హోమ్ /వార్తలు /తెలంగాణ /

Good News: తెలంగాణ ప్రజలకు కేసీఆర్ శుభవార్త..మరో 3 నెలలు ఫ్రీ రేషన్ పొడగింపు

Good News: తెలంగాణ ప్రజలకు కేసీఆర్ శుభవార్త..మరో 3 నెలలు ఫ్రీ రేషన్ పొడగింపు

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చింది. దీనితో రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి 5 కిలోల బియ్యాన్ని ఫ్రీగా ఇస్తుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చింది. దీనితో రేషన్ కార్డు( Ration Card) ఉన్న ప్రతీ ఒక్కరికి 5 కిలోల బియ్యాన్ని ఫ్రీగా ఇస్తుంది.  కరోనా ప్రారంభ సమయంలో మొదలైన ఈ పథకం 2022 సెప్టెంబర్ వరకు పలు దఫాలుగా పొడిగిస్తూ వచ్చింది. ఇక తాజాగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని డిసెంబర్ నెల వరకు పెంచుతూ కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటనతో ప్రజలకు ఉచితంగా 5 కిలోల రేషన్ ఫ్రీగా పొందనున్నారు. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు మరో శుభవార్త చెప్పారు.

  రాష్ట్రంలో రేషన్ కార్డు ( Ration Card) లబ్దిదారులకు ఉచితంగా 5 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. అంటే కేంద్రం ఇచ్చే 5 కిలోలు, రాష్ట్ర సర్కార్ ఇచ్చే 5 కిలోల బియ్యం మొత్తం ఒక వ్యక్తికి 10 కిలోల బియ్యాన్ని డిసెంబర్ వరకు ఉచితంగా అందజేయనున్నారు. గతంలో ఒక కిలో బియ్యానికి రూపాయి చొప్పున చెల్లించాల్సి ఉండేది. కానీ తాజా నిర్ణయంతో ప్రజలకు 10 కిలోల బియ్యం ఫ్రీగా అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Gangula kamalakar) కీలక ప్రకటన చేశారు.

  ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 90 లక్షల రేషన్ కార్డు దారులకు ( Ration Card) ఈ ప్రయోజనం లభించనుందని తెలిపారు. మొత్తం 2 కోట్ల 83 లక్షల 42 వేల మంది లబ్దిదారులకు గానూ కేంద్రం కేవలం కోటి 91 లక్షల మందికి మాత్రమే 5 కిలోల చొప్పున ఇస్తుందన్నారు.అయితే వీరందరికి అదనంగా 5 కిలోలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. రాష్ట్రం మొత్తం బియ్యం (Rice) పంపిణీ చేయడానికి 19,057 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా రాష్ట్ర సర్కార్ సేకరిస్తుందన్నారు. వీటి కోసం నెలకు రూ.75.75 కోట్ల చొప్పున రాబోయే మూడు నెలల్లో రూ.227.25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనున్నామని మంత్రి గంగుల పేర్కొన్నారు. ఇక అక్టోబర్ నెలకు సంబంధించి ఈ నెల 6నుంచి (నేటి నుంచి) బియ్యం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

  ఈ పథకం కింద ప్రతి లబ్ధిదారుడు జాతీయ ఆహార భద్రతా చట్టం(NFSA) కింద లభిస్తున్న రేషన్‌ కోటాతో పాటు అదనంగా ఉచిత రేషన్‌ పొందుతారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద ప్రతి వ్యక్తికి నెలకు అదనంగా 5 కిలోల ఉచిత బియ్యం అందుతాయి. దేశంలోని దాదాపు 5 లక్షల రేషన్ షాపుల నుంచి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్(ONORC) పథకం కింద ఏ వలస కార్మికుడు లేదా లబ్ధిదారుడు అయినా పోర్టబిలిటీ ద్వారా ఉచిత రేషన్ ప్రయోజనం పొందవచ్చు.

  Published by:Rajashekar Konda
  First published:

  Tags: Free Ration

  ఉత్తమ కథలు