తెలంగాణ రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్(Puvvada Ajay)తో పాటు ఆయన సతీమణి వసంత లక్ష్మి (Vasantha Lakshmi)పూజలో ఉండగా తేనెటీగలు (Honeybees)దాడి చేశాయి. ప్రముఖ దివ్యక్షేత్రం యాదాద్రి ఆలయం(Yadadri temple)లో సోమవారం(Monday) మహాకుంభ సంప్రోక్షణలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. ఉదయం 11.45గంటల సమయంలో ఆలయ పంచతల గోపురంపై పూజా క్రతువులో ఉన్న సమయంలో మంత్రి, వేద పండితులు, మంత్రి వ్యక్తిగత భద్రత సిబ్బందిపైన తేనెటీగల దాడి చేశాయి. పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్దలతో నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో మధ్యలో ఆపకూడదన్న ఆలోచనతో కొంత సేపు భుజంపై వేసుకున్న కండువాను ముఖానికి చుట్టుకొని పూజ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అయితే అప్పటికే మంత్రితో పాటు పూజారులు, వ్యక్తిగత భద్రత సిబ్బందిపైన తేనెటీగలు కుట్టడంతో ట్రీట్‌మెంట్ నిమిత్తం మంత్రి అజయ్ హైదరాబాద్(Hyderabad)కు బయల్దేరివెళ్లారు. ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.
పూజలో ఉండగానే..
మంత్రి పువ్వాడ అజయ్ పూజ చేస్తున్న సమయంలో ఆయ సతీమణి సైతం ఆయన పక్కనే ఉన్నారు. మంత్రి దంపతులు తేనెటీగలకు భయపడి పూజ మధ్యలో ఆపకపోవడంతో మిగిలిన అర్చకులు, సెక్యురిటీ సిబ్బంది అందరూ అక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. తేనెటీల దాడి నుంచి మంత్రిని కాపాడేందుకు వేరే మార్గం కూడా లేకపోవడంతో ఎవరికి వారు వాటి బారి నుంచి తప్పించుకున్నారు.
మంత్రిపై తేనెటీగలు దాడి..
మంత్రిపై తేనెటీగలు దాడి చేసిన వార్త తెలుసుకొని పార్టీ శ్రేణులు, అభిమానులు, ఆందోళన చెందుతూ మంత్రికి ఫోన్ చేశారు. అభిమానులతో మంత్రి పువ్వాడ అజయ్ ఫోన్‌లో మాట్లాడారు. తాను క్షేమంగానే ఉన్నానని..డాక్లర్లు రెండ్రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లుగా మంత్రి పువ్వాడ అజయ్ ట్విట్టర్ ద్వారా పేర్కోన్నారు.
యాదాద్రి ఆలయం పునః ప్రారంభం సందర్భంగా సోమవారం జరిగిన మహాకుంభ సంప్రోక్షణ, ఆలయ పశ్చిమ గోపురం(సప్తతల గోపురం)పై పూజాలో ఉన్న సందర్భంలో అనుకొని రీతిలో తేనెటీగల దాడి. 2రోజుల పాటు పూర్తి విశ్రాంతిలో ఉండాలని వైద్యులు సూచించారు. కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందొద్దు. నేను క్షేమంగా ఉన్నాను. pic.twitter.com/VsFQdfDKxZ
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) March 28, 2022
త్వరగా కోలుకోవాలని..
మంత్రితో మాట్లాడి క్షేమసమాచారం తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు తమ నాయకుడికి ఏమీ కావద్దని పూజలు చేస్తున్నారు. త్వరగా కోలుకోని ఆలయాల్లో పూజలు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Puvvada Ajay Kumar, Siddipet, Yadadri temple