హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Congress: రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కపై జగ్గారెడ్డి అసంతృప్తి..టీ కాంగ్రెస్ జూమ్ మీటింగ్ కు సంగారెడ్డి ఎమ్మెల్యే డుమ్మా

Telangana Congress: రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కపై జగ్గారెడ్డి అసంతృప్తి..టీ కాంగ్రెస్ జూమ్ మీటింగ్ కు సంగారెడ్డి ఎమ్మెల్యే డుమ్మా

PC: Twitter

PC: Twitter

నేడు జరిగిన టీ కాంగ్రెస్ జూమ్ మీటింగ్ కు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డుమ్మా కొట్టారు. ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవేళ మర్రి శశిధర్ రెడ్డి పార్టీ వీడడానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కే వహించాలని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జావేద్ ఆరా తీశారు. ఇదిలా ఉంటే నేడు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసింది. దీనిపై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ అని, కంపెనీ కాదని అసహనం వ్యక్తం చేశారు. జూమ్ మీటింగ్ నిర్వహించడం ఏంటి. ఇది కరెక్ట్ కాదని జగ్గారెడ్డి అన్నారు. వారానికి ఒకసారి సమావేశం నిర్వహించాలని కానీ ఇలా జూమ్ మీటింగ్ నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. కాగా జగ్గారెడ్డి ఈ జూమ్ మీటింగ్ కు హాజరు కాలేదని తెలుస్తుంది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

నేడు జరిగిన టీ కాంగ్రెస్ జూమ్ మీటింగ్ కు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) డుమ్మా కొట్టారు. కాగా ఈ ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revant Reddy)పై జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవేళ మర్రి శశిధర్ రెడ్డి (marri Shasidhar Reddy) పార్టీ వీడడానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి (Revant Reddy), భట్టి విక్రమార్కే (Bhatti Vikramarka)  వహించాలని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జావేద్ ఆరా తీశారు. ఇదిలా ఉంటే నేడు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసింది. దీనిపై జగ్గారెడ్డి  (Jaggareddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ అని, కంపెనీ కాదని అసహనం వ్యక్తం చేశారు. జూమ్ మీటింగ్ నిర్వహించడం ఏంటి. ఇది కరెక్ట్ కాదని జగ్గారెడ్డి  (Jaggareddy) అన్నారు. వారానికి ఒకసారి సమావేశం నిర్వహించాలని కానీ ఇలా జూమ్ మీటింగ్ నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. కాగా జగ్గారెడ్డి  (Jaggareddy) ఈ జూమ్ మీటింగ్ కు హాజరు కాలేదని తెలుస్తుంది.

ఇది చదవండి: ఈ బిర్యానీకి 40ఏళ్ల హిస్టరీ.. రూ.5తో మొదలై ఇప్పుడు ఇలా..!

జూమ్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు..

నేడు నిర్వహించిన జూమ్ మీటింగ్లో భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), ఉత్తమ్ కుమార్ రెడ్డి (uttam kumar Reddy) సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. రేపటి నుంచి డిసెంబర్ (Decembar) 5 వరకు మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో నిరసనకు పిలుపునివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన తేదీలను ఖరారు చేశారు.

Karimnagar: పార్టీ మీటింగ్ లో కన్నీళ్లు పెట్టుకున్న కరీంనగర్ జడ్పి చైర్ పర్సన్..ఓదార్చిన మంత్రి గంగుల కమలాకర్

రైతుల కోసం కాంగ్రెస్  పోరాటం..కార్యాచరణ ఇదే..

కాగా రైతుల కోసం పోరాటం చేయడానికి కార్యాచరణను జూమ్ మీటింగ్ లో ప్రకటించారు. దీని ప్రకారం ఈనెల 24న అన్ని మండల కేంద్రాల్లో, 30న అన్ని నియోజవర్గాల్లో, డిసెంబర్ 5న కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ లో విభేదాలు సర్వసాధారణమే..

విభేదాలు అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే విభేదాలు అన్నట్టు సీన్ మారిపోయింది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకం తరువాత సీనియర్లు ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. అడపా దడపా బహిరంగంగానే రేవంత్ పై అసంతృప్తి వెళ్లగక్కారు. ఇక మర్రి శశిధర్ రెడ్డి కూడా రేవంత్ తీరును తప్పుబట్టారు. కాంగ్రెస్ లోనే ఉండాలనుకున్నాను కానీ తప్పట్లేదని పెద్ద బాంబే పేల్చారు. మరి రానున్న రోజుల్లో ఇంకెంత మంది పార్టీని వీడుతారు అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.

First published:

Tags: Bhatti Vikramarka, Congress, Jaggareddy, Revanth Reddy, Telangana, TS Congress

ఉత్తమ కథలు