హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Congress: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారా ?.. కాంగ్రెస్‌లో కీలక చర్చ

Telangana Congress: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారా ?.. కాంగ్రెస్‌లో కీలక చర్చ

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫోటో)

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Telangana Congress: ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీలో కొనసాగి.. తన పంతం నెగ్గించుకోవాలని అనుకుంటే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో విధంగా వ్యవహరించి ఉండేవారనే వాదన కూడా ఉంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కాంగ్రెస్‌కు షాకిచ్చేలా ఆ పార్టీకి గుడ్ బై చెప్పడంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మరోసారి బీజేపీ తరపున మునుగోడు బరిలో నిలిచి కాంగ్రెస్ (Congress) పార్టీకి కొత్త సవాల్ విసురుతున్నారు. ఇక కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy).. కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నప్పటికీ ఆ పార్టీకి సవాల్‌గా మారారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో రాజకీయ విభేదాల కారణంగా కొంతకాలంగా నుంచి ఆయనపై విమర్శలు చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఇప్పుడప్పుడే కూల్ అయ్యేలా కనిపించడం లేదు. తనను అవమానించేలా మాట్లాడిన నేతలను సస్పెండ్ చేయాలని, రేవంత్ రెడ్డి(Revanth Reddy), మాణిక్యం ఠాగూర్‌లను మార్చి.. వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డుమ్మా కొట్టారు.


  ప్రియాంక గాంధీ హాజరైన భేటీకి ఆయన దూరంగా ఉండటం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్‌లో సరికొత్త చర్చ మొదలైంది. కాంగ్రెస్‌ తీరుపై కొంతకాలంగా అసహనంగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. పార్టీ మారేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారేమో అనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీలో కొనసాగి.. తన పంతం నెగ్గించుకోవాలని అనుకుంటే.. ఆయన మరో విధంగా వ్యవహరించి ఉండేవారనే వాదన కూడా ఉంది.  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కావాలనుకుంటే సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ, రాహుల్ గాంధీ వంటి వారిని కలిసి తన సమస్యను చెప్పుకునే అవకాశం ఉందని.. కానీ అలా చేయకుండా వారు పాల్గొన్న సమావేశానికి కూడా దూరంగా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో ప్రియాంక గాంధీ తెలంగాణ నేతలతో సమావేశం ఏర్పాటు చేసిన సమయంలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ చేరుకోవడంతో.. ఆయన ఈ భేటీకి వెళ్లొద్దనే ఉద్దేశ్యంతో అలా చేశారనే చర్చ జరుగుతోంది.


  BJP|Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వేటు .. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ  Crime news : భర్త మర్డర్‌కి భార్యే స్కెచ్ .. 7సార్లు ప్రయత్నం చేసి సక్సైస్ అయింది ..ఎందుకు చేసిందంటే


  అయితే పార్టీ మారాలనే ఉద్దేశ్యం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి లేదని.. ఆయన తన అసహనాన్ని వెల్లడించేందుకే ఈ రకంగా వ్యవహరిస్తారనే వాదనను కూడా కొందరు వినిపిస్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఇతర నేతలు మాట్లాడాలని కాంగ్రెస్ హైకమాండ్ సూచించగా.. నేతలెవరూ తనను కలవొద్దని ఆయన బహిరంగంగా ప్రకటించడం విశేషం. దీంతో కాంగ్రెస్‌తో తనకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించుకోవడానికి బదులుగా పార్టీని ఇబ్బంది పెట్టేలా ఆయన వ్యవహరిస్తున్నారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Congress, Komatireddy venkat reddy, Telangana

  ఉత్తమ కథలు