హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kodandaram: కోదండరామ్ సారూ ఎటూ తేల్చుకోలేకపోతున్నారా ? వాళ్లను కాదని.. వీళ్లకు వద్దని చెబుతున్నారా ?

Kodandaram: కోదండరామ్ సారూ ఎటూ తేల్చుకోలేకపోతున్నారా ? వాళ్లను కాదని.. వీళ్లకు వద్దని చెబుతున్నారా ?

కోదండరామ్ (ఫైల్ ఫోటో)

కోదండరామ్ (ఫైల్ ఫోటో)

Kodandaram: తెలంగాణ రాజకీయాల్లో ఇంకా తాము సొంతంగానే పోటీ చేయాలనే భావనతో ఉన్నట్టు కోదండరామ్ చెప్పడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఒకరితో ఒకరు పోటీ పడేందుకు సై అంటున్నాయి. వీరి మధ్య పోటీలో మరో పార్టీ పోటీలో ఉంటుందనేది సందేహమే అని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఈ మూడు పార్టీల మధ్య జరిగే పోటీలో ఎంఐఎం మినహా మరో పార్టీ నేరుగా వీటితో ఢీ కొట్టడం కష్టమే అనే చర్చ సాగుతోంది. పాత బస్తీ మినహా మిగతా ప్రాంతాల్లో ఎంఐఎం కూడా ఈ మూడు పార్టీల్లో ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వడమో లేక తటస్థంగా ఉండటమో చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం రాజకీయాల నుంచి అనుభవం ఉన్న టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌కు(Kodandaram) తెలియనిది కాదు.

అయితే తెలంగాణ రాజకీయాల్లో ఇంకా తాము సొంతంగానే పోటీ చేయాలనే భావనతో ఉన్నట్టు కోదండరామ్ చెప్పడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణలో(Telangana) ప్రజాస్వామ్య పాలన సాగడం లేదని కోదండరామ్ కేసీఆర్, టీఆర్ఎస్ తీరుపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తున్నారు. అయితే సొంతంగా రాజకీయ బలం లేని కోదండరామ్.. మరో పార్టీతో కలిసి ముందుకు సాగడమో లేక మరో పార్టీలో తన పార్టీని విలీనం చేసి రాజకీయ ప్రయాణం సాగించడమో చేయడం తప్ప ఆయనకు మరో ప్రత్యామ్నాయం లేదని పలువురు బాహాటంగానే చెబుతుంటారు.

అయితే కోదండరామ్ మాత్రం ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. ఆయన తన సొంత పార్టీ అయిన తెలంగాణ జనసమితిని బలోపేతం చేయడం కోసం పెద్దగా చర్యలు తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. ఆ పార్టీ తరపున కార్యకలాపాలు చేసి సందర్భాలు కూడా పెద్దగా లేవనే చెప్పాలి. అలాంటప్పుడు మరో పార్టీతో కలిసి పోరాటం చేసే విషయంలో కోదండరామ్ ఎందుకు వెనకాడుతున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. తమతో కలిసి పని చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలాసార్లు కోదండరామ్‌ను కోరారని పలువురు చెబుతుంటారు.

Eetala Rajender: ఢిల్లీలో ఈటల.. బీజేపీ ముఖ్య నేతలతో కీలక భేటీ.. బండి సంజయ్‌పై ఫిర్యాదుకేనా?

Konda Vishweshwar Reddy: కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరతారా ?.. ఆ కీలక నేత బుజ్జగిస్తున్నారా ?

ఇక టీజేఎస్‌ను ఆప్‌లో విలీనం చేయాలని ఆ పార్టీ కూడా కోరినట్టు గతంలో వార్తలు వచ్చాయి. అలా చేస్తే తెలంగాణలో ఆప్ పగ్గాలు కోదండరామ్‌కు ఇచ్చేందుకు కేజ్రీవాల్ అండ్ టీమ్ సుముఖంగానే ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఆప్ ఈ అంశాన్ని తమ వద్ద ప్రస్తావించిందనే విషయాన్ని కోదండరామ్ కూడా ఒప్పుకుంటున్నారు. అయితే దీనిపై మరింతగా చర్చలు జరగాల్సి ఉందని చెప్పుకొచ్చారు. అయితే రాజకీయాల్లో రాణించే విషయంలో కోదండరామ్ క్లారిటీతో ఇలా చేస్తున్నారా లేక కన్ఫ్యూజన్‌తో ఇలా చేస్తున్నారా ? అన్నది మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు.

First published:

Tags: Kodandaram, Telangana

ఉత్తమ కథలు