హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR-BRS: తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ వ్యూహమా ?

KCR-BRS: తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ వ్యూహమా ?

కేసీఆర్ (ఫైల్ ఫోటో)

కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR-BRS: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్‌తో ఆ 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ జోరుగా కొనసాగుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. సీఎం కేసీఆర్(CM KCR) ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తారా ? లేక ఈసారి అధికారం తమ సొంత చేసుకోవాలని భావిస్తున్న బీజేపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా ? అన్నది ఉత్కంఠగా మారింది. బీజేపీ(BJP) బలపడుతుండటంతో రాబోయే రోజుల్లో తెలంగాణలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ (BRS) తరపున వచ్చే ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇస్తామని గతంలో కేసీఆర్ నేతలకు చెప్పారు. అయితే పనితీరు మెరుగుపరుచుకోవాలని వారికి సూచించారు. దీంతో చాలామంది ఎమ్మెల్యేలు జనంలోకి ఎక్కువగా ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం ఉందని అన్నారు. కానీ పార్టీలో 25 మంది ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉందని అన్నారు. ఆ ఎమ్మెల్యేలను మారిస్తేనే బీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుందని.. లేదంటే 90 సీట్లకే పరిమితం అవుతుందని చెప్పుకొచ్చారు. తన సర్వే ఎప్పుడూ తప్పు కాలేదని ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్ తో ఆ 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ జోరుగా కొనసాగుతుంది. సాధారణంగా ఓ మంత్రి 25 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదని చెప్పడంతో.. ఇది ఆయన సొంత సర్వేనా లేక కేసీఆర్ అంతరంగం ఆయన నోటి నుంచి బయటకు వచ్చిందా ? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

Telangana: ఇంటర్ విద్యార్థులకు HCLలో ఐటీ ఉద్యోగం.. ఎంపిక, వేతనం వివరాలిలా..

Telangana: రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..మరో రూ.550.14 కోట్లు విడుదల..ఎందుకంటే?

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు హోరాహోరీగా ఉండే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో.. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ కేసీఆర్ జాగ్రత్తలు తీసుకునే అవకాశం లేకపోలేదని.. పనితీరు సరిగ్గా లేవని వారిని ఆయన ఈసారి పక్కనపెట్టొచ్చని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరి.. తన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు మర్మం ఏమిటో మంత్రి ఎర్రబెల్లి చెబుతారా ? లేక ఎమ్మెల్యేల్లో, నేతల్లో ఈ టెన్షన్ కొనసాగిస్తారా ? అన్నది చూడాలి.

First published:

Tags: CM KCR, Errabelli Dayakar Rao, Telangana

ఉత్తమ కథలు