హోమ్ /వార్తలు /తెలంగాణ /

Flash News: ఫామ్ హౌజ్ లో ముందే కెమెరాలు, రికార్డింగ్ వ్యవస్థ పెట్టారా..ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు రియాక్షన్

Flash News: ఫామ్ హౌజ్ లో ముందే కెమెరాలు, రికార్డింగ్ వ్యవస్థ పెట్టారా..ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు రియాక్షన్

హైకోర్టు

హైకోర్టు

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆడియో క్లిప్ 1, ఆడియో క్లిప్ 2 బయటకు రాగా రాష్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో ఎమ్మెల్యేల (Telangana Mlas) కొనుగోలు వ్యవహారంలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆడియో క్లిప్ (Audio Clip) 1, ఆడియో క్లిప్  (Audio Clip) 2 బయటకు రాగా రాష్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు ఘటనకు సంబంధించి హైకోర్టులో (High court) విచారణ జరుగుతుంది. ఫామ్ హౌజ్ లో ముందే కెమెరాలు, రికార్డింగ్ వ్యవస్థ పెట్టారా అని కోర్టు  (High court) సూటిగా ప్రశ్నించింది. ప్రతీ కేసులో 41A CRPC నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయాలన్నా నిబంధన లేదు అని కోర్టు  (High court) స్పష్టం చేసింది. అలాగే నిందితులు 24 గంటలు హైదరాబాద్ (Hydreabad) ను విడిచి పెట్టి వెళ్లోద్దని కోర్టు  (High court) స్పషం చేసింది. నిందితుల వివరాలను సీపీకి అప్పగించాలని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను రేపటికి హైకోర్టు  (High court) వాయిదా వేసింది. మరి ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై ఇంకెన్ని ఆధారాలు బయటకు వస్తాయో చూడాలి.

Telangana: ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు..యాదాద్రిలో తడిబట్టలతో బండి సంజయ్ ప్రమాణం

ఈ ఘటనలో నిందితుల రిమాండ్‌ను కోర్టు తోసిపుచ్చడం.. పోలీసులతో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా గట్టి ఎదురుదెబ్బగా మారింది. ఎమ్మెల్యేను కొనుగోలు చేసి.. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్రలు చేసిందని తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించిన క్రమంలోనే.. రిమాండ్ రిపోర్టును కోర్టు కొట్టి వేయడం సంచలనంగా మారింది. అసలు ఇందులో ఆధారాలే లేవని స్పష్టం చేయడం గులాబీ దళానికి ఇబ్బందిగా మారింది. అంతేకాదు బీజేపీ (Bjp) కూడా అంతే దూకుడుగా ఉంది. టీఆర్ఎస్‌పై (Trs) ఎదురుదాడికి దిగుతోంది. ఇదంతా డ్రామాా అని.. మునుగోడు ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే.. కట్టు కథ అల్లారని విరుచుకుపడుతోంది.

వాస్తవానికి ఫామ్‌హౌస్ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని.. తద్వారా మునుగోడు ఉపఎన్నికల్లో (Munugodu By Poll) లబ్ధి పొందాలని టీఆర్ఎస్ భావించింది. కానీ నిందితుల వద్ద డబ్బు దొరక్కపోవడం, బలమైన సాక్ష్యాలు లేకపోవడం, రిమాండ్ పిటిషన్‌ను కోర్టు (Court) తిరస్కరించడంతో.. టీఆర్ఎస్ పార్టీ కొంత డీలా పడింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు. మీడియా ముందు మాట్లాడలేదు. సీఎం కేసీఆర్ (Cm Kcr) ప్రెస్ మీట్ పెట్టి.. బీజేపీని ఎండగడతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన కూడా మౌనంగా ఉన్నారు. తాజా పరిణామాలు టీఆర్ఎస్‌కి కొంత ఇబ్బందిగా మారవచ్చే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

First published:

Tags: Bjp, Highcourt, Trs

ఉత్తమ కథలు