Home /News /telangana /

TS POLITICS IS ETELA RAJENDAR GETTING SUCCEDED IN JOINING OF BJP FROM OTHER PARTIES AK

Etela Rajendar: ఆ విషయంలో ఈటల రాజేందర్ సక్సెస్ అవుతున్నారా ?.. ఆ రోజు చేరికలతో తేలిపోతుందా ?

ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

Etela Rajendar: క్షేత్రస్థాయిలోని నాయకులను బీజేపీలోకి తీసుకురావడం ద్వారా.. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయొచ్చని ఆలోచనలో ఈటల రాజేందర్ ఉన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే క్రమంలో బలం పుంజుకుంటున్నప్పటికీ.. చేరికలు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై ఆ పార్టీ హైకమాండ్ గట్టిగా దృష్టి పెట్టింది. ఇందుకోసం గతంలో ఉన్న కమిటీని రద్దు చేసి ఈటల రాజేందర్ (Etela Rajendar) కన్వీనర్‌గా ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో బీజేపీలోకి తెలంగాణలోని (Telangana) కీలక నేతలను తీసుకొచ్చే బాధ్యతను భుజాన వేసుకున్న ఈటల రాజేందర్.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) బీజేపీలో చేరుతున్న సందర్భంగా అమిత్ షా రాష్ట్రానికి రాబోతున్నారు. ఆ రోజు జరగబోయే సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు అనేక మంది ఇతర నేతలు కూడా బీజేపీలో చేరబోతున్నారు.

    వారిలో రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, దాసోజు శ్రవణ్ వంటి వాళ్లు ఉన్నారు. దీంతో వీరంతా ఈటల రాజేందర్ మంత్రాంగం వల్లే బీజేపీలో చేరుతున్నారా ? లేక ఇతర నేతల రాయబారాల కారణంగా కమలం పార్టీలోకి వస్తున్నారా ? అన్నది తేలాల్సి ఉంది. అయితే కేవలం ముఖ్యనేతలను పార్టీలోకి తీసుకురావడమే కాకుండా.. క్షేత్రస్థాయిలోని సర్పంచ్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీలను సైతం బీజేపీలోకి తీసుకురావాలని యోచనలో ఈటల రాజేందర్ ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన బీజేపీ నాయకత్వానికి కూడా చెప్పారని సమాచారం.



    క్షేత్రస్థాయిలోని నాయకులను బీజేపీలోకి తీసుకురావడం ద్వారా.. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయొచ్చని ఆలోచనలో ఈటల రాజేందర్ ఉన్నారు. ఓ వైపు కీలక నేతలను తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తూనే.. క్షేత్రస్థాయి నాయకులను కూడా పార్టీలోకి తీసుకురావడం ద్వారా అధికార పార్టీని దెబ్బకొట్టవచ్చనే భావనలో ఈటల రాజేందర్ ఉన్నట్టు సమాచారం. మరోవైపు అమిత్ షా రాష్ట్రానికి వచ్చిన తరువాత చేరికల గురించి ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందని.. దీన్ని బట్టి పార్టీలో ఈటల రాజేందర్‌కు మరింత ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు.

    BJP-TDP: మోదీ ముందు చంద్రబాబు అలాంటి ప్రతిపాదన ఉంచారా ? బీజేపీ ఒప్పుకుంటుందా ?

    Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయంటే..

    ప్రస్తుతానికి టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు లేకపోయినా.. భవిష్యత్తులో అక్కడి నుంచి భారీగా చేరికలు ఉంటాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈటల రాజేందర్ ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు బీజేపీలో ఎంతమంది చేరతారు ? వారిలో ఈటల రాజేందర్ ద్వారా ఎంతమంది పార్టీలోకి వచ్చారనే అంశం కీలకంగా మారబోతోందని తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, Etela rajender, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు