హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Politics: కేసీఆర్ ఫస్ట్ టార్గెట్ ఆ రాష్ట్రమే..వచ్చే ఎన్నికల్లో పోటీపై క్లారిటీ

Telangana Politics: కేసీఆర్ ఫస్ట్ టార్గెట్ ఆ రాష్ట్రమే..వచ్చే ఎన్నికల్లో పోటీపై క్లారిటీ

KCR (FILE)

KCR (FILE)

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు. అందరూ అనుకున్న విధంగానే TRS (తెలంగాణ రాష్ట్ర సమితి)ని BRS (భారత్ రాష్ట్ర సమితి)గా మారుస్తూ అధికారిక ప్రకటన చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు. అందరూ అనుకున్న విధంగానే TRS (తెలంగాణ రాష్ట్ర సమితి)ని BRS (భారత్ రాష్ట్ర సమితి)గా మారుస్తూ అధికారిక ప్రకటన చేశారు. దీనితో టీఆర్ఎస్ ఇక బిఆర్ఎస్ గా మారబోతుంది. కేసీఆర్ ప్రకటనతో 21 ఏళ్ల టిఆర్ఎస్ ప్రస్థానంలో మరో కీలక మలుపు చేసుకుంది. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా పేరు మార్పు చేశారు. ఇక కేసీఆర్ మొదటి టార్గెట్ గా కర్ణాటకను ఎంపిక చేశారు. తెలంగాణ కంటే ముందే అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితిని అధికారంలోకి తీసుకురావాలని కేసీఆర్ యోచిస్తున్నారట.

  ఇప్పటికే సీఎం కేసీఆర్ కు కర్ణాటక మాజీ సీఎం మద్దతు తెలిపారు. అంతేకాదు రాబోయే ఎన్నికల్లో దేవెగౌడ పార్టీ జనతా దళ్ సెక్యులర్ తో కలిసి పోటీ చేయనున్నారు. ఇక నేడు కేసీఆర్ భేటీకి దేవెగౌడ కుటుంబం మొత్తం కలిసి వచ్చారు. ఇక జాతీయ పార్టీ ప్రకటన అనంతరం కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయం అంటే ఓ టాస్క్ అని మిగతా వారికి రాజకీయం ఓ క్రీడా వంటిదని అన్నారు. దేశ ప్రజల కోసమే బిఆర్ఎస్ తీసుకొచ్చామని అన్నారు.

  దేశ ప్రజల కోసమే బిఆర్ఎస్ తీసుకొచ్చామని అన్నారు. రైతు సంక్షేమమే తమ ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బంగ్లాదేశ్ కంటే వెనకపడడం ఏంటని ప్రశ్నించారు.  కర్ణాటక, మహారాష్ట్ర మన మొదటి కార్య క్షేత్రాలని అక్కడి రైతులకు మేలు జరిగేలా చూద్దామని అన్నారు.

  ఇక తెలంగాణ పథకాలపై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ప్రశంసలు కురిపించాడు. దేశమంతా ఇలాంటి పథకాలు అమలు చేయాలని కేసీఆర్ ను కోరానన్నారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, బీఆర్ఎస్ సక్సెస్ కావాలని కోరుకుంటున్న అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో కర్ణాటకలో జెండా ఎగురవేయాలన్నారు. అందుకోసం బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తామని కుమారస్వామి ప్రకటించారు. కేసీఆర్ తో జెడియు ఎమ్మెల్యేలు కలిసి దేశమంతా తిరుగుతారని ఆయన తెలిపారు.

  Published by:Rajasekhar Konda
  First published:

  Tags: Karnataka, Kcr, Telangana

  ఉత్తమ కథలు