హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR| BJP: ఆ విషయంలో కేసీఆర్ లెక్క తప్పిందా ?.. బీజేపీని తక్కువగా అంచనా వేశారా ?

KCR| BJP: ఆ విషయంలో కేసీఆర్ లెక్క తప్పిందా ?.. బీజేపీని తక్కువగా అంచనా వేశారా ?

నరేంద్రమోదీ, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

నరేంద్రమోదీ, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

రాజకీయాల్లో సమయాన్ని బట్టి తనదైన వ్యూహాలను అమలు చేసి విజయం సాధించే కేసీఆర్.. బీజేపీని ఢీ కొట్టేందుకు కూడా తగిన వ్యూహాలతో సరైన సమయంలో ముందుకు వస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వేడి చూస్తుంటే.. మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయా ? అనేలా పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణంగా బీజేపీ రాజకీయ దూకుడు అని వేరే చెప్పనవసరం లేదు. తెలంగాణలో కొద్దిరోజుల క్రితం కేసీఆర్ చేసిన రాజకీయ హడావిడితో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని చాలామంది అనుకున్నారు. బీజేపీ కూడా అదే రకమైన ఆలోచనలో ఉంటూ వచ్చింది. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ చోట్ల విజయం సాధించడంతో సీన్ మారిపోయింది. కేసీఆర్ (KCR) తన రాజకీయ దూకుడును తగ్గించారు. కానీ బీజేపీ మాత్రం టార్గెట్ తెలంగాణ (Telangana) విషయంలో మరింత దూకుడు పెంచింది. తమ తదుపరి లక్ష్యం తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే అన్నట్టుగా దూసుకుపోతోంది.

నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళతారని.. ఈ ఏడాది చివర్లో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బీజేపీ హైకమాండ్ భావించింది. గుజరాత్‌తో కాకపోయినా.. కర్ణాటకతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు కేసీఆర్ సిద్ధపడతారని అంచనా వేసింది. కేసీఆర్ ఏ రకమైన వ్యూహంతో ముందుకు వెళ్లినా.. ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాల్సిందే అన్నట్టుగా ఆ పార్టీ టార్గెట్ ఫిక్స్ చేసుకుంది.

అందుకు తగ్గట్టుగా చాలా నెలల ముందు నుంచే తెలంగాణపై తమ వ్యూహాలను అమలు చేస్తోంది. బీజేపీ (BJP) జాతీయ నేతలు తెలంగాణపై రాజకీయ దండయాత్ర మొదలుపెట్టారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ పైచేయి అన్నట్టుగా ఉండే కేసీఆర్ కాస్త వెనుకబడిపోయారా ? అనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది. ఓ వైపు బీజేపీ నేతలు తెలంగాణపై టార్గెట్ చేస్తుంటే.. కేసీఆర్ మాత్రం బీజేపీని జాతీయ స్థాయిలో టార్గెట్ చేసేందుకు ఇతర రాష్ట్రాలకు వెళుతూ అక్కడి నేతలను కలుస్తున్నారు. అయితే అవి ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయా ? లేదా అన్నది మాత్రం ఎవరికీ తెలియని పరిస్థితి.

Telangana BJP: మరో తెలంగాణ బీజేపీ నేతకు కీలక పదవి ?.. లక్ష్మణ్ తరువాత..

Telangana| BJP: మళ్లీ తెలంగాణలో బీజేపీ సందడి.. హైదరాబాద్‌లో కీలక సమావేశాలు.. రాజకీయ దండయాత్రేనా ?

అయితే రాజకీయాల్లో సమయాన్ని బట్టి తనదైన వ్యూహాలను అమలు చేసి విజయం సాధించే కేసీఆర్.. బీజేపీని ఢీ కొట్టేందుకు కూడా తగిన వ్యూహాలతో సరైన సమయంలో ముందుకు వస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బీజేపీకి ధీటుగా తాను కూడా రాజకీయ విమర్శలు చేస్తే.. తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరుగుతుందనే ఆలోచనలో ఉన్న కేసీఆర్.. సమయాన్ని బట్టి పొలిటికల్ హీట్ క్రియేట్ చేస్తారనే చర్చ సాగుతోంది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ దూకుడుకు కేసీఆర్ ఏ విధంగా కళ్లెం వేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

First published:

Tags: Amit Shah, Bjp, CM KCR, Pm modi, Telangana

ఉత్తమ కథలు