హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana politics : జాతీయ రహదారి చుట్టూ రాజకీయాలు .. కాంగ్రెస్,TRSనేతల మధ్య మాటల యుద్ధం

Telangana politics : జాతీయ రహదారి చుట్టూ రాజకీయాలు .. కాంగ్రెస్,TRSనేతల మధ్య మాటల యుద్ధం

karimnagar nh politics

karimnagar nh politics

Telangana politics: జాతీయ రహదారి విస్తరణ చుట్టూ ప్రస్తుత కరీంనగర్ రాజకీయం నడుస్తోంది. ఎన్‌హెచ్ 563 ఫోర్‌ లైన్‌ అలైన్‌మెంట్‌పై రెండు పార్టీలు తీవ్ర ఆరోపణలు చేసుకున్నాయి.గడ్కరీ ప్రకటనతో NH ఫోర్‌ లైన్‌కి మోక్షం లభించిందనుకుంటే అలైన్‌మెంట్ కిరికిరి మొదలైంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (P.Srinivas,New18,Karimnagar)

  జాతీయ రహదారి విస్తరణ చుట్టూ ప్రస్తుత కరీంనగర్(Karimnagar)రాజకీయం నడుస్తోంది. ఐదు రోజుల పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) టీఆర్ఎస్(TRS) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. జగిత్యాల (Jagityala) ,కరీంనగర్ ( Karimnagar),వరంగల్(Warangal)జాతీయ రహదారి(National highway) విస్తరణపై ఢీ అంటే ఢీ అనుకున్నారు.(NH)563 ఫోర్‌ లైన్‌ అలైన్‌మెంట్‌(Four line alignment) పై రెండు పార్టీలు తీవ్ర ఆరోపణలు చేసుకున్నాయి. తాజాగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ(Nitin Gadkari)చేసిన ప్రకటనతో నేషనల్ హైవే ఫోర్‌ లైన్‌కి మోక్షం లభించినట్లే అనుకుంటే అలైన్‌మెంట్ అంశంతో మళ్లీ కిరికిరి మొదలైంది.

  Telangana : Kg మటన్ 400రూపాయలే .. హైదరాబాద్‌కి సమీపంలోనే దొరుకుతోంది

  రహదారి పేరుతో రచ్చ..

  కరీంనగర్‌లో ప్రస్తుతం జాతీయ రహదారి విస్తరణ చుట్టూ రాజకీయం నడుస్తుంది. ఐదురోజుల పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది . జగిత్యాల, కరీంనగర్ , వరంగల్ జాతీయ రహదారి విస్తరణపై ఢీ అంటే ఢీ అనుకున్నారు. ఎన్‌హెచ్ 563 ఫోర్‌ లైన్‌ అలైన్‌మెంట్‌పై రెండు పార్టీలు తీవ్ర ఆరోపణలు చేసుకున్నాయి. మాజీ ఎంపీ వినోద్ కుమార్ వ్యక్తి గత ప్రయోజనాల కోసం అలైన్‌మెంట్‌ మారుస్తున్నారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పచ్చని పొలాలను నాశనం చేస్తూ మెడికల్ కాలేజీ కోసం అలైన్‌మెంట్ మార్చారని మండిపడగా ఈ రోడ్డు గురించి తెలియ కుండా పొన్నం మాట్లాడుతున్నాడంటూ మేయర్ సునీల్‌రావుతో పాటు టీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. దీంతో ప్రస్తుతం ఈ జాతీయ రహదారి అంశం జిల్లాలోనే హాట్ టాపిక్‌గా మారింది.

  నేతల మధ్య మాటల యుద్ధం..

  రాష్ట్రంలోని పలు జాతీయ రహదారుల పనులకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఏప్రి ల్ 29 న శంకుస్థాపన , ప్రారంభోత్సవాలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జాతీయ రహదారులను విస్మ రించారని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. అప్పట్లో నాలుగు జాతీయ రహదారుల పనుల్లో మెదక్,సిద్దిపేట,ఎల్కతుర్తి పనులను మాత్రం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. కాని మిగిలిన మూడు జాతీయ రహదారుల విషయం మరిచిపోయారు. ఐదు నుంచి ఆర సంవత్సరాలు పెండింగ్ లో ఉన్న జగిత్యాల, వరంగల్ వయా కరీంనగర్ ... కరీంనగర్ - సిరిసిల్ల - కామారెడ్డి - పిట్లం , కరీంనగర్ - వీణవంక - జమ్మి కుంట - టేకుమట్ల - భూపాలపల్లి , సిద్దిపేట - సిరిసిల్ల - వేములవాడ - కథలాపూర్ కోరుట్ల జాతీయ రహదారులను విస్మరించారు. ఇటీవల ఎన్‌హెచ్‌ 563 విషయంలో గట్కారీ చేసిన ప్రకటనతో మోక్షం లభించినట్లే అనుకున్నప్పటికి అలైన్‌మెంట్‌ విషయంలో రచ్చ మొదలైంది.

  మోక్షమెప్పుడో..?

  2016 జూన్ 24 న జాతీయ రహదారుల పనుల పర్యవేక్షణ సూపరింటెండెంట్ ఇంజనీర్ కోసం ( ఎస్ఈ ) ఆఫీస్‌ని ప్రారంభించారు. పనుల్లేక ఆఫీసు మూతపడింది. ఉత్తర తెలంగాణలోనే జాతీయ రహదారుల హబ్‌గా కరీంనగర్ జిల్లాను తీర్చిదిద్దేందుకు ఎస్ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తే అది పట్టుమని మూడేళ్లు కూడా పని చేయకపోవడంతో వివాదంలో ఉన్న(NH)563 కి పరిష్కారమార్గం అంత తొందరగా దొరకడం కష్టమేనని తెలుస్తోంది. వరంగల్ జాతీయ రహదారి ( NH563)4లేన్ పనులకు మోక్షం లభించింది. ఈ పనుల కోసం రూ. 2,146 కోట్ల 86 లక్షలను కేంద్రం మంజూరు చేసింది . ఈ మేరకు కేంద్ర రహదారులు , రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు ఇటీవల ట్వీట్ చేశారు.

  Bandi Sanjay : ఇకపై రాజకీయ విమర్శలకు బండి సంజయ్‌ దూరం .. తెలంగాణ బీజేపీ చీఫ్‌లో చేంజ్‌కి కారణం..?

  నిధులు విడుదల చేసేనా..

  నిధులు మంజూరవడంతో పనులు మొదలవుతాయనుకున్న టైమ్‌లో అలైన్‌మెంట్ వివాదం మళ్లీ మొదటికి తెచ్చింది. రోడ్డు విస్తరణ పనుల్ని వీలైనంత తొందరగా పూర్తి చేయించాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, స్థానిక ఎంపీ బండి సంజయ్ కొద్దికాలంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులను కలిసి పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్నవి మంచిర్యాల - వరంగల్ రహదారి ఖమ్మం వరకు పొడిగింపు మంచిర్యాల నుంచి కరీంనగర్ మీదుగా వరంగల్ వరకు జాతీయ రహదారి (NH563)ని కేంద్రం గతేడాది మంజూరు చేసింది. అయితే మంచిర్యాల నుంచి వరంగల్ వెళ్ళే ఈ రహదారి రెండుమార్గాల ద్వారా వెళ్లవచ్చు. జగిత్యాల మీదుగా ఒక మార్గమైతే , మరొకటి జగిత్యాలను తాకకుండా కరీంనగరకు వెళ్లేది. ఈ అంశాలపై సీఎం కేసీఆర్ గతంలోనే గడ్కరీకి స్వయంగా వివరించారు.

  ప్రతిపాదనలు పాతవే..

  మంచిర్యాల నుంచి జగిత్యాల వరకు సుమారు 70 కి.మీ. మేర జాతీయ రహదారి (NH63) ఉన్నదని , మంచిర్యాల నుంచి కరీంనగర్ వరకు ఉన్న రాష్ట్ర రహదారి పబ్లిక్ - ప్రైవేటు భాగ స్వామ్యంతో నాలుగు లైన్ల రహదారిగా మారిందని వివరించారు. జగిత్యాలనుంచి వరంగల్‌కు ఉన్న రహదారిని జాతీయ రహదారుల అథారిటీ తీసుకున్నదని , దీన్ని ఖమ్మంవరకూ పొడిగించడం ద్వారా వరంగల్ , కరీంనగర్ , ఖమ్మం జిల్లాలను కలిపే వీలవుతుందని వివరించారు. అప్పట్లో దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. అనుమతి లభించింది కాని ఆ దిశగా ఇప్పటికీ ఉత్తర్వులు వెలువడలేదు.

  పూర్తి చేయకుండా కాలయాపన..

  కేంద్ర ప్రభుత్వం 2017లో 131 కిలోమీటర్ల దూరంతో భూపాలపల్లి నుంచి కరీంనగర్ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . నేటికి ఈ రహదారికి మోక్షం లభించడంలేదు . భూపాలపల్లి సీ జంక్షన్ నుంచి రం మీదుగా చిట్యాల మండలం చైస్పాక , అందుకుతండా , టేకుమట్ల , చిట్యాల నుంచి కరీంనగర్ జిల్లా జమ్మికుంట , వీణవంక మీదుగా కరీంనగర్ వరకు ఈ జాతీయ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భూపాలపల్లి , చిట్యాల , టేకుమట్ల మొగుళ్లపల్లి మండలాల్లోని మారుమూల ప్రాంతాలకు రోడ్డు సౌకర్యంతోపాటు వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని భావించారు . కరీంనగర్ జిల్లాకు దూర భారం తగ్గనుందని , జమ్మికుంటలోని వ్యవసాయ మార్కెట్‌తో పాటు , ఇతర వ్యాపార సంబంధాలు మెరుగు పడుతాయని భావించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ జాతీయ రహదారికి నిధులు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Karimnagar, Telangana Politics

  ఉత్తమ కథలు