TS POLITICS KA PAUL MET TELANGANA GOVERNOR TAMILISAI SOUNDARAJAN AT RAJ BHAVAN AFTER HE WAS ATTACKED IN SIDDIPET PRV
KA Paul met Governor: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ దూకుడు.. గవర్నర్ తమిళిసైని కలిసి వినతిపత్రం
కేఏ పాల్, గవర్నర్ తమిళిసై (ఫైల్)
కేఏ పాల్ సిద్ధిపేటకు వెళ్లినపుడు ఆయనపై ఓ టీఆర్ఎస్ కార్యకర్త దాడి చేయడం సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో కేఏ పాల్ శ రాజభవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తో భేటీ అయ్యారు.
కేఏ పాల్ (KA Paul)ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. .శాంతి దూతగా ఎంత మందికి కేఏ పాల్ తెలుసో తెలీదొ కాని పొలిటికల్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయన గురించి తెలియని వాళ్లు ఉండారు. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియాలో ఆయన క్రేజ్ అంతా ఇంతా కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఏం మాట్లాడినా అందరూ ఆసక్తిగా చూస్తారు. ఆయన ఇచ్చే పొలిటికల్ స్పీచ్ లకు వ్యూస్ కోట్లలో ఉంటాయి. అందుకే తెలుగు న్యూస్ చానల్స్ అన్ని ఆయన్ని తమ స్టూడియోలో కూర్చోపెట్టుకొని ఎందో ఒక అంశంపై మాట్లాడించడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి. 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తానని హాడావిడి చేసిన కేఏ పాల్ తరువాత పోటీలోనే లేకుండా వెళ్లిపోయారు.
అయితే తాజాగా మళ్లీ కేఏ పాల్ తెలంగాణ రాజకీయల్లో ప్రత్యక్షమైయ్యారు (KA Paul entry in Telangana). తెలంగాణతోపాటు ఏపీలో కూడా కేసీఆర్, జగన్ ముందస్తుకు వెళతారని ఉహాగానాలు ఉన్న నేపథ్యంలో కేఏ పాల్ తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) హాల్ చల్ చేస్తుండటంతో ఇప్పుడు మళ్లీ కేఏ పాల్ చర్చనీయాంశంగా మారారు. పాల్ అమెరికా నుంచి వచ్చి రావడంతోనే కేసీఆర్ (CM KCR) పైనే నిప్పుడు చెరగడం ప్రారంభించారు. బంగారు తెలంగాణ సాధ్యం నాతోనే అంటూ ప్రెస్ మీట్ ల మీద ప్రెస్ మీట్ లు పెట్టడం ప్రారంభించారు. ఇటీవల సిద్ధిపేటకు వెళ్లినపుడు ఆయనపై ఓ వ్యక్తి దాడి చేయడం సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో కేఏ పాల్ రాజభవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ (Governor Tamilsai Soundarajan) తో భేటీ అయ్యారు.
చెంప మీద కొట్టారని..
కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండలం జక్కాపూర్ దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తలు తనపైన చేయిచేసుకుని భౌతిక దాడికి పాల్పడ్డారని గవర్నర్‌కు కేఏ పాల్ (KA paul) ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల వెళ్లడానికి బస్వాపూర్ గ్రామానికి చేరుకోడానికి ముందే సిద్దిపేట జిల్లా జక్కాపూర్ గ్రామం దగ్గరకు చేరుకోగానే సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని పోలీసులు తనను ముందుకు పోకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఆ విషయం గురించి డీఎస్పీ చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతుండగానే కేటీఆర్ అభిమానుడిగా చెప్పుకునే ఒక వ్యక్తి చెంపమీద కొట్టారని, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని గవర్నర్‌కు కేఏ పాల్ వివరించారు.
పోలీసులు చట్టం ప్రకారం విధులు నిర్వర్తించడం లేదని..
తన పర్యటన గురించి జిల్లా ఎస్బీ (SP)కి ముందుగానే తెలియజేశానని కేఏ పాల్ గుర్తుచేశారు. అయినప్పటికీ డీఎప్సీ తనను బస్వాపూర్ గ్రామంలోకి వెళ్ళకుండా సిద్దిపేట జిల్లా హద్దుల్లోనే ఆపేశారని, మంత్రి కేటీఆర్ (KTR) నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అడ్డుకున్నట్లు స్పష్టమైందని, జిల్లా ఎస్పీతో మాట్లాడిన ఫోన్ రికార్డింగ్ ఎవిడెన్స్ కూడా తన దగ్గర ఉన్నదని గుర్తుచేశారు. పోలీసులు (Police) చట్టం ప్రకారం విధులు నిర్వర్తించడంలేదని, అధికార పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో శాంతిభద్రతలు అదుపులో లేవని గవర్నర్‌కు సమర్పించిన మెమొరాండంలో కేఏ పాల్ పేర్కొన్నారు. డీజీపీ(DGP)కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి డీఎస్పీని, సీఐని సస్పెండ్ చేయించేందుకు గవర్నర్ హోదాలో చొరవ తీసుకోవాలని కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.