హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bandi Sanjay: బండి సంజయ్‌కే అమిత్ షా సపోర్ట్.. మహేశ్వరం సభలో తేల్చేశారా ?.. ఆ వ్యాఖ్యలకు అర్థం అదేనా ?

Bandi Sanjay: బండి సంజయ్‌కే అమిత్ షా సపోర్ట్.. మహేశ్వరం సభలో తేల్చేశారా ?.. ఆ వ్యాఖ్యలకు అర్థం అదేనా ?

అమిత్ షా, మోదీ, బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

అమిత్ షా, మోదీ, బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

Bandi Sanjay: నిజానికి తెలంగాణ బీజేపీ పగ్గాలు బండి సంజయ్ చేతికి వచ్చిన తరువాతే రాష్ట్రంలో బీజేపీ బలపడటం మొదలైంది.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కూడా నిర్వహించారు. తాజాగా ఆయన పాదయాత్ర ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి, బీజేపీ ముఖ్యనేత అమిత్ షా(Amit Shah) వచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీతో పాటు తెలంగాణ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణలో కేసీఆర్, టీఆర్ఎస్‌ను ఓడించేందుకు తాము అవసరం లేదని.. బండి సంజయ్ చాలు అని అమిత్ షా కామెంట్ చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్‌గా ఉండటం, ప్రస్తుతం ఆయన చేపట్టిన పాదయాత్ర సభ ముగింపు కార్యక్రమం కావడం వల్లే అమిత్ షా ఈ రకమైన వ్యాఖ్యలు చేశారా ? లేక తెలంగాణలో కేసీఆర్‌ను(KCR) ఢీ కొట్టే బాధ్యతలను బీజేపీ జాతీయ నాయకత్వం బండి సంజయ్‌కు అప్పగించిందా ? అన్నది రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కొద్దిరోజుల క్రితం బండి సంజయ్ పాదయాత్రలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సైతం ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ స్థానంలో బండి సంజయ్ కూర్చుంటేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. దీన్ని బట్టి తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి బండి సంజయ్(Bandi Sanjay) అన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. తాజాగా మహేశ్వరం సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో పార్టీ కార్యకర్తలకు, బండి సంజయ్ మద్దతుదారులకు మరింత జోష్ వచ్చినట్టు అయ్యిందనే చర్చ జరుగుతోంది.

బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను డిసైడ్ చేయడంలో ప్రధాని మోదీ, అమిత్ షా కీలక పాత్ర పోషిస్తుంటారు. అలాంటిది అమిత్ షా మహేశ్వరం సభలో కేసీఆర్‌, టీఆర్ఎస్‌ను ఓడించేందుకు బండి సంజయ్ చాలు అని అనడం ఆయనకు పెద్ద ప్లస్ అనే టాక్ మొదలైంది. తెలంగాణ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బండి సంజయ్ అని పరోక్షంగా అమిత్ షా సంకేతాలు ఇచ్చారేమో అనే వాదనలు కూడా వినిపిస్తోంది.


KCR: ఆ ఇద్దరికీ కేసీఆర్ కౌంటర్ ఇచ్చేది ఎప్పుడు ? డేట్, టైమ్ ఫిక్స్ అయ్యిందా ? కొత్త అంశాలతో..

Amit Shah| Tukkuguda : కేసీఆర్‌ను పీకిపారేయడానికి బండి సంజయ్ చాలు: తుక్కుగూడ సభలో అమిత్ షా

నిజానికి తెలంగాణ బీజేపీ పగ్గాలు బండి సంజయ్ చేతికి వచ్చిన తరువాతే రాష్ట్రంలో బీజేపీ బలపడటం మొదలైంది. ఆయన సారథ్యంలోని దుబ్బాక, హుజూరాబాద్, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది. ఇవన్నీ ఆయనకు కలిసొచ్చే అంశాలే. దీనికి తోడు బీసీ నాయకుడు కావడం కూడా బండి సంజయ్‌కు ప్లస్ అవుతుందని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తానికి మహేశ్వరం సభలో బండి సంజయ్ గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.

First published:

Tags: Bandi sanjay, Telangana

ఉత్తమ కథలు