హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR| Prashant Kishore: కేసీఆర్ ప్రత్యామ్నాయ ఎజెండా.. ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ.. ఈ రెండూ ఒకటేనా ?

KCR| Prashant Kishore: కేసీఆర్ ప్రత్యామ్నాయ ఎజెండా.. ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ.. ఈ రెండూ ఒకటేనా ?

ప్రశాంత్ కిశోర్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

ప్రశాంత్ కిశోర్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR| Prashant Kishore: జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో కలిసి పని చేయాలని భావిస్తున్న కేసీఆర్.. అదే ఆలోచనతో ఉన్న ప్రశాంత్ కిశోర్‌తో కలిసి పని చేసే ఆలోచనతో ఉన్నారా ? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

  రాజకీయాల్లో కొన్ని అంశాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు తప్ప వాటి గురించి ఎవరికీ అర్థంకాదు. తాజాగా దేశంలోని కొత్త రాజకీయ సమీకరణానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కొద్దిరోజుల క్రితం టీఆర్ఎస్ ప్లీనరీలో చేసిన వ్యాఖ్యలకు ఏమైనా సంబంధం ఉందా ? అనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది. కొన్నేళ్లుగా జాతీయ రాజకీయాల్లో తన మార్కు చూపించాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అందుకు సరైన వేదిక, సందర్భం కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో కాంగ్రెస్, బీజేయేతర పార్టీలతో కూటమిగా ముందుకు సాగాలని అనుకున్న కేసీఆర్.. ఇటీవల ప్లీనరీలో మాత్రం ఇందుకు కాస్త భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి కాదని.. ప్రత్యామ్నాయ ఎజెండా అని వ్యాఖ్యానించారు.

  ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాతో సీఎం కేసీఆర్ ఏ రకంగా జాతీయ రాజకీయాల్లో రాణిస్తారనే అంశంపై క్లారిటీ లేదు. అయితే తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) తన సొంత పొలిటికల్ ఇన్నింగ్స్‌పై చేసిన ప్రకటన రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీ ఏర్పాటును ఖరారు చేస్తూ పీకే సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. జన్ సురాజ్ (సుపరిపాలన) ధ్యేయంగా జనంలోకే వెళుతున్నట్లు తెలిపారు. సొంత రాష్ట్రం బీహార్ (Bihar) నుంచే తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నట్లు వెల్లడించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించిన పీకే.. ఆ దిశగా కాంగ్రెస్ హైకమాండ్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు.

  అయితే తాను ఆశించినట్లు జరక్కపోవడంతో కాంగ్రెస్‌లో (Congress) చేరిక అంశాన్ని పక్కనపెట్టేశారు. తాజాగా సొంత ప్రయాణం మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటన చేశారు. పొలిటికల్ రీ-ఎంట్రీని ఖరారు చేసినప్పటికీ పార్టీ స్వరూపం ఎలా ఉంటుంది? వేదికకు ఏ పేరు పెడతారు? విధి విధానాలు, జెండా రంగులు తదితర అంశాలను పీకే త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. అయితే ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన.. తాజాగా పీకే చేసిన ప్రకటన ఒకే విధంగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

  KCR| Telangana: అంతుచిక్కని కేసీఆర్ కొత్త ప్లాన్.. అలాంటి ఆలోచనతో ఉన్నారా ?

  Revanth Reddy: ఆ నేతతో రేవంత్ రెడ్డి రహస్య చర్చలు.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త చర్చ

  జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో కలిసి పని చేయాలని భావిస్తున్న కేసీఆర్.. అదే ఆలోచనతో ఉన్న ప్రశాంత్ కిశోర్‌తో కలిసి పని చేసే ఆలోచనతో ఉన్నారా ? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. కేసీఆర్, ప్రశాంత్ కిశోర్ మధ్య ప్రస్తుతం స్నేహం కూడా ఉండటంతో.. ఈ ఇద్దరూ కలిసి పని చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Prashant kishor

  ఉత్తమ కథలు