గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మేయర్ రాజ్‌భవన్ ముందు ఆందోళన చేపట్టారు. ఈక్రమంలో మేయర్ విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు మండిపడుతున్నారు.
రాజ్‌భవన్ ముందు రచ్చ ..
బీజేపీ చీఫ్ బండి సంజయ్ మహిళా ప్రజాప్రతినిధి కల్వకుంట్ల కవితపై నోరు పారేసుకోవడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇందులో భాగంగానే శనివారం ఉదయం నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా బండి సంజయ్ దిష్టిబొమ్మలను తగలబెట్టి నిరసనలు చేపట్టారు. బండి సంజయ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడానికి మేయర్ విజయలక్ష్మీ, బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు వెళ్లారు. రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో గేటు ముందు ప్లకార్లుడు ప్రదర్శించారు. అక్కడున్న గోడకు పేపర్లు అంటించడంతో పోలీసులు అడ్డుకున్నారు.
#BRS women leaders & Mayor @GadwalvijayaTRS, wants to meet Governor @DrTamilisaiGuv to submit a memorandum against #Telangana #BJP chief #BandiSanjayKumar for his remarks on #MLCKavitha , they pasted near Rajbhavan, after didn't got appointment.#KalvakuntlaKavitha #Hyderabad pic.twitter.com/kNV5J4t2ck
— Surya Reddy (@jsuryareddy) March 11, 2023
మేయర్ అరెస్ట్ ..
కొద్ది సేపు రాజ్‌భవన్ గేటు ముందు భైటాయించిన మహిళా కార్పొరేటర్లు, మేయర్ అటుపై బండి సంజయ్‌పై నిరసన తెలుపుతూ తెచ్చిన ఫిర్యాదు పత్రాన్ని రాజ్‌భవన్ గోడకు అంటించారు. దీంతో పోలీసులు మేయర్ విజయలక్ష్మిని అరెస్ట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: GHMC, Telangana News