హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munagodu: మునుగోడు ఉపఎన్నిక బాధ్యత వాళ్లిద్దరికే అప్పగింత .. కేసీఆర్‌ ప్లాన్‌ వర్కవుటయ్యేనా..?

Munagodu: మునుగోడు ఉపఎన్నిక బాధ్యత వాళ్లిద్దరికే అప్పగింత .. కేసీఆర్‌ ప్లాన్‌ వర్కవుటయ్యేనా..?

KTR ,HARISHRAO(FILE)

KTR ,HARISHRAO(FILE)

Munagodu: మునుగోడు ఉపపోరు మూడు ప్రధాన పార్టీలకు చావో-రేవోగా మారింది. నవంబర్ మూడో తేదిన పోలింగ్ ఉండటంతో ..అధికార టీఆర్ఎస్‌ గెలుపుపై గురి పెట్టింది. మునుగోడు గెలుపు బాధ్యతను పార్టీలోని ఆ కీలక నేతలిద్దరి భుజస్కందాలపై వేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలోని బీజేపీ(BJP), టీఆర్ఎస్‌(TRS), కాంగ్రెస్‌(Congress)మూడు ప్రధాన పార్టీలకు నవంబర్ మూడో తేది తాడో పేడోగా మారింది. మునుగోడు(Munagodu)ఉపఎన్నికతో ఏ పార్టీ మునుగుతుందో ...ఏ పార్టీ గెలిచి మొనగాడిగా నిలబడుతుందో అనే చర్చపై ఇప్పటి నుంచే బెట్టింగ్‌లు మొదలయ్యాయి. మరోవైపు బరిలో నిలిచిన అన్నీ పార్టీల్లో కూడా అంతే సవాల్‌ కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్‌కు మునుగోడు విజయం బస్తీమే సవాల్‌గా మారింది. జాతీయ రాజకీయాల్లో కీలక అడుగు పడుతున్న సమయంలో పరాజయం పలకరించకూడదనే ఆలోచనతో గులాబీ బాస్ పక్కా వ్యూహరచన చేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికను గెలిపించే బాధ్యతను పార్టీలోని ఇద్దరు యమాయమీలకు అప్పగించారు. వాస్తవంగా ఏ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరిగినా మంత్రి హరీష్‌రావు(Harish Rao)కు లేదంటే ఆ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రికి బాధ్యతలు అప్పగించే కేసీఆర్ ..ఈసారి మరింత లోతుగా ఆలోచించి ..టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)కు సైతం బాధ్యతల్లో భాగస్వామ్యం కల్పించి జోడు గుర్రాలను రంగంలోకి దింపుతున్నారు.

Telangana : మండవ ఈసారి పోటీ చేయడం పక్కా .. ఏ పార్టీ నుంచంటే..?

మునుగోడు బాధ్యత ఆ ఇద్దరికి ..

మునుగోడు నియోజకవర్గం పరంగా చూసుకుంటే ఇక్కడ ఇప్పటి వరకు ఇక్కడ 12సార్లు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్‌ గెలిచింది ఒకే ఒక్కసారి. అది కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. అయితే సాధారణంగా సీపీఐ కంచుకోటగా ఉన్న ఈనియోజకవర్గం గెలుపు ముఖ్యమని భావించిన గులాబీ బాస్‌ సీపీఐ మద్దతు తీసుకున్నారు. అయినప్పటికి రాజకీయ సమీకరణాలు ఏమాత్రం మారినా గెలుపుపై ప్రమాదం చూపిస్తుందనే ఆలోచనతోనే హరీష్‌రావు, కేటీఆర్‌కు ఉపఎన్నిక బాధ్యతను అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అంతా తానై వ్యవహరించిన జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డిపై పార్టీలో కొంత అసంతృప్తి వ్యక్తమైన నేపధ్యంలోనే కేసీఆర్ తన ఆలోచన మార్చుకొని ఈవిధంగా డిసైడ్ చేశారనే టాక్‌ కూడా ఉంది.

ప్రచారమే కీలకం..

మునుగోడు గెలుపు సిట్టింగ్ స్థానం పోగొట్టుకున్న కాంగ్రెస్‌ కంటే అక్కడ గెలిచిన రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి మళ్లీ తానే గెలుస్తానని శపథం చేయడంతో ఈ బైపోల్‌ ఫైట్ ఉత్కంఠగా మారింది. ట్రయాంగిల్ ఫైట్‌గా నడుస్తోంది. అందుకే రెండు పార్టీలను ఎదుర్కొని..విజయాన్ని గారు గుర్తు పార్టీకి దక్కించాలంటే ఇద్దరికి బాధ్యతలు అప్పగిస్తేనే బెటర్ అనే ఆలోచనతోనే మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌ని ఎంచుకున్నారని తెలుస్తోంది. గులాబీ పార్టీ అభ్యర్ధిని ఎంపిక చేసే విషయంలో కూడా కేసీఆర్ ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారనే టాక్ ఉంది. మొత్తం 40మంది ఆశావాహులు టికెట్‌పై గురి పెట్టుకుంటే అందులో సమర్ధులైన వారిని దసరా రోజే ప్రకటించాలని డిసైడ్ అయ్యారు.

Congress: కాంగ్రెస్‌కు ‘మునుగోడు’ టెన్షన్.. నవంబర్ 6 తరువాత ఏం జరుగుతుందో..?

బహిరంగసభకు ప్లాన్ ..

ఇప్పుడు అభ్యర్ది పేరు ప్రకటిస్తే ప్రచారానికి టైమ్ ఉండటంతో పాటు నియోజకవర్గంలోని ప్రతి ఓటును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ట్రై చేస్తున్నారు. ఇందుకోసం యూనిట్‌కి 20మంది నాయకులుగా ఏర్పాటు చేసి మొత్తం మునుగోడును 85యూనిట్లుగా సెపరేట్ చేసి ప్రచార బాధ్యతల్ని అప్పగించనున్నారు. అందరికంటే ముందే బహిరంగసభ పెట్టిన కేసీఆర్ ప్రచారం ముగిసే లోపే మరోసారి మునుగోడులో తన బహిరంగ సభతో ప్రత్యర్ధులకు ఓటమి గుబులు పుట్టించాలని చూస్తున్నారు.మరి గులాబీ బాస్ స్కెచ్ ..ఇద్దరు అగ్రనేతల నాయకత్వంలో టీఆర్ఎస్‌కి మునుగోడు బైపోల్‌లో ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాలి.

Published by:Siva Nanduri
First published:

Tags: CM KCR, Munugode Bypoll, Telangana Politics

ఉత్తమ కథలు