనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతను అభ్యర్ధిగా నిలబెడతారా లేక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దింపుతారా అనే విషయంపైనే సందిగ్ధం నెలకొంది.

కొడాలి నాని లారీలు కడుక్కునే టైంలోనే కార్పొరేటర్‌ని .. గుడివాడలో పోటీ చేసి గెలుస్తా : రేణుకాచౌదరి

అభ్యర్ధి ఎంపికపై కసరత్తు..

నల్లగొండ జిల్లా టీఆర్ఎస్‌ నేతల సమావేశంలోనే మునుగోడు ఉపఎన్నిక అభ్యర్ధి పేరును నిర్ణయించే అవకాశం ఉంది. అభ్యర్ధి పేరును కూడా త్వరలోనే ప్రకటించనున్నట్లుగా టీఆర్ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.అధికార పార్టీ కావడంతో టికెట్ ఆశిస్తున్న వారితో పాటు రేసులో ఉన్న వాళ్ల పేర్లను అధ్యక్షుడు కేసీఆర్‌ సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే అభ్యర్ధిగా పార్టీ అధిష్టానం ఎవరి పేరును ఖరారు చేసిన అందరూ టీఆర్ఎస్‌ గెలుపు కోసం కృషి చేయాలని గతంలోనే చెప్పడం జరిగింది.

జిల్లా నాయకులతో గులాబీ బాస్ భేటీ ..

కాంగ్రెస్‌కి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డి ఎలాగైనా ఉపఎన్నికల్లో తన పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారు. ఇక సిట్టింగ్‌ స్థానాన్ని తిరిగి తామే కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ఈరెండు పార్టీలకు ధీటుగా టీఆర్ఎస్‌ ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. మరి మునుగోడులో ముందుగా బహిరంగసభ పెట్టిన కేసీఆర్‌ ..అభ్యర్ధి ఎంపిక విషయంలో ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతున్నారో అనే చర్చ గులాబీ పార్టీలో సాగుతోంది.

First published:

Tags: CM KCR, Munugodu By Election, Telangana Politics

ఉత్తమ కథలు