హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ponguleti: బీజేపీలో చేరే విషయంలో పొంగులేటి డైలమా ?.. కారణం ఇదేనా ?

Ponguleti: బీజేపీలో చేరే విషయంలో పొంగులేటి డైలమా ?.. కారణం ఇదేనా ?

పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఫైల్ ఫోటో)

పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఫైల్ ఫోటో)

Khammam: బీజేపీ వైపు చూస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తమవైపు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ కూడా ప్రయత్నాలు చేస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. ఆయన బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. నిజానికి కొద్దిరోజుల క్రితమే ఆయన బీజేపీ ముఖ్యనేత, కేంద్రహోంమంత్రి అమిత్ షాను(Amit Shah) కలుస్తారని ప్రచారం సాగింది. కానీ ఎందుకో ఈ భేటీ వాయిదా పడింది. ఫిబ్రవరిలో పొంగులేటి బీజేపీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధమైన పొంగులేటి.. బీజేపీలో చేరే విషయంలో మాత్రం కచ్చితమైన నిర్ణయం తీసుకున్నారా ? లేదా ? అన్నది మాత్రం తెలియడం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు(BRS) యాంటీగా ఉన్న నేతలు ఎక్కువగా బీజేపీ వైపు చూస్తున్నారు. అందుకే పొంగులేటి కూడా అటు వైపు వెళతారని అంతా చర్చించుకుంటున్నారు.

అయితే ఖమ్మం జిల్లా రాజకీయాలు భిన్నమైన కావడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కమలం పార్టీలో చేరే విషయంలో పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ప్రాబల్యం ఎక్కువ. బీజేపీకి ఇక్కడ బలం లేదు. తెలంగాణలో బలం పుంజుుకుంటున్న బీజేపీ .. ఖమ్మం జిల్లాలో మాత్రం ఇంకా ఎదగడం లేదు. ఆ మాటకొస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కూడా ఎప్పుడూ ఆశించిన ఫలితాలు సాధించలేదు.

మిగతా జిల్లాల్లో మొత్తానికి మొత్తానికి స్వీప్ చేసిన చరిత్ర ఉన్న బీఆర్ఎస్.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక్క ఎమ్మెల్యే స్థానానికి మాత్రమే పరిమితమైంది. 2014, 2018 ఎన్నికల్లో ఇదే జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక్కడ మెరుగైన ఫలితాలు సాధించలేదు. ఈ కారణంగానే పొంగులేటి బీజేపీలో చేరే విషయంలో డైలమాలో పడిపోయారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ వైపు చూస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తమవైపు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ కూడా ప్రయత్నాలు చేస్తోంది.

Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆగని దొంగతనాలు.. వరస చోరీలు

Bhadradri Kothagudem: భద్రాచలానికి ప్రియాంక గాంధీ.. ఎందుకు వస్తున్నారంటే?

పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీప బంధువు ఒకరితో కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఈ మేరకు చర్చలు కూడా జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే బీజేపీలో చేరే విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి డైలమాలో ఉన్నారని చెబుతున్నారు. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా చెప్పుకునే పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. బీజేపీ, కాంగ్రెస్‌లో ఎటు వైపు వెళతారన్నది వచ్చే నెలలోనే తేలే అవకాశం ఉంది.

First published:

Tags: Ponguleti srinivas reddy, Telangana

ఉత్తమ కథలు