హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana politics: అప్పుడు ప్రగతిభవన్​.. ఇపుడు రాజ్​భవన్​​.. తెలంగాణలో సమస్యల పరిష్కార వేదిక మారిందా?

Telangana politics: అప్పుడు ప్రగతిభవన్​.. ఇపుడు రాజ్​భవన్​​.. తెలంగాణలో సమస్యల పరిష్కార వేదిక మారిందా?

తమిళిసై, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

తమిళిసై, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

ఓ వైపు కేసీఆర్​ జాతీయ రాజకీయాల్లో పాగా వేయడానికి దేశం అంతా పర్యటిస్తుంటే.. తెలంగాణలోనే ఉన్న గవర్నర్​ మాత్రం రాజ్​భవన్​ వేదికగా సమావేశాలకు తెరదీశారు. 

ఒకప్పుడు తెలంగాణ రాజకీయం (Telangana Politics) ప్రగతిభవన్ (Pragathi Bhawan))​ చుట్టూ తిరిగేది. ఇపుడు రాజ్​భవన్ (raj Bhawan)​ చుట్టూ తిరుగుతోంది. టీఆర్​ఎస్​ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసై (Governor Tamilsai)కి విబేధాలు రావడంతో అటు కేసీఆర్​ గానీ, ఇటు తమిళిసై గానీ ఒకే కార్యక్రమంలో కలిసింది అరుదు. మామూలుగా ప్రగతి భవన్​నే టీఆర్​ఎస్ (TRS)​ ప్రభుత్వం రాజకీయాలకు వేదికగా చేసుకుంటుంది. సామాన్యుడి నుంచి మంత్రుల వరకు అక్కడికే వెళతారు. అయితే ఓ వైపు కేసీఆర్​ (CM KCR) జాతీయ రాజకీయాల్లో పాగా వేయడానికి దేశం అంతా పర్యటిస్తుంటే.. తెలంగాణలోనే ఉన్న గవర్నర్​ మాత్రం రాజ్​భవన్​ వేదికగా సమావేశాలకు తెరదీశారు.  ఇటీవలె మహిళా దర్బార్​  (Mahila Durbar)పేరిట సభ ఏర్పాటు చేసి టీఆర్​ఎస్​ ప్రభుత్వానికి జలక్​ ఇచ్చారు. ఇపుడు తాజాగా బీజేపీ లీడర్లు సైతం సమస్య పరిష్కారం కొరకు రాజ్​భవన్​ మెట్లు ఎక్కారు.

చట్టప్రకారం రావాల్సిన పరిహారాన్ని అడిగితే..

గౌరవెల్లి నిర్వాసితులతో కలిసి బండి సంజయ్ (Bandi Sanjay) బుధవారం గవర్నర్ ను కలిశారు. నిర్వాసితుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిర్వాసితులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని చట్టప్రకారం రావాల్సిన పరిహారాన్ని అడిగితే టార్గెట్ చేసి యువకులు, మహిళలపై పోలీసుల చేత దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఓ రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, స్థానిక ఎమ్మెల్యే అండదండలతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. మహిళల పట్ల పోలీసులు నీచంగా ప్రవర్తించారని, నిర్వాసితులపై దాడులు జరుగుతుంటే కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టులో భూనిర్వాసితుల రక్తం పారేలా చేస్తున్న కేసీఆర్ కు బాధితుల ఉసురు తగులుతుందని అన్నారు. ఇకనైనా కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. కమీషన్ల కోసం ప్రాజెక్టు అంచనాలను పెంచి కేసీఆర్ నిర్వాసితులకు మాత్రం న్యాయం చేయలేకపోతున్నారని మండి పడ్డారు.

కేసీఆర్‌కు మంచి పేరు వస్తోందని..

రెచ్చగొట్టే మాటలతో అమాయక ప్రజల్ని కాంగ్రెస్ (congress) , బీజేపీ (bjp) మోసం చేస్తున్నాయని  మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బుధవారం హరీశ్​ మీడియాతో మాట్లాడారు.  కేసీఆర్‌ (KCR)కు మంచి పేరు వస్తోందని తట్టుకోలేక ఇలాంటి పనులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గౌరవెల్లి ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్, బీజేపీలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు.

గతంలో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఇలాగే చేశాయని హరీశ్ రావు అన్నారు. కోర్టులో కేసులు వేసి నిర్వాసితులను రెచ్చగొడుతున్నారని .. నిర్వాసితుల్లో ఎవరినైనా బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించామా అని మంత్రి ప్రశ్నించారు. అనవసరమైన పుకార్లు నమ్మొద్దని.. కాంగ్రెస్, బీజేపీ వలలో పడొద్దని హరీశ్ కోరారు. ప్రాజెక్ట్ పనులు చేసుకుంటున్న అధికారుల్ని ఇబ్బంది పెట్టారని.. అందుకే అధికారులు పోలీసులను ఆశ్రయించారని హరీశ్ పేర్కొన్నారు.

First published:

Tags: Bandi sanjay, Governor Tamilisai, Harish Rao, Raj bhawan, Telangana Politics

ఉత్తమ కథలు