Home /News /telangana /

TS POLITICS KA PAUL HAS LODGED A COMPLAINT WITH THE CBI DIRECTOR ALLEGING THAT TELANGANA CM KCR WAS INVOLVED IN CORRUPTION PRV

KA Paul | CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు కేఏ పాల్​ షాక్​.. నేరుగా ఢిల్లీకి వెళ్లి ఝలక్​..

కేఏ పాల్​., సీఎం కేసీఆర్​ (ఫైల్ ఫొటోలు)

కేఏ పాల్​., సీఎం కేసీఆర్​ (ఫైల్ ఫొటోలు)

కేఏ పాల్​. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రజాశాంతి పార్టీ అధినేత. ఇపుడు తెలంగాణ సీఎం కేసీఆర్​కు షాక్​ ఇచ్చారు కేఏ పాల్​.

  కేఏ పాల్ (KA Paul) ఈ పేరుకు పెద్దగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. .శాంతి దూత‌గా ఎంత మందికి కేఏ పాల్ తెలుసో తెలీదొ కాని పొలిటిక‌ల్​గా ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న గురించి తెలియ‌ని వాళ్లు ఉండారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే సోష‌ల్ మీడియాలో ఆయ‌న క్రేజ్ అంతా ఇంతా కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న ఏం మాట్లాడినా అంద‌రూ ఆస‌క్తిగా చూస్తారు. ఆయ‌న ఇచ్చే పొలిటిక‌ల్ స్పీచ్ ల‌కు వ్యూస్ కోట్ల‌లో ఉంటాయి. అందుకే తెలుగు న్యూస్ చాన‌ల్స్ అన్ని ఆయ‌న్ని త‌మ స్టూడియోలో కూర్చోపెట్టుకొని ఎందో ఒక అంశంపై మాట్లాడించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంటాయి. 2019 ఎన్నిక‌ల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తానని హాడావిడి చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు (Praja shanti Party President) కేఏ పాల్ త‌రువాత పోటీలోనే లేకుండా వెళ్లిపోయారు. అయితే తాజాగా మ‌ళ్లీ కేఏ పాల్ తెలంగాణ రాజ‌కీయ‌ల్లో ప్ర‌త్యక్ష‌మైయ్యారు (KA Paul entry in Telangana).

  తెలంగాణతోపాటు ఏపీలో కూడా కేసీఆర్, జ‌గ‌న్ ముంద‌స్తుకు వెళతార‌ని ఉహాగానాలు ఉన్న నేప‌థ్యంలో కేఏ పాల్ తెలంగాణ రాజ‌కీయాల్లో (Telangana Politics) హాల్ చ‌ల్ చేస్తుండ‌టంతో ఇప్పుడు మ‌ళ్లీ కేఏ పాల్ చ‌ర్చ‌నీయాంశంగా మారారు. పాల్​ అమెరికా నుంచి వ‌చ్చి రావ‌డంతోనే కేసీఆర్ (CM KCR) పైనే నిప్పుడు చెర‌గ‌డం ప్రారంభించారు. బంగారు తెలంగాణ సాధ్యం నాతోనే అంటూ ప్రెస్ మీట్ ల మీద ప్రెస్ మీట్ లు పెట్ట‌డం ప్రారంభించారు. కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, గవర్నర్ తమిళిసైని తరచూ కలుస్తోన్న కేఏ పాల్ పై ఇటీవల టీఆర్ఎస్ నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు పాల్ ప్రయత్నించినా డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు టైమివ్వలేదు. తనపై దాడి కేసీఆర్ కుటుంబం చేయించిందేనంటూ గవర్నర్ కు, కేంద్రానికి సైతం ఫిర్యదు చేశారు కేఏ పాల్​.

  సీబీఐ డైరెక్టర్​ దగ్గరికి..

  తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కు వ్యతిరేకంగా  కేఏ పాల్ మరో కీలక ముందడుగు వేశారు. కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతిపై సీబీఐ డైరెక్టర్ సుబోద్ కుమార్ జైశ్వాల్ (CBI Director Subodh Kumar Jaishwal) కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. బుధవారం ఢిల్లీలోని సీబీఐ డైరెక్టర్ తో సమావేశం అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతోందని (Committing corruption) ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ చేస్తున్న అవినీతిపై ఇంతవరకు ఎవరూ సరైన రీతిలో ఫిర్యాదు ఇవ్వలేదని, అందువల్లే సీబీఐ వారిపై చర్యలు తీసుకోలేకపోతోందని అన్నారు.

  యాదగిరిగిగుట్ట నిర్మాణం విషయంలో అవినీతి చోటుచేసుకుందని సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు పాల్​ తెలిపారు.  అలాగే  కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram project) విషయంలో రూ.లక్షా ఐదు వేలకోట్ల అవినీతి జరిగిందని ఫిర్యాదులో తెలిపినట్లు వివరించాడు పాల్​. ఇక గతంలో  తనపై జరిగిన దాడి విషయంలో ఇంకా ఎందుకు అరెస్టులు జరగలేదని ప్రశ్నించానని అన్నారు. అందుకు కోర్టు నుండి ఆర్డర్స్ రావాల్సి ఉందని.. కోర్టు ఆర్డర్ లేనిదే తాము చర్యలు తీసుకోబోమని అధికారులు చెప్పినట్లు కేఏ పాల్ వివరించారు.

  ఇక రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళను ప్రకటించడం సంతోషకరమని పాల్​ అన్నారు. తాను మొదటి నుండి షెడ్యూల్డ్ కులాలకు చెందిన మహిళలకు రాష్ట్రపతి పదవి ఇవ్వాలని బీజేపీకి చెప్పానన్నారు. వెంకయ్య నాయుడిని రాష్ట్రపతిగా వద్దని ఇదివరకే సూచించానని కేఏ పాల్ చెప్పడం కొసమెరుపు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CBI, CM KCR, Ka paul

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు