హోమ్ /వార్తలు /తెలంగాణ /

Revanth Reddy: నాకు వేరే మార్గం లేదు..నన్ను ఒంటరిని చేశారు..మీడియా ముందు కంటతడి పెట్టుకున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy: నాకు వేరే మార్గం లేదు..నన్ను ఒంటరిని చేశారు..మీడియా ముందు కంటతడి పెట్టుకున్న రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

ఇక మునుగోడు బైపోల్ (Munugodu By poll) ను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో ప్రచారాన్ని రేవంత్ రెడ్డి  (Revant Reddy) తన భుజాలపై వేసుకున్నారు. మునుగోడులో ఆడబిడ్డ పాల్వాయి స్రవంతిని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. అయితే నిన్న మునుగోడు  (Munugodu By poll) ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి  (Revant Reddy) మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీపీసీసీ చీఫ్ గా ఎన్నికైన తరువాత రేవంత్ రెడ్డి (Revanth Reddy) దూకుడు పెంచారు. సమయం దొరికినప్పుడల్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అవినీతిని ఎండగడుతూ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అలాగే వీలు దొరికినప్పుడు ప్రజలతో నిత్యం మమేకమై కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ సమక్షంలో పలువురు TRS, BJP నాయకులూ హస్తం గూటికి చేరారు. గతంతో పోలిస్తే కాంగ్రెస్ బలం పెరుగుతూ వస్తుంది.

Munugode: మునుగోడులో తేడా వచ్చిందో.. మీ పనీ.. నా పనీ ఔట్.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..

 ఇక మునుగోడు బైపోల్ (Munugodu By poll) ను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో ప్రచారాన్ని రేవంత్ రెడ్డి  (Revant Reddy) తన భుజాలపై వేసుకున్నారు. మునుగోడులో ఆడబిడ్డ పాల్వాయి స్రవంతిని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. అయితే నిన్న మునుగోడు  (Munugodu By poll) ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి  (Revant Reddy) మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. మునుగోడు ప్రచారంలో నన్ను ఒంటరిని చేశారు. వీళ్లను ఎదుర్కోడానికి నాకు ఏ మార్గం లేదు. నన్ను నిస్సయుణ్ణి చేసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు కుట్రపన్నారని వాపోయారు. రేవంత్ రెడ్డి  (Revant Reddy) నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. కాబట్టి రేవంత్ రెడ్డిని  (Revant Reddy) టీపీసీసీ పదవి నుండి తొలగించాలని సీఎం కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు. తనకు పీసీసీ పదవి వచ్చినందుకు సీనియర్ నాయకులు కక్ష పెంచుకొని కుట్రలు చేస్తున్నారన్నారు. తనను అభిమానించే వాళ్లకు, కార్యకర్తలకు తన మనసులోని బాధను చెబుతున్నాని అన్నారు. నన్ను రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని సొంత పార్టీ నాయకులతో పాటు బీజేపీ , టిఆర్.ఎస్ నాయకులపై ఆరోపణలు చేశారు.

మునుగోడులో  (Munugodu By poll)లో  పెద్ద కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీని చంపటానికి ఎత్తులు వేస్తున్నారు. వారి ఎత్తులను చిత్తు చేసి పార్టీని కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి  (Revant Reddy) కార్యకర్తలకు సూచించారు. నేను కూడా పోలీస్ తూటాలకు ఎదురు నిలబడతా అని రేవంత్ రెడ్డి  అన్నారు. కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడానికి సీఎం కేసీఆర్ సుఫారీ తీసుకున్నాడు. మునుగోడుకు రండి పార్టీని కాపాడుకుందాం. దివిసీమలా తెలంగాణ కాకూడదని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

లాటి తూటాలకైనా తుపాకి గుండ్లకైనా నేను సిద్ధం! ప్రాణాలు సైతం ఇచ్చేందుకు చివరి శ్వాస వరకు కాంగ్రెస్ కోసం పని చేస్తా!

కాంగ్రెస్ని బ్రతికించుకుందాం!పార్టీ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి గారి పిలుపు!

మునుగోడుకు రండి పార్టీని కాపాడుకుందాం దివిసీమలా మన రాష్ట్రం కాకూడదు

- @revanth_anumula pic.twitter.com/FrQONe2jIi

— Telangana Congress (@INCTelangana) October 20, 2022

అందుకోసం 10 రోజుల పాటు ఢిల్లీలో ప్రధాని మోడీ, అమిత్ షాలతో రహస్య మంతనాలు జరిపారన్నారు. మునుగోడు బైపోల్ లో కాంగ్రెస్ ను ఓడించి పీసీసీ అధ్యక్షుడిగా నన్ను తొలగించాలని చూస్తున్నారని రేవంత్  (Revant Reddy) ఆరోపించారు. తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని, పార్టీ కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధం అని రేవంత్ పేర్కొన్నారు.

మునుగోడులో  (Munugodu) రెండు అధికార పార్టీలైన బీజేపీ,టీఆర్ఎస్ డబ్బును వెదజల్లుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని చంపాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనీ కార్యకర్తలకు సూచించారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, పీసీసీ పదవి సోనియా గాంధీ ఇచ్చిన అవకాశమని రేవంత్  (Revant Reddy) అన్నారు. తనకు పీసీసీ పదవి వచ్చిన దగ్గరి నుండి కేసీఆర్, బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఇప్పుడు తాను ఒంటరి వాడయ్యానని రేవంత్ రెడ్డి (Revant Reddy) కన్నీటి పర్యంతమయ్యారు. కావాలనే ఎన్నికల బరిలో తనను ఒక్కడిని ఏకాకిగా వదిలేశారని తన మనసులోని బాధను రేవంత్ రెడ్డి  (Revant Reddy) మీడియాతో  చెప్పుకొచ్చారు.

First published:

Tags: Congress, Munugodu By Election, Revanth Reddy

ఉత్తమ కథలు