హోమ్ /వార్తలు /తెలంగాణ /

RaGa Visit: ప్రశాంత్ కిషోర్ పీడను టీకాంగ్రెస్ వదిలించుకుందా? -సునీల్ కనుగోలు ఖాతాలో తొలి విజయం!

RaGa Visit: ప్రశాంత్ కిషోర్ పీడను టీకాంగ్రెస్ వదిలించుకుందా? -సునీల్ కనుగోలు ఖాతాలో తొలి విజయం!

రాహుల్, ప్రశాంత్ కిషోర్, సునీల్ కనుగోలు, రేవంత్ రెడ్డి

రాహుల్, ప్రశాంత్ కిషోర్, సునీల్ కనుగోలు, రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్ తో పొత్తు ఉండబోదని స్పష్టం చేయడం ద్వారా ప్రశాంత్ కిషోర్ రూపంలో టీకాంగ్రెస్ ను వేధిస్తోన్న పీడను రాహుల్ గాంధీ విరగడ చేశారనీ నేతలు చెబుతున్నారు. వ్యూహకర్త సునీల్ కనుగోలుకు దక్కిన తొలి విజయంగానూ వరంగల్ సభను అభివర్ణిస్తున్నారు..

ఇంకా చదవండి ...

అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన విజయవంతమైందని ఆ పార్టీ వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. వరంగల్ వేదికగా శుక్రవారం నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు కనీసం 2.5లక్షల మంది హాజరైనట్లు నేతులు చెబుతున్నారు. చిన్న గ్రౌడ్ కావడం, గడువు తర్వాత వరంగల్ సిటీలోకి వచ్చే వాహనాలను పోలీసులు అనుమతించని కారణంగా సభికుల సంఖ్య తగ్గిందని వాదిస్తున్నారు. అన్నిటికి మించి రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం సూటిగా, స్పష్టంగా ఉందని కాంగ్రెస్ నేతలతోపాటు సాధారణ ప్రజలు సైతం అభిప్రాయపడుతున్నారు. టీఆర్ఎస్ నేతల విమర్శలు పక్కనపెడితే, సోషల్ మీడియాలోనూ రాహుల్ సభ, స్పీచ్ పై దాదాపు పాజిటివ్ స్పందన కనిపించింది. టీఆర్ఎస్ తో పొత్తు ఉండబోదని కఠినంగా స్పష్టం చేయడం ద్వారా ప్రశాంత్ కిషోర్ రూపంలో టీకాంగ్రెస్ ను వేధిస్తోన్న పీడను రాహుల్ గాంధీ విరగడ చేశారనీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రస్తుత ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుకు దక్కిన తొలి విజయంగానూ వరంగల్ సభను అభివర్ణిస్తున్నారు మరికొందరు..

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గత వారం సొంత కుంపటి పెట్టుకున్నప్పటికీ, అంతకు ముందు రోజువరకూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేయడం, అదే సమయంలో తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు వ్యూహకర్తగా పనిచేయడం, సీఎం కేసీఆర్ తో వరుస భేటీలు కావడం, ఆ పరిణామాలను టీఆర్ఎస్-కాంగ్రెస్ దోస్తీగా బీజేపీ, ఇతర పార్టీలు అనుమానించడం తెలిసిందే. తెలంగాణలో బీజేపీని నిలువరించడానికి టీఆర్ఎస్ అవసరమైతే కాంగ్రెస్ తోనూ పొత్తు పెట్టుకుంటుందని, ఈ మేరకు కేసీఆర్ సూచనలతో ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారని ఆ మధ్య వార్తలు గుప్పుమన్నాయి. సదరు వార్తలు స్థానికంగా టీఆర్ఎస్ పై పోరాడుతోన్న కాంగ్రెస్ నేతలకు శరాఘాతంలా మారాయి.

PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో పడే తేదీ ఇదే..


ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరినా టీఆర్ఎస్ కు వ్యూహకర్తగానే కొనసాగుతారనే వార్తయితే టీకాంగ్రెస్ లో తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సొంతగా పార్టీని ఏర్పాటు చేయబోతుండటం, అక్టోబర్ 2 నుంచి బీహార్ లో పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్-టీఆర్ఎస్ పొత్తు ప్రతిపాదనలపై ఊహాగానాలు ఆగలేదు. చివరికి వరంగల్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ సీరియస్ వార్నింగ్ తర్వాతగానీ పీకే రూపంలో టీకాంగ్రెస్ కు పట్టిన పొత్తుల పీడ విరగడ అయిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Shocking : కన్నకూతురిపైనే ఉపాధ్యాయుడి అఘాయిత్యం -అడ్డుచెప్పని తల్లి.. చివరికి వీడియోతో..

తెలంగాణకు ద్రోహం చేసిన కేసీఆర్ ను క్షమించబోము.. టీఆర్ఎస్ పార్టీతో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు ఉండదుకాగ ఉండదు.. ఒకవేళ టీఆర్ఎస్ తో పొత్తు బాగుంటుందని ఎవరైనా భావిస్తే దయచేసి టీఆర్ఎస్ లేదా బీజేపీలోకి వెళ్లిపోవచ్చు.. ఎందుకంటే ఆ రెండు పార్టీలూ ఒకటిగానే పనిచేస్తున్నారు... కాంగ్రెస్ లోనూ ఉంటూ గులాబీ రాగం తీసేవాళ్లను వదిలిపెట్టం.. ఎంతటి స్థాయి నేతలైనా వేటు వేసేస్తాం.. అంటూ రాహుల్ గాంధీ బహిరంగ సభ ఉపన్యాసంలోనే కుండబద్దలు కొట్టారు. ఈ దెబ్బతో మరోసారి ప్రత్యర్థులెవరూ ‘పీకే ద్వారా టీఆర్ఎస్-కాంగ్రెస్ దోస్తీ’తరహా ఆరోపణలు చేయడానికి సాహసించబోరని టీకాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇక

Bangkok: భార్య శవంతో 21 ఏళ్లు ఇంట్లోనే.. మాది మామూలు ప్రేమ కాదంటోన్న ముసలి డాక్టర్.. చివరికి ఇలా..


వరంగల్ లో రాహుల్ గాంధీ పాల్గొన్న రైతు సంఘర్షణ సభలో టీ కాంగ్రెస్ ప్రకటించిన ‘వరంగల్ డిక్లరేషన్’పై తెలంగాణ సమాజంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. రైతులకు ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ, కౌలు రైతులకూ ఏటా రూ.15000 ఆర్థిక సాయం, భూమిలేని రైతు కూలీలకూ ఏటా రూ.12000 గ్యారంటీ నగదు బదిలీ, పోడు భూములు, అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు, ధరణి పోర్టల్ ఎత్తేసి కొత్త రెవెన్యూ వ్యవస్థ, నకిలీ విత్తనాలు, పురుగుమంతుల కట్టడి, వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం జోడింపు, షుగర్ ఫ్యాక్టరీల రీఓపెనింగ్, పసుబు బోర్డు ఏర్పాటు, రైతు కమిషన్ ఏర్పాటు, కొత్త వ్యవసాయ విధానం.. ఇలా వరంగల్ డిక్లరేషన్ లోని అంశాలు వేటికవే వినూత్నంగా ఉన్నాయనే అభిప్రాయం వెలువడుతోందని పార్టీ నేతలు చెబుతున్నారు. నిజానికి..

CM For Sale: అమ్మకానికి ముఖ్యమంత్రి పదవి.. ధర రూ.2500కోట్లు.. దేశరాజకీయాల్లో పెను సంచలనం..


తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధును కేంద్రం సైతం అడాప్ట్ చేసుకొని పీఎం కిసాన్ లాంటి పథకాలను రూపొందించింది. గత 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అఖండ మెజార్టీ తెచ్చిపెట్టింది కూడా రైతు బంధే అనే విశ్లేషణలున్నాయి. ఆ లెక్కన రైతుల విషయంలో టీఆర్ఎస్ ప్రత్యర్థులకు ఎన్నికల అంశాలే లేవనుకున్న చోట.. కాంగ్రెస్ అనూహ్యరీతిలో రైతు సమస్యలపై సంఘర్షణ సభ నిర్వహించడం, వరంగల్ డిక్లరేషన్ లో రైతు, వ్యవసాయ సంబంధిత కీలక అంశాలపై కొత్త కోణాలను చర్చలోకి తీసుకురావడంలో సఫలమైందనే వాదన వినిపిస్తోంది.

బిర్యానీలో కలిపి నగలు మింగేశాడు! -ఈద్ పార్టీ కోసం ఇంటికి పిలిస్తే ఇదీ మేనేజర్ ప్రియుడి నిర్వాకం..


రైతుల విషయంలో కేసీఆర్ ఎక్కడైతే ఫెయిలయ్యారో సరిగ్గా ఆ అంశాలనే గుర్తించి కాంగ్రెస్ తన వరంగల్ డిక్లరేషన్ రూపొందించినట్లు స్పష్టమవుతోంది. ఈ వ్యూహాత్మక ఎత్తుగడలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ముఖ్యనేతలతోపాటు కాంగ్రెస్ కొత్త వ్యూహకర్త సునీల్ కనుగోలు ప్రమేయం కూడా ప్రముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ శిశ్యుడైన సునీల్ కనుగోలు ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు వ్యూహకర్తగా సేవలందిస్తున్నారు. హైకమాండ్ తో పీకే చర్చలు చేస్తున్న సమయంలోనే సునీల్ ఏకంగా కాంగ్రెస్ పార్టీలోకి సాధారణ కార్యకర్తగా చేరిపోవడం తెలిసిందే. ప్రాజెక్టుల నిర్మాణం, రైతు బంధు లాంటి బలమైన వాదనను తట్టుకొని కాంగ్రెస్ తన ధోరణిలో రైతలు అంశంలో ప్రత్యామ్నాయ వాదనను తెరపైకి తీసుకురావడంతో సునీల్ కనుగోలు వ్యూహాలు పనికొచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా వరంగల్ సభ ద్వారా పీకే పీడ విరగడైందని, సునీల్ కనుగోలు రూపంలో కొత్త వ్యూహకర్త సత్తా చాటుకున్నారని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.

Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Congress, Farmers, Prashant kishor, Rahul Gandhi, Revanth Reddy, Telangana, Warangal

ఉత్తమ కథలు