హోమ్ /వార్తలు /తెలంగాణ /

BJP| Raghunandan Rao: తెలంగాణ బీజేపీలో రఘునందన్ ఒంటరి పోరాటం చేస్తున్నారా ?

BJP| Raghunandan Rao: తెలంగాణ బీజేపీలో రఘునందన్ ఒంటరి పోరాటం చేస్తున్నారా ?

రఘునందన్ రావు (ఫొటో: ట్విట్టర్)

రఘునందన్ రావు (ఫొటో: ట్విట్టర్)

Raghunandan Rao: తాను చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని ఆయన వాదించుకుంటున్నా.. ఈ విషయంలో ఆయనకు బీజేపీ నుంచి పెద్దగా మద్దతు రావడం లేదనే ప్రచారం సాగుతోంది.

  జూబ్లీ హిల్స్‌ మైనర్ బాలిక అత్యాచారం కేసులో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంతో తెలంగాణ బీజేపీ బాగానే సక్సెస్ అయ్యింది. ఈ కేసు విషయంలో ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదని.. తాము ఆందోళన చేపట్టిన తరువాత తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుందని తెలంగాణ(Telangana) బీజేపీ ప్రకటిస్తోంది. బీజేపీ(BJP) సహా విపక్షాల నుంచి ఒత్తిడి పెరిగిన తరువాతే ఈ కేసు విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందనే వాదన కూడా ఉంది. ఇక ఈ కేసుకు సంబంధించిన బాధితురాలికి సంబంధించి పలు ఫోటోలను ప్రదర్శించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(BJP MLA Raghunandan Rao). ఆ ఫోటోల్లో ఎక్కడా బాధితురాలి ఫోటో క్లారిటీగా కనిపించకపోయినా.. ఆమె వివరాలు ఆయన ఎక్కడా ప్రస్తావించకపోయినా.. ఈ విషయంలో రఘునందర్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  దీనిపై తాను న్యాయపరంగా పోరాడతానని రఘునందన్ రావు చెబుతున్నారు. నిందితులను పట్టుకోమని చెబితే.. తనపై కేసులు పెట్టి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంలో రఘునందన్ రావు బీజేపీలో ఒంటరి పోరాటం చేస్తున్నారా ? అనే చర్చ జరుగుతోంది. నిజానికి ఈ కేసు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అనేక మార్గాలు ఉన్నప్పటికీ.. రఘునందన్ రావు అనవసరంగా బాధితురాలి ఫోటోలను ప్రదర్శించి లేనిపోని వివాదాలను కొనితెచ్చుకున్నారనే వాదన ఉంది.

  తాను చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని ఆయన వాదించుకుంటున్నా.. ఈ విషయంలో ఆయనకు బీజేపీ నుంచి పెద్దగా మద్దతు రావడం లేదనే ప్రచారం సాగుతోంది. నిజానికి అనుభవం ఉన్న లాయర్‌గా ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని రఘునందన్ రావు భావించి ఉండొచ్చని.. అందుకే ఆయన ఈ రకంగా వ్యవహరించి ఉండొచ్చని కొందరు చర్చించుకుంటున్నారు.

  Warangal Lassi: వరంగల్ నగరానికే ల్యాండ్ మార్క్ 'కూల్ అండ్ కూల్ లస్సి'.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే వదిలిపెట్టరు

  Telangana: మంత్రుల ముందే కరెన్సీ నోట్లు విసిరాడు .. మెదక్‌ జిల్లాలో టీఆర్‌ఎస్ నేత ఆనందం

  అయితే రాజకీయంగా ఇది పార్టీకి మైనస్‌గా మారుతుందని బీజేపీ భావించి ఉండొచ్చని.. ఈ విషయంలో ఆయనకు మద్దతుగా నిలవడం వల్ల కేసు కూడా పక్కదారి పడుతుందేమో అని బీజేపీ భావిస్తుందేమో అని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే రఘునందన్ రావు మాత్రం ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనపై కేసు పెట్టిన విషయంలో ప్రభుత్వం తీరును తప్పుబడుతూనే.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు ఎప్పటికప్పుడు సరికొత్తగా విమర్శలు చేస్తున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Bjp, Raghunandan rao, Telangana

  ఉత్తమ కథలు