Home /News /telangana /

TS POLITICS IS SANGAREDDY MLA JAGGAREDDY GOING TO RESIGN FROM CONGRESS TOMORROW FULL DETAILS HERE PRV

Congress MLA Jaggaredddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం.. రేపు కాంగ్రెస్​కు రాజీనామా?

జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేపు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది. పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

    తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి (Sangareddy MLA Jaggareddy) వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గతంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి రాజీనామా చేస్తానంటూ ఏకంగా సోనియా గాంధీకే లేఖ రాసిన జగ్గారెడ్డి.. అందులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy)పై అసాధారణ ఆరోపణలు గుప్పించారు. అయితే అప్పట్లో ఢిల్లీకి వెళ్లి మరీ రాహుల్​ గాంధీ (rahul gandhi)తో చర్చల అనంతరం ఇక రేవంత్​ను బహిరంగంగా విమర్శించబోనని హామీ ఇచ్చి మరీ వచ్చారు. అయితే తాజాగా  ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి రేవంత్​పై నోరు జారారు. దీంతో  జగ్గారెడ్డి రేపు  (Tomorrow)సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది. అయితే సోమవారం ఏ నిర్ణయం వెల్లడిస్తారో చెప్పకపోయినప్పటికీ ఇక కాంగ్రెస్​లో ఇమడలేక బయటికి వెళ్లిపోతారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా (Resign to congress party) చేసి నియోజక వర్గ పరిధికి అంకితమవుతారని పలువురు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్​ సీనియర్ లీడర్​ రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట తప్పాననే కారణంతో జగ్గారెడ్డి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. రేవంత్​ రెడ్డి చర్యల వల్లే ఇదంతా జరుగుతోందని ఆయన ఆరోపించారు.

    అసలేం జరిగింది?

    విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా (yashwant sinha) హైదరాబాద్ టూర్ తెలంగాణ కాంగ్రెస్‌లో రచ్చకు కారణమైంది. ఆయనతో సమావేశమయ్యే విషయంలో టీ కాంగ్రెస్‌లో విభేదాలు వెలుగుచూశాయి. జాతీయ స్థాయిలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు ఇతర ప్రతిపక్ష పార్టీలతో సహా కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు మద్దతు పలికాయి.



    రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వస్తున్న యశ్వంత్ సిన్హాకు భేటీపై టీ కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే పీసీపీ మాత్రం యశ్వంత్ సిన్హాతో భేటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. అవసరమైతే ఢిల్లీ వెళ్లి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలపాలని టీపీసీసీ తెలిపింది.

    పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు సిన్హాకు మద్దతిస్తారని, అయితే టీఆర్‌ఎస్‌ నేతలతో ముందుగా భేటీ అవుతున్నందున హైదరాబాద్‌లో ఆయనను కలవబోమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గురువారం ప్రకటించారు. అయితే శనివారం హైదరాబాద్‌కు వచ్చిన యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు బేగంపేట ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యశ్వంత్ సిన్హాను కలవొద్దని పీసీసీ చీఫ్ ప్రకటించారని,  సిన్హాను సీఎల్పీకి ఆహ్వానించాల్సి ఉండాల్సిందనని అన్నారు. ఇందుకోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. అధిష్టానంతో మాట్లాడాల్సి ఉందన్నారు. భట్టి విక్రమార్క ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అయితే యశ్వంత్​ సిన్హాను కాంగ్రెస్​ నేతలు కలవడంతో టీపీసీసీ చీఫ్​ రేవంత్​కు ఆగ్రహం తెప్పించింది. బండకేసి కొడతానంటూ వ్యాఖ్యానించారు.

    పదవి నుంచి రేవంత్​ను తొలగించాల్సిందిగా..

    దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండకేసి కొడతానన్న రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డ జగ్గారెడ్డి .. మేమేమైనా పాలేర్లమా అంటూ ఫైరయ్యారు. టెంప్ట్ అయ్యే వాడివి పీసీసీ పోస్టుకు ఎలా అర్హుడయ్యావన్న జగ్గారెడ్డి .. పీసీసీ చీఫ్ పదవి నుంచి రేవంత్ ను తొలగించాల్సిందిగా హైకమాండ్ కు లేఖ రాస్తానన్నారు. నూటికి నూరు శాతం రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి లేకపోయినా పార్టీని నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. వీహెచ్ వయసు ఎక్కడ..? నీ వయసు ఎక్కడ అంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు. నువ్వు పోరగానివి.. బండకేసి ఎవర్ని కొడతావంటూ ఆయన ప్రశ్నించారు. పీసీసీ పోస్ట్ దిగి చూస్తే.. నీకేం విలువ వుంటుందని జగ్గారెడ్డి నిలదీశారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఇలా బహిరంగంగా టీపీసీసీ నేతను విమర్శించబోనని ఇదివరకే రాహుల్​గాంధీకి జగ్గారెడ్డి మాట ఇచ్చారు. ఇపుడు మాట తప్పడంతో రేపు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని జగ్గారెడ్డి ప్రకటించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Congress, Jaggareddy, Telangana Politics, TS Congress

    తదుపరి వార్తలు