హోమ్ /వార్తలు /తెలంగాణ /

Congress| Munugodu: మునుగోడుపై కాంగ్రెస్‌లో క్లారిటీ.. ఆ ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ ?

Congress| Munugodu: మునుగోడుపై కాంగ్రెస్‌లో క్లారిటీ.. ఆ ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ ?

రేవంత్ రెడ్డి​, మునుగోడు (ఫైల్​)

రేవంత్ రెడ్డి​, మునుగోడు (ఫైల్​)

Telangana News: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాననే నమ్మకంతో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మునుగోడు ఉప ఎన్నిక అత్యంత కీలకం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ కాంగ్రెస్‌కు మునుగోడు(Munugodu) ఉప ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకం. ఇక్కడ గెలవడమో లేక పోరాటపటిమ చూపించడమో చేయలేకపోతే.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పుట్టిమునగడం ఖాయమని ఆ పార్టీ ఓ అభిప్రాయానికి వచ్చింది. అందుకే ఇక్కడ మెరుగైన ఫలితాలు సాధించడం ఎలా అనే అంశంపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్.. అన్ని అంశాలపై జాగ్రత్తగా ముందుకు సాగాలని భావిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ సైతం.. రాష్ట్ర పార్టీ నేతలకు ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్(Congress) పార్టీని అధికారంలోకి తీసుకొస్తాననే నమ్మకంతో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి(Revanth Reddy) మునుగోడు ఉప ఎన్నిక అత్యంత కీలకం. అందుకే ఈ ఉప ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు సాధించేందుకు ఆయన తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. పార్టీలో తనకు నమ్మకంగా ఉండే నేతలకు మండలాల వారీగా ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు రేవంత్ రెడ్డి.


  ఇక ఇక్కడ పార్టీ అభ్యర్థి ఎవరనే దానిపై కూడా ఆ పార్టీలో ఓ క్లారిటీ వస్తున్నట్టు తెలుస్తోంది. మునుగోడులో పోటీ చేసేందుకు కాంగ్రెస్ తరపున దాదాపు ఐదు మంది పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తోంది. తాజాగా ఈ జాబితాను వడపోత కార్యక్రమం పూర్తయ్యిందనే చర్చ సాగుతోంది. మొత్తం ఐదుగురు పేర్లను పరిశీలించి.. అధిష్టానం పరిశీలన కోసం ఇద్దరి పేర్లను రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఖరారు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి, పల్లె రవి ఉన్నట్టు సమాచారం.  అయితే ఈ జాబితాలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి పేరు లేదనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఓ ఆడియోలో ఆమె రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలే.. ఆమె పేరును పరిశీలనలోకి తీసుకోకపోవడానికి కారణమనే చర్చ జరుగుతోంది. ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ ఓసీ వర్గానికి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటే కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేసే అవకాశం ఉంటుందని.. అలా కాకుండా బీసీలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంటే పల్లె రవికి పోటీ చేసే అవకాశం రావొచ్చని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.


  MLA Raja Singh: సుప్రీంకోర్టు గడప తొక్కిన BJP ఎమ్మెల్యే రాజాసింగ్​.. పూర్తి వివరాలివే


  By elections: మునుగోడు ఉప ఎన్నికతో పాటు ఆ నియోజకవర్గానికీ ఉపఎన్నిక రానుందా..?


  మరోవైపు ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమైన ప్రియాంక గాంధీ.. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం.. రాష్ట్రస్థాయిలో సంప్రదింపుల ప్రక్రియను పూర్తి చేసి ఢిల్లీకి షార్ట్ లిస్టును పంపించిందని.. అందులో ఇద్దరి పేర్లను పొందుపర్చిందని ఊహాగానాలు మొదలయ్యాయి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Congress, Munugodu By Election

  ఉత్తమ కథలు