TS POLITICS HUZARABAD MLA ITALA RAJENDER ALLEGED THAT CM KCR WAS CONSPIRING TO USE THE ISSUE OF BUYING PADDY GRAIN FROM FARMERS IN TELANGANA AS A POLITICAL WEAPON MBNR PRV
BJP| Telangana: తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు.. సీఎం కేసీఆర్పై ఈటల ధ్వజం
ప్రెస్మీట్లో ఈటల, డీకే అరుణ
వెయ్యి కోట్లు ఖర్చు పెడితే తెలంగాణలో రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయొచ్చు.. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరి అంశాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు
మహా అంటే రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెడితే తెలంగాణ (Telangana)లో రైతుల నుంచి వరి ధాన్యాన్ని (Grains) కొనుగోలు చేయొచ్చు.. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) వరి అంశాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Huzarabad MLA Itala Rajender) ఆరోపించారు. శనివారం మహబూబ్ నగర్ (Mahbubnagar) జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్స్ లో నిర్వహించిన రైతు సదస్సు కార్యక్రమానికి డీకే అరుణ (DK Aruna), ఈటల రాజేందర్ హాజరయ్యారు. టీఆర్ఎస్ కుట్రలు కుతంత్రాలు ఇక సాగవు వచ్చేది ఇక బీజేపీ (BJP) ప్రభుత్వమేనని ఈటల స్పష్టం చేశారు. దేశంలో 18 రాష్ట్రాలలో అధికారంలో ఉండటంతో పాటు, 18 కోట్ల మంది సభ్యత్వాలను కలిగి ఉన్న భారతీయ జనతా పార్టీని మీరు బంగాళాఖాతంలో కలిపేస్తారు అంటున్నారు.. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. గత ఏడాది యాసంగిలో 60 లక్షల ఎకరాలలో వరి సాగు అయితే ఏడాది 30 లక్షల ఎకరాల్లోనే సాగిందన్నారు..
బీజేపీ (BJP)కి రాష్ట్రంలో లభిస్తున్న ఆదరణను తట్టుకోలేక తెలంగాణ రాబందుల సమితి నేతలు సోయి దప్పి వడ్ల రాజకీయాలు చేస్తున్నారని డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రకరకాల అబద్ధాల హామీలు ఇచ్చి రెండు సార్లు అధికారంలోకి వచ్చాడు.. మూడోసారి అధికారాన్ని చేపట్టేందుకు అవకాశాలు లేకపోవడం తో ఆందోళన చెందుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. హుజురాబాద్ ఎన్నికలలో 600 కోట్లకు పైగా ఖర్చు చేసినా ఈటల రాజేందర్ గెలుపొందడంతో ఇక తమ పతనం ఆరంభమయిందన్న భయం కేసీఆర్ను వెంటాడుతోందని డీకే అరుణ అన్నారు.
జనం నవ్వుకుంటున్నరు..
‘‘ఇన్నాళ్లు సెంటిమెంటుతో.. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినవ్.. రైతులకు హామీలు ఇచ్చింది నువ్వు.. పండిన పంటను కొంటాను అని చెప్పింది మీరు కాదా.. హామీలు ఇచ్చేది నువ్వైతే.. కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు చేయాలా..? ”అని అరుణ ప్రశ్నించారు. మీ దీక్షలను.. ఆందోళనలను చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల నుంచి తట్టెడు మన్ను అయినా బయటకు తీశారా..? పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ను పూర్తి చేశారా అని డీకే అరుణ ఘాటుగా ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో నీ మోసపు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు.. డబ్బులు.. అధికారంతో గెలవలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు శాంతకుమార్, ఎంఎం శ్రీనివాస్ రెడ్డి, పద్మజా రెడ్డి, బాలరాజు, సుదర్శన్ రెడ్డి, అంజయ్య, రామకృష్ణ, రామాంజనేయులు, ఎగ్గని నర్సింహులు, భరత్ కుమార్ గౌడ్, బాల త్రిపుర సుందరి, కొంగలి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.