(G.Srinivas Reddy,News18,Khammam )
ఖమ్మం(Khammam)జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ(BJP) నాయకుడు సామినేని సాయిగణేష్(Samineni Saiganesh)కేసు విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖమ్మం పోలీసుల వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నానని మృతుని డెత్ స్టేట్‌మెంట్ (Death Statement)ఆధారంగా ఈకేసును సీబీఐ(CBI) ద్వారా దర్యాప్తు జరిపించాలని కోరుతూ న్యాయవాది అభినవ్ (Abhinav)ఉన్నత న్యాయస్థానం(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపించిన కోర్టు తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ (Puvada Ajaykumar)సహా మొత్తం ఎనిమిది మంది ప్రతివాదులకు నోటీసులు (Notices) జారీ చేసింది. అయితే సాయి గణేష్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్న అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ (Advocate General BS Prasad).అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తెలిపారు. కొంత సమయం ఇస్తే పూర్తి వివరాల తో కౌంటర్ ధాఖలు చేస్తామని ఏజీ తెలపగా.. తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది హైకోర్టు. బీజేపీ నేత ఆత్మహత్య కేసు విషయంలో కోర్టు వెర్షన్ ఈరకమైన తీర్పు వెల్లడిస్తే..అటు రాష్ట్రప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్(Congress), కేంద్ర పెద్దలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
అప్రజాస్వామిక పాలన సాగుతోంది..
మృతి చెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ కుటుంబాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. సంస్మరణ సభకు హాజరై సాయిగణేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆత్మహత్య గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సాయి గణేష్ కుటుంబానికి పార్టీ అన్నీ విధాలుగా అండగా ఉంటుందని కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మృతుని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సాయిగణేష్ లాంటి యువ కార్తకర్తను కోల్పోవడం బీజేపీకి తీరని లోటన్నారు. తెలంగాణలో అప్రజాస్వామిక పాలన సాగుతోందన్నారు. రాష్ట్రంలో మరో పార్టీ ఎదగకుండా కుట్రలు పన్నుతున్నారని సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. ఖమ్మంలో మంత్రి ఆగడాలు హద్దుమీరుతున్నాయన్న కిషన్‌రెడ్డి సాయిగణేష్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు.
రగులుతున్న ఆత్మహత్య వ్యవహారం..
సాయిగణేష్ మృతిపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాయి. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా సాయిగణేష్ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. కాంగ్రెస్ సీనియర్‌లు వీహెచ్, రేణుకాచౌదరి కూడా మంత్రి పువ్వాడ అజయ్‌పై పరోక్ష విమర్శలు చేశారు. రాష్ట్రంలో రాచరిక , అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తోందన్నారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం మృతుని కుటుంబాన్ని కలిసి స్వయంగా పరామర్శిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాయిస్ మారింది..
టీఆర్‌ఎస్‌పై జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ టార్గెట్‌గా విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టడంపై మంత్రి అజయ్ డైలమాలో పడ్డారు. ఆక్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కమ్మ సామాజికవర్గానికి చెందిన వాటిని కాబట్టే మంత్రి పదవి ఇచ్చారని..ఇప్పుడు ఆ పదవి లేకుండా చేయాలనే అన్ని పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. అంతే కాదు తెలంగాణ రాజకీయాల్లో ఏపీ పొలిటిక్స్ ప్రస్తావన తెచ్చారు పువ్వాడ అజయ్. పార్టీలకు అతీతంగా కమ్మ సామాజికవర్గం ఏకతాటిపై రావాలని పువ్వాడ అజయ్ చేసిన కామెంట్స్ అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.బీజేపీ నాయకుడి సూసైడ్ కేసులో పొలిటికల్ వార్ ఏ స్థాయికి చేరుతుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Telangana, Telangana bjp, TRS leaders