హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rahul Gandhi: ఆ పని చేయకుండా రాహుల్ మాటకు విలువేది? -ఇంతకీ పార్టీలో ఆయన హోదా ఏంటి?

Rahul Gandhi: ఆ పని చేయకుండా రాహుల్ మాటకు విలువేది? -ఇంతకీ పార్టీలో ఆయన హోదా ఏంటి?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాహుల్ గాంధీ

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాహుల్ గాంధీ

ప్రస్తుతం ఎంపీగా, సీడబ్ల్యూసీ సభ్యుడిగా మాత్రమే ఉన్న రాహుల్ గాంధీ ఏ హోదాలో పార్టీ అంతర్గత సమావేశాల్లో ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు? తిరిగి అధ్యక్ష బాధ్యతలకు సమాయత్తం అయినట్లేనా? క్రమశిక్షణ విషయంలో మాటకు విలువ ఉంటుందా?

తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ముగిసింది. అంతర్గత ప్రజాస్వామ్యం, గ్రూపు తగాదాలకు కేరాఫ్ అయిన కాంగ్రెస్ పార్టీలో ఇకపై క్రమశిక్షణా చర్యలు కఠినంగా ఉంటాయని, పార్టీ గీత దాటితే ఎంతటివారినైనా ఉపేక్షించబోనంటూ తెలంగాణ నేతలకు చివరిగా వార్నింగ్ ఇచ్చి ఆయన శనివారం సాయత్రం ఢిల్లీకి తిరుగుపయనం అయ్యారు. తన 24 గంటల పర్యటనలో రాహుల్.. ప్రధానంగా పార్టీ నేతల మధ్య ఐక్యత, కట్టడికి తీవ్రంగా ప్రయత్నించారు. ఆ దిశగా సీరియస్ వార్నింగులు సైతం జారీ చేశారు. పక్క పార్టీల పాట పాడేవాళ్లను తామే వెళ్లగొడతామనీ హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ల పంపకాలపైనా కీలక సూచనలు చేశారు.

ప్రస్తుతానికి పార్టీ తరఫున (వయనాడ్) ఎంపీగా, అత్యున్నత నిర్ణాయక మండలి ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడ్లబ్ల్యూసీ)’ సభ్యుడుగా మాత్రమే కొనసాగుతోన్న రాహుల్ గాంధీ ఏ హోదాలో ఈ హెచ్చరికలు, సూచనలు చేశారు? అనే చర్చ నడుస్తుండగానే, అసలు వరంగల్ రైతు సంఘర్షణ సభకు ఏ హోదాలో ఆయన హాజరయ్యారు? అంటూ టీఆర్ఎస్ ఆరాలు తీస్తున్నది. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనతో రెండు అంశాలపై క్లారిటీ వస్తేగానీ ఆయన మాటకు విలువ ఏర్పడని స్థితి నెలకొంది. అవేంటంటే..

CM KCR రాజు కాదు.. నెహ్రూ నుంచి మీదే రాజరికం.. మమ్మీ ప్రెసిడెంట్.. నువ్వు డమ్మీ: రాహుల్‌పై KTR ఫైర్


కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు, పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటివ్ పార్టీ(సీఎల్పీ)లతోపాటు ఏఐసీసీ, దాని అనుబంధ కమిటీలకు చాలా అధికారాలుంటాయి. ఆ తర్వాత పీసీసీ చీఫ్‌లు తమ విచక్షణ మేరకు కొన్ని నిర్ణయాలు తీసకునే వెసులుబాటు ఉంటుంది. సీడబ్ల్యూసీ వ్యూహాత్మక విషయాల్లో తప్ప రోజువారీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. మిగతావాళ్లు ఎంతటి స్టార్లయినా పార్టీ నిబంధనలకు కట్టుబడి, హైకమాండ్ చెప్పింది వినాల్సిందే. మరి అలాంటి కాంగ్రెస్ లో ప్రస్తుతం ఏ ప్రత్యేక హోదాలేని రాహుల్ గాంధీ వరుసగా రాష్ట్రాలు పర్యటిస్తూ నేతలకు సూచనలు, హెచ్చరికలు చేస్తుండటం పార్టీ రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందా? రాదా? అనే చర్చ కూడా ఉంది. అవి ఉల్లంఘనలు కారాదంటే, వరుస పరిణామాలను బట్టి రాహుల్ గాంధీ మళ్లీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను తీసుకోబోతున్నట్లే లెక్క. ఆ నిర్ణయానికి రాకుండా రాహుల్ ఇలాంటి పర్యటనలు, అంతర్గత ఆదేశాలు చేయడంలో అర్థం లేదనే వాదన వినిపిస్తోంది.

RaGa Visit: ప్రశాంత్ కిషోర్ పీడను టీకాంగ్రెస్ వదిలించుకుందా? -సునీల్ కనుగోలు ఖాతాలో తొలి విజయం!


వారసత్వ పార్టీ అని బీజేపీ చేత పదే పదే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా రెండోసారీ ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ.. ఆ స్థానాన్ని గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తులతో భర్తీ చేసేందుకు విశ్వప్రయత్నం చేసినా తన వల్లకాలేదు. దాదాపు అన్ని రాష్ట్రాల పీసీసీలూ రాహుల్ గాంధీనే అధ్యక్షుడిగా ఉండాలంటూ తీర్మానాలు పంపినా ఆయన మమాత్రం మూడేళ్లుగా పదవికి దూరంగానే ఉంటున్నారు. సంక్షోభ స్థితిలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోలేని కాంగ్రెస్ మూడేళ్లుగా తాత్కాలిక అధినేత్రి సోనియా సారధ్యంలోనే సాగుతున్నది. ఇలాగైదే 2024 ఎన్నికల్లోనూ పరువుపోవడం తప్పదని గ్రహించిన నేతలు.. తిరిగి బాధ్యతలు స్వీకరించేలా రాహుల్ ను ఒప్పించేప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాల ఫలితమా? అన్నట్లుగా గడిచిన నాలుగు, ఐదు నెలలుగా రాహుల్ రీయాక్టివేట్ అయి, రాష్ట్రాల్లో కలియదిరుగుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు ఆయన దిశానిర్దేశం చేసిన తీరును బట్టి త్వరలో అధ్యక్ష భాధ్యతల స్వీకారానికి రాహుల్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో ముఖ్యమైన అంశం..

Shocking : కన్నకూతురిపైనే ఉపాధ్యాయుడి అఘాయిత్యం -అడ్డుచెప్పని తల్లి.. చివరికి వీడియోతో..


తెలంగాణ పర్యటనలో రాహుల్ గాంధీ పదే పదే నేతలకు వార్నింగ్ ఇచ్చిన మాట క్రమశిక్షణ. పార్టీ లైన్ తప్పితే లేదా పార్టీ ఆలోచనలకు విరుద్దంగా ఎవరు మాట్లాడినా వెంటనే వేటేస్తామని బహిరంగ సభ వేదిక నుంచే ఆయన స్పష్టం చేశారు. శనివారం గాంధీ భవన్ వేదికగా జరిగిన ముఖ్యనేతల భేటీలోనూ మరోసారి అవే హెచ్చరికలు చేశారు. మెరిట్, పనితీరు ఆధారంగానే టికెట్లు ఇస్తామని, నేతలెవరూ హైదరాబాద్ లో ఉండొద్దని, ప్రజల్లో తిరిగేది ఎవరో సర్వే చేశాకే టికెట్లిస్తామని రాహుల్ చెప్పారు. అంతర్గత విభేదాలు సహజమే అయినా అభిప్రాయ బేధాలను మీడియా ముందు వెళ్లగక్కడం మానుకోవాలని, ఒక వేళ ఎవరైనా కాంగ్రెస్ లో ఉంటూ పక్క పార్టీల రాగం పాడితే వారిపై వెంటనే వేటేస్తామనీ రాహుల్ హెచ్చరించారు. అయితే, రాహుల్ హెచ్చరిక సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వర్తిస్తుందా? లేదా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Liquor Sales: ఎండ దెబ్బకు చల్లగా బీర్లు గుద్దుడు.. 90శాతం పెరిగిన సేల్స్.. మద్యం తాజా లెక్కలివే..


ఒక ముఖ్యనేతతో అభిప్రాయ బేధాన్ని వెలిబుచ్చిన కారణంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకే చెందిన తుంగతుర్తి ఇంచార్జి అద్దంకి దయాకర్ పై టీపీసీసీ క్రమశిక్షణ చర్యలకు దిగింది. రేవంత్ పీసీసీ అయిన తర్వాత పార్టీ లైన్ క్రాస్ చేసిన కారణంగా చాలా మంది నేతలకు నోటీసులు జారీ అయ్యాయి. కానీ టీఆర్ఎస్ ను ఢీకొనే సత్తా కాంగ్రెస్ కు లేదని, ఆ సత్తా ఉన్న పార్టీలోనే చేరుతానని బాహాటంగా ప్రకటించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాత్రం పీసీసీ ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు. కోమటిరెడ్డి ధనవంతుడు, బడా కాంట్రాక్టర్, పేరున్న రాజకీయ కుటుంబానికి చెందిన చెందినవాడు కాబట్టే కాంగ్రెస్ చర్యలకు వెనుకాడుతోందనే విమర్శలున్నాయి. రాజగోపాల్ రెడ్డిని బహిష్కరిస్తే ఆయన సొదరుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అవమానించినట్లవుతుందని, అది పార్టీకి మరింత నష్టదాయకమనేవారూ లేకపోలేదు. అదీగాక సిట్టింగ్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటే ఏఐసీసీ ఆమోదం కావాల్సి ఉంటుంది. హైకమాండ్ లోని వ్యక్తిగా రాహుల్ గాంధీ తాజా హెచ్చరికల ప్రకారం కోమటిరెడ్డిపై వేటు తప్పని పరిస్థితి. కానీ రాహుల్ ఆ పని చేస్తారా? అన్నదే అసలు ప్రశ్న.

PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో పడే తేదీ ఇదే..


కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ పార్టీని, పార్టీ విధానాలను విమర్శించడమేకాదు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సభకూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డుమ్మా కొట్టారు. శాసనసభలో మినహా పార్టీతో ఆయన ఎక్కడా సంబంధాలు కొనసాగించడంలేదు. గాంధీభవన్‌కూ ఆయన చాలా కాలంగా రావడంలేదు. రాహుల్ గాంధీ తాజా పర్యటనలో చెప్పినవాటిని నిజంగా అనుసరిస్తే ఢిల్లీ వెళ్లిన వెంటనే కోమటిరెడ్డిపై వేటుకు రంగం సిద్ధం చేయాలి. కానీ రాహుల్ నిజంగా అంత సాహసానికి పూనుకోగలరా? శాసనసభలో సభ్యుల సంఖ్య, ఇతర కారణాల దృష్ట్యా ఇన్నాళ్లూ ఉపేక్షించిన కోమటిరెడ్డిని ఇప్పటికిప్పుడు పార్టీ నుంచి స్పెండ్ చేస్తారా? ఒక వేళ ఈ పని చేయకుంటే రాహుల్ సభలో, నేతలతో చెప్పిన మాటలకు విలువ ఉంటుందా? అన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది.

First published:

Tags: Congress, Komatireddy rajagopal reddy, Rahul Gandhi, Telangana

ఉత్తమ కథలు