మునుగోడు బైపోల్ (Munugodu Bypoll) కు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) కి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) కుటుంబానికి చెందిన కంపెనీ నుండి మునుగోడులోని పలువురికి రూ.5.2 కోట్లను బదిలీ చేశారు. అక్టోబర్ 14, 18, 29 తేదీల్లో బదిలీ జరిగిందని టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నగదు బదిలీ ఆరోపణలపై ఈసీకి (Election Commission) అక్టోబర్ 31 సాయంత్రం 4 గంటల లోపు సమాధానం ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఈసీ (Election Commission) ఇచ్చిన నోటిసులపై మునుగోడు (Munugodu) బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) స్పందించారు. సుశి ఇన్ఫ్రా అకౌంట్ నుంచి బదిలీ అయిన నగదు బదిలీకి తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కు వివరణ కూడా ఇచ్చామన్నారు. టీఆర్ఎస్ ఓడిపోతుందనే ఇలాంటి ఫిర్యాదులకు పాల్పడుతున్నారన్నారు. మునుగోడు ఉపఎన్నికలో (Munugodu Bypoll) ఆ పార్టీని బొందపెట్టడం ఖాయమని హెచ్చరించారు.
ఈ నగదుతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) వివరణ ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) కి నోటీసులు ఇచ్చింది. సుశి ఇన్ఫ్రా అండ్ డెవలప్ మెంట్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతా నుండి 23 మందికి నగదు బదిలీ జరిగినట్లు ఫిర్యాదులో తెలిపింది. ఈ బదిలీని మీరు లేదా మీ ఆదేశాల మేరకు కుటుంబ యాజమాన్యంలోని కంపెనీ ద్వారా జరిగితే 23 వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయబడిన ఈ ఫండ్ ఓటరు ప్రేరణ కోసం ఉపయోగించకుండా చూసుకోవడం మీ బాధ్యత. ఇది అవినీతి పద్ధతి అని ఈసీ నోటీసుల్లో పేర్కొంది.
ఇక మునుగోడు ఉపఎన్నిక (Munugodu Bypoll) ప్రచారం రేపటితో ముగియనుంది. దీనితో ఆయా పార్టీల క్యాడర్ అంతా మునుగోడు (Munugodu) లోనే మకాం వేసి ప్రచారాన్ని స్పీడ్ పెంచారు. ఇంటింటికి తిరుగుతూ..ఓటర్లను కలుస్తూ తమ పార్టీనే గెలిపించాలని కోరుతున్నారు. కానీ తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఓటర్ల నాడి ఎలా ఉందో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Komatireddy rajagopal reddy, Munugodu By Election, Telangana