హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR| Telangana Politics: హైదరాబాద్​కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.. నేటి సాయంత్రం సీఎం కేసీఆర్​తో భేటీ.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ..

CM KCR| Telangana Politics: హైదరాబాద్​కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.. నేటి సాయంత్రం సీఎం కేసీఆర్​తో భేటీ.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ..

సీఎం కేసీఆర్​తో హేమంత్​ సోరెన్​ (ఫైల్​)

సీఎం కేసీఆర్​తో హేమంత్​ సోరెన్​ (ఫైల్​)

టీఆర్ఎస్ ప్లీనరీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్జా తీయ రాజకీయాలు, ప్రత్యామ్నాయ ఎజెండా గురించి ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తో భేటీ అవనున్నారు.

  కొంతకాలంగా దేశంలోని పలు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు, పార్టీలను కలిసి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక గురించి కేసీఆర్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమికి కేసీఆర్ (KCR) శ్రీకారం చూడతారని అంతా భావించారు. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పైచేయి సాధించడంతో కేసీఆర్ ఆశలు, ప్రయత్నాలు ఫలించలేదనే వాదన మొదలైంది. అయితే  జాతీయ రాజకీయాలు, ప్రత్యామ్నాయ ఎజెండా గురించి టీఆర్ఎస్ ప్లీనరీలో తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్  (Jharkhand CM Hemant Soren) తో భేటీ అవనున్నారు. ప్రత్యేక విమానంలో రాంచీ నుంచి హైదరాబాద్​  (Hyderabad)​ నగరానికి చేరుకున్న హేమంత్ సోరేన్ మధ్యాహ్నం కొద్దిమంది సన్నిహితులతో, పార్టీల ప్రముఖులతో ప్రైవేటు హోటల్లో సమావేశం (Meeting) కానున్నారు.

  నేడు సీఎం కేసీఆర్ (CM KCR)​ నల్లగొండ జిల్లా నకిరేకల్ పర్యటనకు వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్​లోని ప్రగతిభవన్​కు చేరుకోనున్నారు. సాయంత్రం ఏడు గంటలకు ప్రగతి భవన్లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్తో  కేసీఆర్​ సమావేశం కానున్నట్లు తెలిసింది. హేమంత్ సోరేన్ ప్రగతిభవన్లోనే డిన్నర్ ముగించుకుని రాత్రికి ప్రైవేటు హోటల్లో బస చేసి శుక్రవారం ఉదయం రాంచీకి తిరుగు ప్రయాణం కానున్నారు.

  ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి..

  అయితే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore)​తో రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించిన కేసీఆర్.. ఇప్పుడు హేమంత్ సోరేన్తో భేటీ కానుండడం విశేషం. హేమంత్ సోరేన్ గతంలోనూ భేటీ అయిన కేసీఆర్ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఆవిర్భావం కావాల్సిన అవసరం గురించి చర్చించారు.

  కుటుంబాలకు పరిహారం..

  మార్చిలో వారం పాటు ఢిల్లీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ (Hyderabad)​కు తిరుగు ప్రయాణమైన సీఎం కేసీఆర్ మార్గమధ్యలో రాంచీకి వెళ్లి సీఎం హేమంత్ సోరేన్, రాజకీయ కురువృద్ధుడు శిబూ సోరేన్ తో మంతనాలు జరిపారు. ఈ భేటీలో ఎంపీలు, ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొన్నారు. 2020లో మే నెలలో చైనా (china) సైన్యానికి భారత సైనికులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో మరణించిన వారిలో బిహార్‌కు చెందిన వారు ఐదుగురు, పంజాబ్ నుంచి నలుగురు, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అయితే ఈ దాడిలో మృతిచెందిన కుటుంబాలకు పరిహారం అందించారు కేసీఆర్​. అంతేకాకుండా జాతీయ రాజకీయాలపై కూడా చర్చలు జరిపారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, మారాల్సిన పరిస్థితులు, చొరవ తీసుకోవాల్సిన ఆవశ్యకత తదితర పలు అంశాలపై చర్చించారు.

  అప్పటి పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తినా, కొత్త పార్టీయా లేక కొన్ని ప్రాంతీయ పార్టీలతో కూటమిగా ఉంటుందా ఇంకా స్పష్టతకు రాలేదని, కాలమే దాన్ని నిర్ణయిస్తుందని వివరించారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, Hyderabad, Jarkhand

  ఉత్తమ కథలు