హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR: ఆ ఇద్దరు నేతలను కేసీఆర్ లైట్ తీసుకున్నారా ? క్లారిటీ వచ్చినట్టేనా ?

KCR: ఆ ఇద్దరు నేతలను కేసీఆర్ లైట్ తీసుకున్నారా ? క్లారిటీ వచ్చినట్టేనా ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

Khammam: టీఆర్ఎస్ నాయకత్వంపై చాలాకాలం నుంచి అసంతృప్తితో ఉన్న పొంగులేటి, తుమ్మలకు ఆ పార్టీ నాయకత్వం షాక్ ఇచ్చిందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

కేసీఆర్ రాజకీయాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆయన ఎప్పుడు ఎవరికీ ప్రాధాన్యత ఇస్తారో.. ఎవరికి చెక్ చెబుతారో ఊహించలేమని ఆయనకు సన్నిహితంగా ఉండే టీఆర్ఎస్ నేతలు చెబుతుంటారు. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు టీఆర్ఎస్ ముఖ్యనేతల విషయంలో కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి చాలామంది గులాబీ పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. ఇటీవల ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఖమ్మం జిల్లా నుంచి కొత్తగా రాజ్యసభకు ఎంపికైన బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర సహా ఇతర ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే ఈ కీలక సమావేశానికి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనుచరగణం ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, (Ponguleti Srinivas Reddy) మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageshwara) మాత్రం రాలేదు. వారిని ఈ సమావేశానికి ఆహ్వానించలేదు కాబట్టే ఆ ఇద్దరు ఈ భేటీకి దూరంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది.

ఒకవేళ అదే నిజమైతే.. వారి విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచన ఏ విధంగా ఉందనే దానిపై కూడా చర్చ సాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి, తుమ్మల ఇద్దరికీ భారీ అనుచరగణం ఉంది. జిల్లా రాజకీయాలను తమదైన రీతిలో ప్రభావితం చేయగల ఉన్న నేతలు ఈ ఇద్దరు. అలాంటి ఈ ఇద్దరు నేతల విషయంలో టీఆర్ఎస్ నాయకత్వం ఏం ఆలోచిస్తుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. మరోవైపు కేసీఆర్ ఈ ఇద్దరు నేతలను పట్టించుకోవడం లేదని.. వీరిని దాదాపుగా పక్కనపెట్టారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

ఒకవేళ వీరిద్దరికి పార్టీలో ప్రాధాన్యత ఉంటే.. కీలకమైన ఈ సమావేశానికి ఇద్దరు నేతలకు కచ్చితంగా పిలిచేవారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై టీఆర్ఎస్ వర్గాలు పెద్దగా స్పందించలేదు. ఆ ఇద్దరు నేతలు ఎందుకు ఈ కీలక భేటీకి రాలేదనే అంశంపై చాలామంది నేతలకు కూడా క్లారిటీ లేదని తెలుస్తోంది.

Telangana| BJP: బీజేపీ సరికొత్త ప్లాన్.. ఒకే వ్యూహంతో కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు చెక్ ?

Tummala nageswara rao: టీఆర్​ఎస్​ మాజీ మంత్రి తుమ్మల మరోసారి సంచలన వ్యాఖ్యలు.. వారి పని మీరే చేయాలంటూ..

మరోవైపు ఇటీవల జరిగిన సమావేశం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో ఈ ఇద్దరు నేతలు ఏ రకమైన రాజకీయ నిర్ణయం తీసుకుంటారనే అంశంపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. వీరి భవిష్యత్ కార్యాచరణను బట్టి.. టీఆర్ఎస్ పార్టీ వీరి విషయంలో ఏ రకమైన వైఖరితో ఉందనే విషయంలో స్పష్టత వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ నాయకత్వంపై చాలాకాలం నుంచి అసంతృప్తితో ఉన్న పొంగులేటి, తుమ్మలకు ఆ పార్టీ నాయకత్వం షాక్ ఇచ్చిందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

First published:

Tags: CM KCR, Ponguleti srinivas reddy, Telangana, Trs, Tummala nageshwara rao

ఉత్తమ కథలు