Home /News /telangana /

TS POLITICS INTERNAL TUSSLE IN TRS PARTY IN PEDDAPALLY DISTRICT SNR PSE BRV

Peddpalli : పెద్దపల్లి జిల్లా టీఆర్‌ఎస్‌లో వర్గపోరు .. ఇదెక్కడి పెద్దపంచాయితీ అంటున్న క్యాడర్

(పెద్దపల్లిలో పెద్దపంచాయితీ)

(పెద్దపల్లిలో పెద్దపంచాయితీ)

Peddapally: పెద్దపల్లి జిల్లాలో అధికార పార్టీ నేతల్లో కొన్ని రోజులుగా లోలోపల మసులుతున్న రాజకీయ, వర్గ విబేధాలు సోమవారం ఓదెలలో జరిగిన సంఘటనతో ఒక్కసారిగా బయటపడ్డాయి. దీంతో పెద్దపల్లి జిల్లాలో హఠాత్తుగా రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీలో వర్గ పోరు తెరపైకి వచ్చింది.

ఇంకా చదవండి ...
  (Santosh,News18,Peddapalli)
  పెద్దపల్లి(Peddapalli)జిల్లాలో అధికార పార్టీ నేతల్లో కొన్ని రోజులుగా లోలోపల మసులుతున్న రాజకీయ, వర్గ విబేధాలు సోమవారం(Monday) ఓదెల(Odela)లో జరిగిన సంఘటనతో ఒక్కసారిగా బయటపడ్డాయి. దీంతో పెద్దపల్లి జిల్లాలో హఠాత్తుగా రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీలో వర్గ పోరు తెరపైకి వచ్చింది. సోమవారం ఓదెలలో జరిగిన పార్టీ సమావేశంలో దేవీలాల్ నాయక్(Devi Lal Naik), ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి(Dasari Manohar Reddy)ని ఎదురు ప్రశ్నించారు. కార్యకర్తల్లో మార్పు రావాలంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నాయక్.. మారాల్సింది మేమా? నువ్వా? అంటూ సభాముఖంగానే ఎదురు ప్రశ్నించాడు. దేవీలాల్‌కు మరో ఇద్దరు నేతలు వంతపాడుతూ 'పార్టీలోకి వసల వచ్చిన వారు గ్రామానికి ఇద్దరు ముగ్గురు ఉంటే చాలు, సీనియర్లమైన మేమెందుకు' అంటు నిలదీయడం చర్చనీయాంశంగా మారింది.

  దుమారం రేపుతున్న సీనియర్ నేత ఉత్తరం:
  సమావేశం అనంతరం దార రవి అనే తెరాస నాయకుడు నేతల ప్రసంగాన్ని ఉటంకిస్తూ బహిరంగ లేఖ రాశారు. సమావేశానికి వచ్చిన పార్టీ నేతలు కొందరు తమ అభిప్రాయాలను, భవిష్యత్తు గురించి మాట్లాడాలనుకున్నా అవకాశం రాకపోవడంతో నిరాశకు గురయ్యారంటూ రవి ఆ లేఖలో పేర్కొన్నారు. అంతే కాకుండా గ్రామాల్లో పార్టీ నాయకులు రెండు మూడు వర్గాలుగా చీలిపోయారని, గ్రామాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసి గ్రూపులను ఏకం చేసి పార్టీని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని లేఖలో స్పష్టం చేశారు. పార్టీకి చెందిన సీనియర్ నాయకుల అవేదను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని దార రవి లేఖలో పేర్కొన్నాడు.

  Kakatiya Utsav 2022 : జులై 7 నుంచి కాకతీయ వైభవ వారోత్సవాలు -రుద్రమ వంశీకుల రాక  మామిడి తోట రహస్య సమావేశం దేనికి సంకేతం:
  జిల్లాలో నాటి నుండి తెరాస పార్టీలో ఉంటూ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని ఉదృతం చేసి పార్టీని ముందుకు నడిపిన నాయకులంతా ఇప్పుడు ఎక్కడ? వారి విలువలేంటో? అన్న పరిస్థితి జిల్లా ప్రజల్లో నెలకొంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా ఉన్న సీనియర్ నాయకులకు పార్టీలో విలువ తగ్గిపోయిందన్న భావన స్పష్టంగా కనిపిస్తుంది. కొంత మంది నాయకులు గతంలో ఇతర పార్టీలకు వలసపోగా పార్టీతో అనుబంధం పెంచుకున్న టీఆర్ఎస్ నాయకులు మాత్రం ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. ఇది గమనించిన సీనియర్ నాయకులు స్థానికంగా ఓ మామిడి తోటలో రహస్య సమావేశాన్ని నిర్వహించారు.

  కార్యకర్తల్లో అయోమయం..
  ఈ రహస్య సమావేశానికి అనుకున్నవారంత హాజరు కాగా హఠాత్తుగా అక్కడికి పోలీసులు చేరుకుని ఆ నాయకులపై ఓపెన్ డ్రింక్ కేసు నమోదు చేశారు. దీంతో జిల్లాలో అగ్ర నేతలపై అందరు గుర్రు మీద ఉన్నారని తెలుస్తుంది. సమావేశం విఫలమైంది కాబట్టి బడా నాయకులు సక్సెస్ అయ్యారు, కానీ గ్రౌండ్ లెవెల్లో లీడర్ల ఆవేదనని తుంచగలరా? ఈ సమావేశం అతర్గతం మార్చగలరా? అనే మాటలు జిల్లా కార్యకర్తల్లోనూ వినిపిస్తుంది. సీనియర్ నాయకుల బహిరంగ తిరుగుబాటుతో జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటోనని వారు అనుకుంటున్నారు.

  CM KCR : కేసీఆర్ వ్యూహం మారిందా? BRSకు బైబై.. TRSపైనే ఫోకస్ -20 నుంచి జిల్లాల పర్యటన!  పెద్దపల్లి నియోజకవర్గం నుండి ఆశావాహులు:
  పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు వర్గం కూడా హల్ చల్ చేస్తోంది. ఇదే నియోజకవర్గానికి చెందిన భాను ప్రసాదరావు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. తరువాత జరిగిన పరిణామాలతో ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. అప్పటికే వ్యక్తిగతంగా అనుచరగణం ఉన్న భాను ప్రసాదరావు తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల పెద్దపల్లిలో జరిగిన ఓ సమావేశంలో ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు ఫోటోకు ప్రాధాన్యత కల్పించలేదని ఎమ్మెల్సీ వర్గీయులు గొడవకు దిగడంతో ఈ సమావేశం రసాభాసగా మారింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాను ప్రసాదరావుకు అండగా నిలిస్తే వచ్చే ఎన్నికల్లో ఢోకా ఉండదని దాసరి మనోహర్ రెడ్డి బావించారన్న ప్రచారం కూడా ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఎమ్మెల్సీ వర్గం మాత్రం మనోహర్ రెడ్డికి అనుకూలంగా మాత్రం మారలేదని ఆ తరువాత నెలకొన్న పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

  ఇలాగైతే పార్టీకే నష్టమని టాక్..
  పార్టీలో మరో నాయకుడు నల్ల మనోహర్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ కావాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. జూలపల్లి జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మణ్ కూడా వచ్చే ఎన్నికల్లో ఆశావహుల జాబితాలో చేరిపోయారు. నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నందున బీసీకే టికెట్ ఇవ్వాలన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. గ్రూపు రాజకీయాలతో తలనొప్పిగా మారినప్పటికీ తన వర్గాన్ని కూడా పెంచి పోషించుకుంటున్న మనోహర్ రెడ్డిపై మాత్రం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సీనియర్లను కూడేసుకున్నరట. ఏదేమైనా పెద్దపల్లిలో అధికార టీఆర్ఎస్ నేతలు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం పార్టీకి నష్టం తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  BJP | TRS : మేం వస్తే భాగ్యనగరంగా మార్చేస్తాం .. ముందు అక్కడ మార్చి చూపించండి .."హైదరాబాద్‌ టైటిల్‌ ఫైట్ "  పార్టీ జిల్లా అధ్యక్షుడి మాటకు లెక్కలేదా?:
  ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి విజయం సాధించిన రామగుండం ఎమ్మెల్యే కొరుకంటి..అనేక అనూహ్య పరిణామాల నడుమ తెరాస పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజులకే రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్‌కు సన్నిహితుడిగా మారాడు కోరుకంటి. ఇటీవల రాష్ట్రంలో ఏర్పడ్డ అనూహ్య రాజకీయ పరిణామాల దృష్ట్యా తెరాస పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్ష పదవులను కొత్తగా కట్టబెట్టింది. పెద్దపల్లి జిల్లాకు అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మల్యే కోరుకంటి చందర్ ను నియమించారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Local News, Peddapalli

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు