TS POLITICS KA PAUL GETTING READY FOR A PADAYATRA IN TELANGANA SNR BK HYD
TS| KA PAUL:తెలంగాణలో కేఏ పాల్ పాదయాత్ర..సెంటిమెంట్‌గా అక్కడి నుంచే ప్రారంభం..?
(తెలంగాణలో పాల్ పాదయాత్ర)
TS| KA PAUL:బంగారు తెలంగాణ సాధన కోసం మరో పార్టీ తెలంగాణలో అడుగుపెట్టింది. గత ఎన్నికల్లో ఏపీలో హడావుడి చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఈసారి తెలంగాణ ఎన్నికలపై గురి పెట్టారు. ఎన్నికల నోటిఫికేషన్‌లోగా పార్టీని బలోపేతం చేసుకునేందుకు తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమవడం చర్చనీయాంశమైంది.
(M.Balakrishna,News18,Hyderabad)
గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో హడావుడి చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) ..ఇప్పుడు తెలంగాణ(Telangana)పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీతోనే తనదైన శైలీలో టీఆర్ఎస్ (TRS)ప్రభుత్వం, సీఎం కేసీఆర్(KCR)పై నిప్పులు చెరిగారు కేఏ పాల్. అమెరికా (America) శంషాబాద్(Shamshabad)లో అడుగుపెట్టడంతోనే రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోని అన్నీ పోటీ చేస్తామని అంతే కాదు బంగారు తెలంగాణ తనతో సాధ్యమంటూ భారీ స్టేట్మెంట్(Statement)ఇచ్చారు. ఉన్నపళంగా కేఏ పాల్ ఆంధ్రా నుంచి తెలంగాణ రాజకీయాల్లో తలదూర్చడం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు ఆయన సన్నిహితులు. ఓవైపు రాష్ట్ర అధికార పార్టీపై విమర్శలు చేస్తూనే మరోవైపు తన సభకు పర్మిషన్ ఇవ్వకుండా..రాహుల్‌గాంధీ(Rahul Gandhi)సభకు అనుమతివ్వడంపై రచ్చ చేసిన కేఏ పాల్ ..ఇకపై ప్రజాక్షేత్రంలోనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతానంటూ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.
తెలంగాణలో టెంట్ పాతిన పాల్..
రాజకీయాల్లో పాదయాత్ర సెంటిమెంట్‌గా మారడంతో కేఏ పాల్ సైతం తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి కేఏపాల్ తన పాదయాత్ర ప్రారంభించబోతున్నట్లు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేష్ వచ్చే వరకు పాదయాత్ర చేయాలని పాల్ భావిస్తున్నారట కేఏ పాల్.అంతే కాదు కేఏపాల్ తన పాదయాత్రను గతంలో దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన చేవెళ్ల ప్రాంతం నుంచి మొదలు పెట్టబోతున్నట్లుగా ఆయన సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.
రాష్ట్రంలో పాదయాత్రకు రెడీ..
తెలంగాణ ఎన్నికలకు మరో ఏడాదికిపైగా సమయం ఉన్నప్పటికి పార్టీలు మాత్రం ఎవరి పంథాలో వాళ్లు పాదయాత్రలు చేసుకుంటూ పోతున్నారు. ఓవైపు బీజేపీ తరపున బండి సంజయ్ మరోవైపు తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు షర్మిళ పాదయాత్రలు చేస్తున్నారు. ఇదే టైమ్‌లో కేఏ పాల్ సైతం పాదయాత్రకు సిద్దమవడం చూస్తుంటే అందర్ని రంగంలోకి దింపుతోంది బీజేపీ అధిష్టానమే అనే ప్రచారం కూడా ఉంది. అందుకే బీజేపీ నేతలు ఈ ఇద్దరికి టచ్‌లో ఉన్నారని కొంత మంది అధికార పార్టీ నేతలు అనుమానిస్తున్నారు.
పొలిటికల్ స్కెచ్ వర్కవుట్ అయ్యేనా..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు మరికొంత సమయం ఉంది. అయినప్పటికి ముందస్తు ఆలోచనలో ఇటు కేసీఆర్, అటు జగన్ ఉండటంతో ఇప్పటి నుంచి ప్రజల్లో ఉంటే ఎన్నికల నాటికి తెలంగాణలో తన పార్టీని బలోపేతం చేయవచ్చనే ఆలోచనలో కేఏ పాల్ ఉన్నారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది అన్నట్లుగా ఇంత ముందు నుంచే పాదయాత్ర చేయాలన్న కేఏ పాల్ అలోచన కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నప్పటికి టీఆర్ఎస్ ప్రభుత్వం అందుకు పర్మిషన్ ఇస్తుందో లేదో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.